సూర్య, చంద్ర గ్రహణాల కారణంగా కీడు సంభవిస్తుందా?

సూర్య, చంద్ర గ్రహణాల కారణంగా మానవులకు కీడు సంభవిస్తుందన్నది పురాతన రోమన్, గ్రీకు జాతులు మరియు ఇతర ప్రాచీన జాతుల్లో నుండి పుట్టుకొచ్చిన ఓ ముఢాచారం.

ఇదే ప్రాచీన ముఢాచారం కాలక్రమేణా భారత దేశంలోనూ ప్రవేశించింది. సూర్య, చంద్ర గ్రహణాలన్నవి భూమిపై మానవుడు పుట్టక ముందు నుండీ జరుతూ వస్తున్న సాధారణ ప్రక్రియలు. చంద్రునికీ, సూర్యునికీ మధ్య భూమి వచ్చినప్పుడో.. సూర్యునికీ, భూమికీ మధ్య చంద్రుడు వచ్చినప్పుడో ఏర్పడే సూర్య, చంద్ర గ్రహణాల ద్వారానో, వాటి ఆధారంగా ఏర్పడే నీడల వల్లనో మనుషులకు కీడు సంభవిస్తుందనో, అశుభం జరుగుతుందనో ఏ ధార్మిక గ్రంథమూ చెప్పటం లేదు.

ప్రాచీన అరేబియా ప్రజల్లో అయితే ప్రముఖులు చనిపోయినప్పుడు గ్రహణాలు ఏర్పడుతుంటాయన్న మూఢ నమ్మకాన్ని కలిగి ఉండేవారు.

సరిగ్గా అలాంటి సందర్భంలోనే ప్రవక్త ముహమ్మద్ (స) స్వంత కొడుకు ఇబ్రాహీం అనారోగ్యం కారణంగా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మరణించటం జరుగుతుంది. అదే రోజు సూర్య గ్రహణం సంభవిస్తుంది. ఆ పిల్లవాడు చనిపోయిన మరణంగానే ఆరోజు సూర్యగ్రహణం సంభవించిందని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు.

ఆ సందర్భంలో స్వయంగా ప్రవక్త ముహమ్మద్(స) ప్రజల మధ్య నిలబడి “సూర్యుడు, చంద్రుడు సృష్టికర్త అయిన దేవుని చిహ్నాలు మాత్రమే. ఏ వ్యక్తి పుట్టుక, మరణం కారణంగా గ్రహణాలు ఏర్పడవు” అని చెప్పి ఆనాటి అరబ్బుల్లో ఉండే ముఢాచారాన్ని ఖండించటం జరుగుతుంది.

మత వ్యవస్థలో ఇలాంటి ఎన్నో ముఢనమ్మకాల్ని మేము మాత్రమే ఖండిస్తున్నామన్నది నాస్తిక వర్గం కలిగి ఉండే ఓ మూఢ నమ్మకం! అంతకు ముందు నుండే ధర్మ శాస్త్రాల ధర్మం ఖండించటం ప్రారంభించిందనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే అవగాహన ఉన్న విషయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *