“అన్ని సమస్యల్నీ పరిష్కరించేది ఒక్క ఇస్లాం మాత్రమే”

ఈ మాట చెబుతుంది ఎవరో మద్రాసా మౌల్వీనో మస్జిద్ ఇమామో కాదు ఒళ్లంతా పచ్చ బొట్లు పొడిపించుకుని నల్లటి కల్లాద్దాలు పెట్టుకుని స్టూడియోలో స్టైల్ గా కూర్చొని ‘ఆండ్రూ టేట్’ ఒక ఇంటర్యూలో చెబుతున్న మాట ఇది.

ఎవరీ ‘ఆండ్రూ టేట్’? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇతని పేరు మారుమ్రోగిపోతుంది. ఇంటర్నేషనల్ సెలబ్రిటీ మరియు పుట్టుకతో క్రైస్తవుడైన ‘ఆండ్రూ టేట్’యునైటెడ్ స్టేట్స్ కు చెందిన మాజీ ప్రొఫెషనల్ కిక్ బాక్సర్, వేల కోట్లకు అధిపతి, స్వంత చార్టెడ్ ఫైట్స్, లగ్జరీ కార్లతో కింగ్ సైజ్ లైఫ్ గడిపే ఇతను “ఇస్లాం స్వీకరించి నేను ముస్లింగా మారిపోయాను” అని ప్రకటించటంతో సోషల్ మీడియా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ప్రపంచం ఇతని గురించి మాట్లాడుకోవటం మొదలెట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఇస్లాంను స్వీకరిస్తుంటారు! కానీ, ఆండ్రూ టేట్ ఇంటర్నేషనల్ సెలబ్రిటీ మాత్రమే కాక సోషల్ మీడియాలో కాంట్రవర్షియల్ ఫిగర్ అవ్వటం కారణంగా “నేను ఇస్లాం స్వీకరించి ముస్లింగా మారిపోయానని” చేసిన ఒక ప్రకటన కొన్ని నిమిషాల్లో ప్రపంచ వ్యాప్తంగా దావాలనంలా వ్యాపించిపోయింది. పైగా “మంచిని విశ్వసించి చెడుపై పోరాటం చెయ్యాలనుకునే ఏ క్రైస్తవుడైనా ఇస్లాం స్వీకరించాల్సిందే. అందుకే నేను ఇస్లాం స్వీకరించాను” అంటూ ఇతను చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

అదేంటి? మానవాళి ఎదుర్కునే సమస్యలన్నిటినీ ఇస్లాం పరిష్కరించ గలగటమేంటి? నిత్యం మీడియాలో వినేది వేరుకాదా? అన్న ఆశ్చర్యంతో కూడిన సందేహం ఇస్లామోఫోబియాను అన్ని విధాలుగా వెళ్లగక్కే మీడియా ప్రభావానికి గురైన చాలా మందికి కలగవచ్చు. ఎందుకంటే మీడియా ప్రభావానికి గురైన చాలా మంది మెదళ్లకు ట్యూన్ చేసి పెట్టిందేమిటంటే- ఇస్లాం ఉగ్రవాదాన్ని ప్రేరేపించే మతం, అనేక సమస్యలకు ఇస్లామే మూలం అన్నది.

అజ్ఞానంతో ఇలాంటి గాసిప్స్ ప్రభావానికి గురైపోయి ఇస్లాం పట్ల ఒకరకమైన వ్యతిరేక భావజాలాం ఏర్పర్చుకోకుండా స్వంత మెదళ్లు ఉపయోగించి ఖురాన్ ను, ప్రవక్త ముహమ్మద్ (స) బోధల్నీ ఆయన చరిత్రనూ నిస్పక్షపాతంగా స్టడీ చేసిన చాలా మంది మేధావులు, విద్యావంతులు ఇస్లాం సత్యతను అర్థం చేసుకుని ఇస్లాం స్వీకరించిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి.

అలా ఇస్లాంను స్టడీ చేసిన ‘జార్జ్ బెర్నాడ్ షా’ సైతం తన “ద జెన్యూన్ ఆఫ్ ఇస్లాం” లో “ముహమ్మద్ నేటి ఆధునిక సమాజానికి నిరంకుశ నాయకత్వం వహిస్తే అతడు ప్రపంచ సమస్యలన్నిటినీ పరిష్కరించి, నేడు కరువైన శాంతిని స్థాపించి, మానవాళికి సుఖ సంతోషాలు అందజేస్తాడని నా గట్టి నమ్మకం” అని పేర్కొనటం జరిగింది.

నిజానికి ఇస్లాంను స్టడీ చేసిన ‘ఆండ్రూ టేట్’ ఇస్లాం స్వీకరించటం పెద్ద చెప్పుకోతగ్గ విషయమేమీ కాదు. కానీ, నిత్యం ఇస్లాంను విపరీతంగా ద్వేషించే కరుడుకట్టిన ఇస్లామోఫోబులు ఇస్లాం స్వీకరిస్తే నిజానికి అది అసలు పట్టించుకోవలసిన వార్త అవుతుంది.

నెదర్లాండ్స్ కు చెందిన ప్రముఖ రాజకీయవేత్త, “ఫార్-రైట్ పార్టీ (PVV)” తరఫున మెంబర్ ఆఫ్ పార్లమెంట్ (MP) అయిన ‘జోరమ్ వాన్ క్లావెరెన్’ కు ఒకప్పటి కరుడుకట్టిన ఇస్లాం ధ్వేషి. ఇస్లాంకు వ్యతిరేకంగా “ఈవిల్ ఇన్ ఇస్లాం” అన్న పేరుతో పుస్తకం రాయాలని మొదలెట్టిన ప్రయత్నంలో ఇస్లాం గురించి లోతైన పరిశీలన చెయ్యటం మొదలెట్టాడు. ఆ క్రమంలో ఖురాన్ ను, ప్రవక్త ముహమ్మద్ (స) జీవిత చరిత్ర పూర్తిగా చదివాడు. అతని పరిశీలన చివరకు 2015 సం.లో ఇస్లాం స్వీకరించేలా చేసింది. ఇతను మాట్లాడిన ఎన్నో వీడియోలు యూట్యాబ్ లో చూడవచ్చు.
ఇతనే కాక, ఆర్తుర్ వాంగర్, అర్నౌడ్ వాన్ డూర్న్, అబ్రాహామ్ కిల్లింగ్టన్, రిచర్డ్ ఎం.సీ. కిన్నే వగైరా ఎందరో ఒకప్పటి ఇస్లాం పరమ ద్వేషకులే! కానీ ఇస్లాంను ద్వేషించే క్రమంలో ఎక్కడో ఏదో సందర్భంలో ఖురాన్ చదివినప్పుడు వారు ఇస్లాం పట్ల ఆకర్షితులయ్యారు. వారి ఆంతరింగిక ఆలోచనల్ని ఇస్లాం మార్చివేసింది. వారి ద్వేషాన్ని ఇస్లాం ఇష్టంగా మార్చేసింది. వీరందరి ప్రసంగాలూ యూట్యూబ్ లో వినవచ్చు.

ఇండియాలో బాబ్రీ మసీదును కూల్చేసిన బల్బీర్ సింగ్ ముస్లింగా మారి వంద మసీదులను కట్టించి చనిపోయాడు.
“ఇస్లాం ఆతంక్ వాద్ కా ఇతిహాస్ (ఇస్లాం ఉగ్రవాద చరిత్ర)” అన్న పేరుతో యాంటీ ఇస్లామిక్ పుస్తకం రాసేంత ఇస్లామోఫోబియా కలిగిన ‘స్వామీ లక్ష్మీ శంకరాచార్య’ ఒకానొక సందర్భంలో ఖురాన్ ను, ప్రవక్త ముహమ్మద్ (స) బోధల్ని చదివి ఇస్లాం ఉగ్రవాదాన్ని ప్రేపించటం లేదు కానీ, “ఆదర్శవాదాన్ని” నేర్పుతుందన్న వాస్తవాన్ని గ్రహించి “ఇస్లాం ఉగ్రవాదామా? ఆదర్శవాదమా?” అన్న పేరుతో పుస్తకాన్ని రచించటం జరిగింది. తెలుగులో ఈ పుస్తకం మార్కెట్ లో లభించటమే కాక, ఇస్లాంపై ‘స్వామీ లక్ష్మీ శంకరాచార్య’ చేసిన ఎన్నో లెక్చర్స్ యూట్యూబ్ లో వినవచ్చు.

అయితే ‘ఆండ్రూ టేట్’ లేక మరెవరో ఇస్లాం స్వీకరించినంత మాత్రానా వారి వల్ల ఇస్లాంకు లాభమూ జరగదు లేక మరెవరో ఇస్లాంను విడిచిపెట్టేసి వేరొక మతంలోకి కన్వర్ట్ అయిపోయామని ప్రకటించినంత మాత్రానా ఇస్లాంకు ఎలాంటి నష్టమూ వాటిల్లదు.

ఇస్లాం, సృష్టికర్త పట్ల శాస్త్రీయ దృక్పథం కలిగి ఉంటూ మనిషి తనలో కలిగే ప్రతికూల ఆలోచనల్ని నియంత్రించుకుంటూ, అనుకూల ఆలోచనలతో ఎలా జీవితం గడపాలి? అన్న జీవన విధానాన్ని నేర్పే ధర్మం. కాబట్టి ఆ జీవన విధానాన్ని అవలంబించేవారు తమకు తాము లాభం చేకూర్చుకోవటమే తప్ప ఇస్లాంకు ఎలాంటి లాభమూ చేకూర్చేదీ ఉండదు, దాన్ని ద్వేషించటం వల్ల ఎలాంటి నష్టమూ చేకూర్చలేరు.

ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏమిటంటే చాలా మంది పెంచి పోషించే “ఇస్లామోఫోబియాకు ఊపిరి అజ్ఞానం మాత్రమే తప్ప జ్ఞానం కాదు” అన్నది.
అయితే కాస్తో కూస్తో బుద్ధిని ఉపయోగించే కొందరు ఇస్లామోఫోబులు ఏదో సందర్భంలో ఖురాన్ ను స్టడీ చేసిన సందర్భాలేర్పడినప్పుడు ఇస్లాం పట్ల వారి అభిప్రాయాల్ని మార్చుకుని ఇస్లాంకు ఆకర్షితులయ్యారు. కాబట్టి విమర్శించే ముందు పరిశీలన తప్పనిసరి. పైగా ఫ్యాక్ట్ చెక్ చెయ్యకుండా చేసే విమర్శలు “గుడ్డి విమర్శలుగా పరిగణించబడతాయి. అలాంటి పనులు ఆటవికులో అనాగరికులో చేస్తుంటే పర్లేదు కానీ, చదువుకునీ ఇస్లామోఫోబియా అనే మానసిక జబ్బును కొందరు మోసుకుంటూ తిరగటమే కాస్త వెగటు కలిగించే విషయం.

‘ఆండ్రూ టేట్’ క్రైస్తవుడుగా ఉన్నప్పుడు “నేను ముస్లింను కాను.. కానీ, నేనొక ఆర్థోడాక్స్ క్రైస్తవుణ్ణి” అని చెబుతూ ఇస్లాం, క్రైస్తవ్యాలను అనాలసిస్ చేస్తూ ఒక ఇంటర్యూలో చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అతని వేషాధారణకు సంబంధం లేకుండా ఓ ఫిలాసఫర్ లా కూర్చుని అతను చెప్పిన చాలా విషయాలు నాకు నచ్చాయి. దానికి సంబంధించిన లింక్ ను ఈ క్రింది చూడవచ్చు.

https://www.youtube.com/watch?v=3UJe6RVY0jg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *