దేవాలయాలుగా మార్చబడిన మసీదులు

హిందూ ముస్లిముల మధ్య సోదరభావాన్ని దెబ్బతీయటానికి “మా హిందూ దేవాలయాల్ని పడగొట్టేసి వాటిపై మసీదులు కట్టేశార”ని గొంతు చించుకునే చాలా మందికి తెలీని మరొక విషయం చరిత్రలో హిందుత్వ వాదుల ద్వారా దేవాలయాలుగా మార్చబడిన మసీదులు కూడా ఉన్నాయన్నది!

ఈ సమాచారం ఇక్కడ ఇవ్వటానికి కారణం కొందరు మతతత్వవాదులు చేస్తున్న పై వాదనను బ్యాలన్స్ చెయ్యటానికి కాదు! చరిత్రలో చాలా సంఘటనలు జరిగాయి. ఒక్క ముస్లిం పాలకులే కాదు.. హిందూ పాలకులు సైతం పడగొట్టేసిన అనేక దేవాలయాలున్నాయి. అలాగే ముస్లిం పాలకులు నిర్మించిన, పునరుద్ధరించిన దేవాలయాలు కూడా అనేకం ఉన్నాయి.. మరీ ముఖ్యంగా ముస్లిం పాలకుల హయాములో అనేక మసీదులు కూల్చబడి దేవాలయాలు కట్టబడ్డాయి.. అనేక మసీదులు దేవాలయాలుగా మార్చబడ్డాయి కూడా!

1. హర్యానా, గురుగ్రామ్ జిల్లాలో ఫరూఖ్‌నగర్ ను మొఘల్ గవర్నర్ ఫౌజ్‌దార్ ఖాన్ క్రీ.శ 1732 లో స్థాపించారు. పట్టణం స్థాపించబడిన వెంటనే, పట్టణ సరిహద్దుల్లో గంభీరమైన నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. వాటిలో ఒకటి ‘జామా మసీదు’. తరువాత పాకిస్తాన్ నుండి హిందుత్వ శరణార్థులు వచ్చిన తరువాత ఈ మసీదును ఆక్రమించుకుని ఆలయంగా మరియు గురుద్వారాగా మార్చి వెయ్యటం జరిగింది

2. మహారాష్ట్ర లోని దౌలతాబాద్ (ఔరంగాబాద్) కు చెందిన ఖిలిజ్ జుమ్మా మసీదు, 14 వ శతాబ్దంలో కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ ద్వారా నిర్మాణమైంది. ఈ మసీదు నిర్మాణం తరువాత శతాబ్దాలుగా వాడుకలో ఉంది. తరువాత హిందువులు దానిని ఆక్రమించుకుని మసీదులో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తరువాత స్థానికులు అక్కడ పూజలు చేయడం ప్రారంభించారు ఆ మసీదును ‘భారత్ మాతా’ మందిర్ అని పిలవడం ప్రారంభించారు.

3. హర్యానాలోని హిసార్ జిలాల్లో ‘డానా షీర్ మసీదు’ ఫిరోజ్ షా తుగ్లక్ (క్రీ.శ 1351 నుండి 1388 వరకు) నాటి పురాతన కాలం నాటిది. పాకిస్తాన్ విభజన సమయంలో హిందువులు ఆ మసీదును ఆక్రమించుకుని దానిని హిందూ ఆలయంగా మార్చారు. ‘డానా షీర్ బహ్లుల్ షా’ అనే అప్పటి ముస్లిం పెద్ద పేరు మీద కట్టబడిన ఈ మసీదు ‘భగవాన్ డానా షేర్ మందిర్’ గా మార్చబడి ఇప్పటికీ అందులో పూజలు జరుగుతున్నాయి

4. హర్యానా సోనిపట్ పట్టణంలో ఈనాడు మొఘలులకు చెందిన అనేక ఇస్లామిక్ స్మారక చిహ్నాలు, వీటిలో ఖ్వాజా ఖిజ్ర్ సమాధి, పాత కోట శిధిలాలతో పాటు ‘జామా మసీదు కూడా ఒకటి’. తరువాత దానిని కొందరు హిందుత్వవాదులు ఆక్రమించుకుని ‘దుర్గా మందిరం’గా మార్చివేయటం జరిగింది.

****

అంతేకాదు స్వయంగా ముస్లిం పాలకుల హయాములోనే అనేక మసీదులు ధ్వంసం చెయ్యబడ్డాయి కూడా!

1. జోధ్‌పూర్‌కు చెందిన జస్వంత్ సింగ్ క్రీ.శ 1658-59 లో అనేక మసీదులను ధ్వంసం చేశాడు మరియు వాటి ప్రదేశాలలో హిందూ విగ్రహ-దేవాలయాలను నిర్మించాడు.

అయినప్పటికీ, జస్వంత్ సింగ్ 16 ఔరంగజేబుతో కలిసి 1679 లో రాజ్‌పుత్ మరణించే వరకు వచ్చే 20 సంవత్సరాలు పని చేశాడు.

2. 1618-1707 మధ్యకాలంలో ఔరంగజేబు పంజాబ్ మరియు గుజరాత్ లను సందర్శించినప్పుడు, ముస్లిం ప్రముఖుల బృందం హిందుత్వవాదులు మసీదులను కూల్చివేసి, తమ స్థలాలను అతిక్రమించినట్లు ఫిర్యాదు చెయ్యటం జరిగింది. తరువాత విచారణ జరిపి తిరిగి ముస్లిముల మసీదులు పునరుద్ధరించటం జరిగింది.

3. అక్బర్ కాలంలో, సూఫీ మరియు ఆధ్యాత్మిక వేత్త అయిన షేక్ అహ్మద్ సిర్హిండి క్రీ.శ. 1564-1624 మధ్య కాలంలో కొంతమంది హిందుత్వవాదులు మసీదులను కూల్చివేసి తమ సొంత ప్రార్థనా స్థలాలుగా లేదా హిందూ దేవాలయాలుగా మారుస్తున్నారని ఫిర్యాదు చెయ్యటం జరిగింది.

4. క్రీ.శ 1540 లో ఆఫ్ఘన్ పాలకుడు షేర్ షా కొంతమంది హిందూ భూస్వాములను శిక్షిస్తానని ప్రతిజ్ఞ చేసాడు. దానికి కారణం కొంతమంది మాగీలు గుజరాత్‌లోని హిందువులను ముస్లింలపై మరియు వారి మసీదులపై దాడి చేయమని ప్రేరేపించారు, ఆ దాడిలో మసీదులు ధ్వంసం చేయబడ్డాయి, కాల్చబడ్డాయి చాలా మంది ముస్లింలు చంపబడ్డారు.

5. 1569 లో ఆలీ ఆదిల్ షా పాలనలో విజయనగర రాజైన రామరాజు అహ్మద్ నగర్ నుండి దౌలతాబాద్ వరకు ఉన్న మసీదులన్నిటికీ నిప్పంటించాడు. ముస్లిములపై దౌర్జన్యాలు జరిపి ఎన్నో ఖురాన్ ప్రతులను తగలబెట్టించాడు.

6. అవధ్ లోని హనుమాన్ గాది ప్రాంతంలో ఒక మసీదు ఉంది, దీనిని హిందువులు పడగొట్టారు మరియు క్రీస్తు శకం 1858 లో చాలా మంది ముస్లింలు చంపబడ్డారు.

ఈ విధంగా చరిత్రలో ముస్లిం పాలకుల హయాములోనే మతోన్మాదుల ద్వారా అనేక మసీదులు కూల్చబడ్డాయి. అనేక మసీదులు దేవాలయాలుగా మార్చబడ్డాయి కూడా!

అయినప్పటికీ ఆనాటి ముస్లిం పాలకులు తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవటం కోసం ముస్లిములను హిందువులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి మత విద్వేష రాజకీయాలు నడపలేదు. హిందూ సమాజం పట్ల ఎంతో ఉదారంగా వ్యవహరించేవారు. ఇక చరిత్రలో స్వయంగా ముస్లిం పాలకులే కట్టించిన పునరుద్ధరించిన ఎన్నో దేవాలయాలు ఈనాటికీ ఉన్నాయి.

కాబట్టి చరిత్రను ఎప్పుడూ ఒకవైపే విశ్లేషణ చెయ్యకూడదు. మనకు అనుకూలంగా ఉన్న సమాచారాన్ని మాత్రమే తీసుకోకూడదు. మనకు నచ్చినట్టు చరిత్రను వక్రీకరించకూడదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *