పుస్తకం పూర్తి పేరు: “ద డెవలపింగ్ హ్యూమన్ క్లినికల్లీ ఓరియంటెడ్ ఎంబ్రియాలజీ – విత్ ఇస్లామిక్ ఆడిషన్స్ (The Developing Human: Clinically Oriented Embryology With Islamic Additions).
గర్భంలో పిండ దశలు, శరీర నిర్మాణం గురించి అనేక ఉదాహరణలతో సోదాహరంగా వివరించబడి ‘బెస్ట్ మెడికల్ బుక్’ ఆవార్డ్ సైతం అందుకున్న మెడికల్ టెక్స్ట్ బుక్. మొత్తం 11 ఎడిషన్స్ తో ప్రపంచవ్యాప్తంగా అన్ని మెడికల్ యూనివర్సిటీల్లో MBBS విద్యార్థుల ద్వారా చదవబడే అత్యంత ప్రముఖ పరిశోధనాత్మక పుస్తకం.
రచయిత: డాII. కీత్. ఎల్. మూర్ (కెనడాలోని అంటారియోలో టొరంటో విశ్వవిద్యాలయంలో సర్జరీ ఫ్యాకల్టీలో అనాటమీ అండ్ సెల్ బయాలజీ ప్రొఫెసర్) మరియు ‘అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ అనాటమిస్ట్ (AACA)’ వ్యవస్థాపక సభ్యుడు. శరీర నిర్మాణ శాస్త్రంలో మానవ శరీర నిర్మాణ శాస్త్ర విద్య కోసం చేసిన అనేక పరిశోధనల నిమిత్తం ‘అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ అనాటమిస్ట్స్’ ద్వారా 2007లో ‘హెన్రీ గ్రే/ఎల్సేవియర్’ విశిష్ట విద్యావేత్త అవార్డు ప్రదానం చెయ్యబడ్డారు.
అంత వరకు బాగానే ఉంది. మానవ శరీర నిర్మాణాన్ని వివరిస్తూ అంత పెద్ద సైంటిస్ట్ ద్వారా మెడికల్ విద్యార్థుల కోసం రచించబడిన ఆ పరోశోధనాత్మక పుస్తకం కవర్ పేజ్ పై “విత్ ఇస్లామిక్ ఆడిషన్స్ (With Islamic Additions)” అన్న పేరు ఎందుకు జత చెయ్యబడింది? ఆ పుస్తక రచయితైన డా. కీత్ మూర్ ఏమైనా ముస్లిమా? కాదు. పోనీ, ఇస్లాం పట్ల ప్రేమతో ఆ పేరు తగిలించి ఉండవచ్చా? కాదు. మరి ఆ మెడికల్ టెక్స్ట్ బుక్ కవర్ పేజ్ పై “విత్ ఇస్లామిక్ ఆడిషన్స్” అని ఎందుకు జత చెయ్యటమైంది?
******
1980 లో కింగ్ అబ్దుల్ అజీజ్ యూనివర్సిటీలో అక్కడి మెడికల్ విద్యార్థులకు అనాటమీ మరియు ఎంబ్రియాలజీ పై లెక్చర్ ఇవ్వటానికి డా. కీత్. ఎల్. మూర్ సౌదీ అరేబియాకు ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డారు.
ఆ సందర్భంలో ఆ యూనివర్సిటీలో ఎంబ్రియాలజీ డిపార్ట్మెంట్ కమిటీ మెడికల్ విద్యార్థులు గర్భంలో పిండ నిర్మాణం గురించి ఖురాన్ వివరిస్తున్న వాక్యాలను ఒక చోట కూర్చి అవి ఆధునిక ఎంబ్రియాలాజికల్ సైన్స్ చెబుతున్న దానికి ఎంత వరకు సరిపోతున్నాయో వాటి నిర్ధిష్టతను పరిశీలించాల్సిందిగా డా. కీత్. మూర్ ను కోరటమైంది.
డా. కీత్ మూర్ తానో సైంటిస్ట్ అయినప్పటికీ ఆ వాక్యాల్ని ఏవో మత గ్రంథం తాలూకు గుడ్డి విశ్వాసాలను బోధించే వాక్యాలుగా జమకట్టి కొట్టిపరెయ్యలేదు. ఎందుకంటే పరిశీలకుడి లక్షణం నిత్యవిద్యార్థిలా ఉంటూ ప్రతీదీ పరిశీలించి నేర్చుకోవటం, మూర్ఖుడి లక్షణం అన్నీ నాకు తెలుసని ఏదీ పరిశీలించక ప్రతీదీ కొట్టి పరేయ్యటం.
******
పిండ నిర్మాణం గురించి ఖురాన్ వివరిస్తున్న వాక్యాలను పరిశీలిస్తున్న క్రమంలో డా. కీత్ మూర్ ఖురాన్ “ఆయన పేరుకు పోయిన నెత్తుటి ముద్దతో మానవుణ్ణి సృష్టించాడు” – 96:1-2 అన్న వాక్యం తనను ఆకర్షిచింది. నిజానికి ఈ వాక్యం అరబీ మూలంలో “నెత్తుటి ముద్ద” అన్న చోట “అలఖ్ (Alaqah)” అని చూడగలం. ఈ పదానికి జలగ, వ్రేలడే వస్తువు, రక్తపు గడ్డ అని మూడు అర్థాలు ఉన్నాయి. గర్భంలో పిండం ప్రారంభ దశను మైక్రోస్కోప్ లో గమనించిన డా. మూర్ అది ఒక “జలగ” ఆకారంలోనే ఉండటాన్ని గమనించి ఆశ్చర్యానికి గురై ఖురాన్ మానవ దేహ నిర్మాణం గురించి వివరిస్తున్న మిగతా వాక్యాలపై మరింత లోతైన పరిశోధన చెయ్యటం మొదలెట్టినాయన చివరకు ఈ క్రింది విధంగా తీర్మానించటం జరిగింది:
“7 వ శతాబ్దంలో ఎంబ్రియోలాజికల్ సైన్స్ స్థాపించబడక ముందు మానవ పునరుత్పత్తి, ప్రీనేటల్ డవలప్మెంట్ గురించి సూచిస్తూ ఖురాన్ మరియు హదీసులలో చెప్పబడిన అనేక ప్రకటనలు వాటి ఖచ్చితత్వాన్ని చదివి నేను ఆశ్చర్యపోయాను”
ఆ తరువాత డా. కీత్ మూర్ ఖురాన్, హదీసుల్లో పిండ నిర్మాణం గురించి చెప్పబడిన వాక్యాలను ఆధునిక పిండోత్పత్తి శాస్త్రంతో తులనాత్మక ఆధ్యాయం చేసి అనేక పత్రాలను సమర్పించారు. అంతేకాదు, తన పరిశోధనాత్మక గ్రంథమైన “ద డెవలపింగ్ హ్యూమన్ క్లినికల్లీ ఓరియంటెడ్ ఎంబ్రియాలజీ – 3rd ఎడిషన్ లో పిండ నిర్మాణం గురించి ఖురాన్ వివరిస్తున్న ఎన్నో వాక్యాలను, హదీసులను కోట్ చెయ్యటం జరిగింది. ఆ 3 వ ఎడిషన్ కు “విత్ ఇస్లామిక్ ఆడిషన్స్” అని జత చెయ్యటమైంది.
సందేహం ఉన్నవారు మార్కెట్ లో “ద డెవలపింగ్ హ్యూమన్ క్లినికల్లీ ఓరియంటెడ్ ఎంబ్రియాలజీ – 3rd ఎడిషన్ కొని చదువుకోవచ్చు. ఆ మెడికల్ టెక్స్ట్ బుక్ ను పరిశీలిస్తే ఆ పుస్తకంలో ఖురాన్, హదీసుల్లో ఎన్నో వాక్యాలు కోట్ చెయ్యబడినట్లు గమనించగలరు. అంతేకాదు… డా. కీత్ మూర్ ఖురాన్ వాక్యాలపై ఇచ్చిన ఎన్నో లెక్చర్లను యూట్యూబ్ లో కూడా చూడవచ్చు. వాటిలో ఖురాన్ వాక్యాలను వివరిస్తున్న డా.కీత్ మూర్ లెక్చర్లు వింటే ఆవేవో మత గ్రంథ ప్రసంగాల్లా కాక అనాటమికల్ సైన్స్ పాఠాలు చెబుతున్నట్టు ఉంటాయి. ఆశక్తి ఉన్నవారు చూడవచ్చు.
******
1986 లో గర్భంలో పిండ దశలను గురించి ఖురాన్ చెబుతున్న నిర్ధిష్ట సమాచారాన్ని వివరిస్తూ “A SCIENTIST’S INTERPRETATION OF REFERENCES TO EMBRYOLOGY IN THE QUR’AN” అనే జర్నల్ ల్లో ఒక ఆర్టికల్ సైతం రాయటం జరిగింది.
చివరిగా… ఖురాన్ సైన్స్ వివరించే పుస్తకమూ కాదు దాని లక్ష్యం సైన్స్ నేర్పటమూ కాదు. అయినప్పటికీ ఖురాన్ నేటి ఆధునిక సైన్స్ ఎన్నో పరిశోధనలు చేసి చెప్పిన ఎన్నో విషయాలను 1400 సం.ల క్రితమే ప్రస్తావించిన వైనాన్ని చూడగలం. దానికి కారణం- మనిషి ఏవో కొన్ని గుడ్డి నమ్మకాల ఆధారంగా కాకుండా శాస్త్రీయ ఆలోచనా విధానం కలిగి నిజ సృష్టికర్తను పరిశీలించి తెలుసుకోవాలన్నదే. ఇంకా నిజ సృష్టికర్తను గుర్తించి ఆయన ఆదేశాల ప్రకారం నడుచుకునే విశ్వావి హేతుబద్ధమైన ఆలోచనా విధానం కలిగి నడుచుకోవాలన్నదే.
“ద డెవలపింగ్ హ్యూమన్ – విత్ ఇస్లామిక్ ఆడిషన్స్”
