ఇండోనేషియాలో ముస్లిములు దాదాపు 87% హిందువులు కేవలం 1.7% మాత్రమే…
మలేషియాలో ముస్లిములు 63% హిందువులు కేవలం 7% మాత్రమే…
సౌదీ అరేబియాలో 97% ముస్లిములు హిందువులు కేవలం 1.3% మాత్రమే…
కువైట్ లో ముస్లిములు 75% హిందువులు కేవలం 8.5% మాత్రమే…
బెహ్రైన్ లో ముస్లిములు 70% హిందువులు కేవలం 9.9% మాత్రమే…
గల్ఫ్ లో హిందువులు ఉన్నది 1% మాత్రమే. ఇలా పరిశీలిస్తూ వెళితే దుబాయ్, ఖతార్, ఒమన్, యమన్ వగైరా అనేక ముస్లిం దేశాల్లో ఎంతో మంది హిందువులు ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. అదికాక లక్షలాది మంది సంపాదించు కోటానికి ఆయా దేశాలకు వెళ్లి వస్తుంటారు.
ముస్లిం దేశాలంటే పాకిస్తాన్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే కాదు! ఇంకా ప్రపంచంలో ఇంకా 50 ముస్లిం దేశాలు ఉన్నాయి. అవి ఎంతో ప్రశాంతంగా ఉంటూ పర్యాటక స్థలాలుగా కూడా ఉన్నాయి. ఆయా దేశాల్లో లక్షల కొద్దీ ముస్లిమేతరులు సైతం ప్రశాంతంగా జీవిస్తున్నారు. వారిలో 65% హిందువులే ఉన్నారు.
ఈ దేశాలన్నిటిలో ముస్లిములు మెజారిటీగానూ, హిందువులు మైనారిటీగానూ ఉన్నప్పటికీ ఎన్నడూ ఆయా దేశాల్లో ఉండే హిందువులు “హిందూ ఖత్రేమే హై” లాంటి చవకబారు స్లోగన్లు చెప్పరు. ముస్లిములు మెజారిటీగా ఉంటే ముస్లిమేతరులకు ప్రమాదకరమనే పనికిమాలిన ఫిలాసఫీలు మాట్లాడరు. వారంతా సోదరభావంతో కలసి మెలసి ఉంటారు.
ఈ పరిస్థితికి పూర్తి భిన్నంగా భారతదేశంలో 80% హిందువులు, 14% ఉన్నప్పటికీ… హిందూ, ముస్లిముల మధ్య సోదరభావాన్ని దెబ్బతీయటానికి ఎప్పుడో మధ్య యుగాలనాటి స్టోరీలు చెబుతూ కొందరు వేర్పాటువాదులు “ముస్లిములు మెజారిటీగా ఉంటే ముస్లిమేతరులకు ప్రమాదకరం” లాంటి లేకి మాటలు చెప్పుకుంటూ, “హిందూ ఖత్రేమే హై” వంటి స్లోగన్లతో హిందుత్వ భావజాలాన్ని ఎమోషనల్ గా రెచ్చగొడితే గానీ రాజకీయాలు చెయ్యలేని పరిస్థితి.
ఇదే భావజాలాన్ని సోషల్ మీడియాలో కొందరు మతోన్మాదులు, మతోన్మాదాన్ని పంటిక్రింద బిగపట్టి పైకి అభ్యుదయవాదుల్లా నటించే కొందరు తమ రాతల్లోనో, మాటల్లోనో సర్వసామాన్యం చెయ్యటానికి తమ వంతు ప్రయత్నం చేస్తుంటారు.
కాస్త, బ్రాడ్ మైండ్ తో ఆలోచించేవారు భారత దేశాన్ని ముస్లిం పాలకులు దాదాపు వెయ్యేళ్లు పాలించారు, అన్నేళ్ల పాలనలో ఎందరో ముస్లిం పాలకులు పాలించారు. కానీ, అందులో ఎందరో ఉత్తములు ఉన్నతంగా పాలించిన వారు ఉన్నప్పటికీ వారికి పాలన చెయ్యటం తప్ప ఇస్లాం ధర్మాన్ని వ్యాప్తి చెయ్యాలన్న ధ్యాస గానీ, ఇంట్రస్టుగానీ ఎప్పుడూ కలిగి లేరు. దానికి తార్కాణం అన్ని వందల సంవత్సరాల ముస్లిం పాలన అనంతరం సైతం 1947 లో స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా హిందువుల, ఆచార వ్యవహారాలు, గుళ్లూ గోపురాలు నమ్మకాలూ, మూఢ నమ్మకాలతో సహా ఎక్కడా హిందుత్వ సంస్కృతి చెక్కు చెదరకుండా వారు మెజారిటీ స్థాయిలో ఉన్నారు, ముస్లిములు అప్పటికీ మైనారిటీ స్థాయిలోనే ఉన్నారన్న విషయాన్ని ఇట్టే కనిపెడతారు.
చివరిగా ముస్లిం మెజారిటీ ఉంటే ముస్లిమేతరులకు ప్రమాదకరం అని పనికిమాలిన ఫిలాసఫీలు చెప్పే వారికి అదే ముస్లిములు మైనారిటీ స్థాయిలో ఉంటూనే.. స్వాతంత్రోధ్యమంలో తమ ప్రాణాలు సైతం లెక్క చెయ్యక దేశ స్వతంత్రం కోసం వేలల్లో ప్రాణాలు అర్పించేసిన వారిలో దాదాపు 65 శాతం ఉన్నారన్న విషయం తెలీదా? లేక తెలిసీ తెలియనట్టు నటిస్తుంటారా? అన్నది ఎప్పటికీ తీరని అనుమానమే.
ముస్లిం మెజారిటీ ఉంటే ముస్లిమేతరులకు ప్రమాదకరమా?
