పైకి అభ్యుదయవాదుల్లా ముసుగేసుకుని సోషల్ మీడియాలో అన్ని మతాలను విమర్శిస్తూనే.. వాట్స్ యాప్పుల్లోనో, గాసిప్పుల్లోనో దొరికే గాలి సమాచారాన్ని బట్టో, ఇస్లాం అవగాహన లేని ముస్లిముల పోకడలను బట్టో ఇస్లాంను కూడా పనికట్టుకుని విమర్శిస్తుంటారు కొందరు. పనిలో పనిగా కడుపులో దాచుకున్న ఇస్లామోఫోబియాను కూడా కక్కేసే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి కొందరిలో వేంకట రాయ అనే వ్యక్తి ఫేస్బుక్ వాల్ పై ఇస్లాం పట్ల లేవనెత్తిన కొన్ని విమర్శలకు సమాధానాలు ఇవ్వాలనిపించింది.
1. “అసలు గోవధ ఎందయ్యా అరబ్బు నేలల్లో తినడం మాట అటుంచి ఒక్క ఆవు ఎద్దు లేదు. బయటి పూజనీయాలను అగౌరవ పరచడం కాదా!”
Ans: గోవులు, ఆవుల్నీ, ఎద్దుల్నీ ముస్లిములు మాత్రమే తినేసి అగౌరవపరుస్తున్నారని విమర్శించే ముందు అసలు గోవూ, ఆవుల, ఎద్దుల మాంసం ఎగుమతిలో భారత దేశం నెం.1 స్థానంలో ఉందన్న విషయం తెలీదా? వాటిని ఎగుమతి చేసే ఎక్స్పోర్ట్ కంపెనీలు అధికశాతం హిందువులవే అన్నది అవగాహన లేదా? భారతదేశంలోనే గోవూ, ఆవుల, ఎద్దులు అగౌరవపరచబడటం కళ్లకు కనపడటం లేదా? ఆవు మాంసం తినవచ్చనే అనుమతి హిందూ శాస్త్రాల్లోనే కోకొల్లలుగా ఉన్నాయి. స్వామీవివేకానంద చెబుతున్నదేమిటంటే- “ప్రాచీన హిందూ ఆచారాల ప్రకారం, ఆవు మాంసం తినని మనిషి మంచి హిందువు కాదని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. కొన్ని సందర్భాల్లో, అతను ఒక ఎద్దును బలి ఇచ్చి తినాలి” – (ది కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద, వాల్యూమ్ 3, p. 536).
2. “ఎడారులలో ఎవ్వడూ బొమ్మలు చేసుకుని పూజించుకునే వెసులు బాటు ఉన్నవాడు కాడు. ఆయా విగ్రహాలను పగలగొట్టడం వెనుక ఇతరులకు ఉన్న చరిత్రను ధ్వంసం చేయడమనే లక్ష్యం ఉంది”
Ans: ప్రవక్త ముహమ్మద్(స) రాక ముందు అజ్ఞాన కాలంలో ఎడారి అరబ్బులు బొమ్మల్ని విగ్రహాల్నీ పూజించుకునేవారు. ప్రవక్త ముహమ్మద్ (స) వచ్చి నిజాధర్మాన్నీ, నిజ దైవాన్ని పరిచయం చేసి అనాగరిక అరబ్బులను నాగరికులుగా మార్చాక వారే ఆ బొమ్మల్నీ, విగ్రహాలనూ తమ చేతులతో పగలగొట్టేసి తమ ఆజ్ఞానాన్ని వదిలించుకున్నారు. తప్పితే ఎవరూ ఆనాటి ఎడారులలో బొమ్మలను పగలగొట్టలేదు.
3. “పాగన్ సంస్కృతులను పాడుచేసి నిర్మూలించడం ఎందుకు? సింపుల్ ఇది వార్ లార్డ్స్ లక్షణం తమను తప్ప వేరెవ్వరినీ కీర్తించ కూడదు”.
Ans: పాగాన్ సంస్కృతులను పాడు చెయ్యమని ఇస్లాం ఎక్కడా చెప్పలేదు. పైగా గౌరవించమని ఇస్లాం ఆదేశిస్తుంది. ఇక చరిత్రను వక్రీకరిస్తూ కొందరు చరిత్రకారులు ఒక్క ముస్లిం పాలకులనే ఇతర సంస్కృతులను పాడుచేసే వ్యక్తులుగా చిత్రీకరించారు. వాస్తవ చరిత్ర గమనిస్తే… హిందూ పాలకులు పడగొట్టేసిన దేవాలయాలే అనేకం ఉన్నాయి అది తెలుసా? మౌర్య, గుప్త వంశపు రాజుల కాలంలో బౌద్ధ పీఠాలు మఠాలు అనేకం నాశనం చెయ్యబడి, వాటిపై హిందూ మందిరాలు కట్టబడ్డాయి. బౌద్ధులను సంహరించి వారిని నామరూపాలు లేకుండా చెయ్యబడింది. ఇవన్నీ ఇస్లాం విమర్శకులకు తెలీని వాస్తవాలు. వెయ్యేళ్ల ముస్లిముల పాలన తరువాత కూడా హిందూ ఆచారాలు, మందిరాలూ, సంస్కృతి, విధానాలూ కాపాడబడుతూనే వచ్చాయి. ముస్లిముల ఉద్దేశమే ఇతర మతాల సంస్కృతి నాశనం చెయ్యటమైతే అన్ని వందల సంవత్సరాల ముస్లిం పాలకుల పాలనలో ఎప్పుడో హిందూత్వం, బౌద్ధం వగైరా ఇతర మతాలు నామరూపాల్లేకుండా తుడిచి పెట్టబడేవి.
4. “బానిసత్వపు కొనసాగింపును కోరేది అనుసరణీయ మతమే కాదు”.
Ans: “బానిసత్వాన్ని రూపుమాపింది, బానిసలకు సమాజంలో గొప్ప స్థానాన్ని ఇచ్చిందీ ఇస్లామే. బానిస స్త్రీలను హీనంగా చూసే కాలంలో వారిని వివాహాలు సైతం చేసుకోమని ఆజ్ఞాపించింది. ఇస్లాం ఒక్క బానిసత్వాన్నే కాక, జాత్యాహంకారాన్నీ, వ్యక్తుల మద్య ఉచ్చనీచ నిమ్నోన్నతా భావాలనూ ఖండించింది.
5. “నేను ఇస్లాంను వ్యతిరేకించడం ఏమిటి? సరాసరి నేటి పరిస్థితులకు పనికి రాదని సరాసరి చెబుతుంటే, ఇవి ద్వేషంతోనో అనేవి కావు తార్కిక సమాధానాలు”
Ans: ముస్లిం సమాజంలో ఇస్లాం అవగాహన లేని కొందర్ని బట్టి ఇస్లాంను విమర్శించటం కంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఇస్లాంను ప్రపంచంలో ఏదో ఓ చిన్న సమూహం అనుసరించటం లేదు దాదాపు 19 మిలియన్ల ప్రజలు అనుసరిస్తున్నారు. ఆధునిక కాలానికి తగ్గట్టు ఇస్లాం విశాల దృక్పథాలకు ఆకర్షితులవుతూ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఇస్లాం స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం ఇస్లాం ప్రపంచంలోనే వేగంగా అంగీకరించబడుతున్న ధర్మం. అలాంటప్పుడు ఇస్లాం నేటి పరిస్థితులకు పనికి రాదని చెప్పటం అవగాహన లోపం అవుతుంది.
6. “అక్కడక్కడ చమురు పడకుండా ఉంటే నేటికి ఇస్లాం ఓ గతచరిత్ర అయి ఉండేది”.
Ans: అరబ్ దేశాల్లో చమురు నిక్షేపాలు మెండుగా ఉన్నాయన్న విషయం 20 వ శతాబ్దంలో బయటపడింది. అప్పటికే ఇస్లాం 1400 సం.లుగా అనేక బిలియన్ల మంది ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనుసరించబడుతూ వర్ధిల్లుతూ ఉంది. ఇస్లాం ఒక్క అరేబియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనుసరించబడుతుంది. దానికీ చమురు నిక్షేపాలకూ సంబంధం లేదు. అవి ఎండిపోయినా ఎవరూ ఇస్లాంను వదిలెయ్యారు. ఇవన్నీ వాట్స్ యాపుల్లో కొందరు ఫార్వర్డ్ చేసే మెదడు తక్కువ విమర్శలు.
7. “ప్రతి దానికి విశ్వాసం అంటుంటారు అదేమి బ్రహ్మపదార్దం నిజానికి బలవంతుడు బలహీనుడిని అణచివేసే ఎత్తుగడ”.
Ans: నిజదేవుని పై విశ్వాసం అన్నది ఓ బలహీనుణ్ణి బలవంతునిగా మార్చుతుంది. తప్పితే బలహీనుల్ని అణచటానికి పనికొచ్చే ఎత్తుగడ కాదు. విశ్వాసం కలిగి ఉన్న ఎందరో ముస్లిం సైటిస్టులు ఎన్నో ఆవిష్కరణలు చేసి ప్రపంచ గతినే మార్చేశారు”.
8. “పక్కవాడికి బయటి మతస్తుడికి పవిత్ర స్థలాలు గుర్తులు జంతువులు ఉన్నాయి. వాటిని ధ్వంసం చేయకుంటే మనుగడ లేదనే మానసిక స్థితి ఇస్లాం అనుసరించే వారిది. అదే లెక్కలో వారికి పవిత్రమైనవి అనేవి ఏమైనా ఉన్నాయా అంటే జవాబుగా లేదంటారు కాని ఆ మసీదో ఈద్గానో చల్లానో స్మశానన్నో అవసరానికి తొలగిస్తున్న సరిజేస్తున్నా గుడ్డలు చించుకుంటారు వీలైతే కత్తులు పట్టుకు దిగుతారు”.
Ans: “ధ్వంసం చేయకుంటే మనుగడ లేదనే మానసిక స్థితి ఇస్లాం అనుసరించే వారిది” అన్నదే నిజమైతే తెలుసుకోవలసింది స్వతంత్ర పోరాటంలో దేశం కోసం ప్రాణాలు అర్పించేసిన వారిలో 65 శాతం మంది ముస్లిములే ఉన్నారు. నిజానికి ఇతర మతస్తుల మందిరాలను, గుర్తులను, సంస్కృతిని ధ్వంసం చేసిన చరిత్ర భారతదేశంలో హిందూ పాలకులకు మెండుగా ఉంది. భారతదేశంలో అనేక జైన, బద్ధ మందిరాలను, మసీదులను పడగొట్టేసిన అనేక ఆధారాలు చరిత్రలో ఉన్నాయి. కానీ ఒక్క ముస్లిములే ప్రక్కవాడి మతస్తులను వారి మందిరాలను ధ్వంసం చేసేవారిగా చిత్రీకరించటం చరిత్ర అవగాహనా లోపం మాత్రమే. అన్యాయంగా తప్ప అవసరం మేరకు ఒకవేళ మసీదో ఈద్గానో తొలగించాల్సి వస్తే ఎప్పుడూ ఏ ముస్లిమూ దానిపై గుడ్డలు చించుకోడు. బాబ్రీ మసీదును పడగొట్టటమే కాక, వేల కొద్దీ ముస్లిములను చంపేసింది ఎవరు? గుజరాత్ జెనోసైడ్ లో వేలకొద్దీ ముస్లిముల ఊచకోత కళ్లకు కనపడలేదా? గోరక్షణ పేరుతో మైనారిటీల పై హింసలు దాడులు కనపడలేదా? జై శ్రీరామ్ చెప్పమని హింసలు చెయ్యటం కనపడలేదా. కానీ, కొందరు మూర్ఖులను బట్టి మొత్తం హిందూ సమాజాన్నో, ముస్లిం సమాజాన్నో నిందించటం అన్యాయం అవుతుంది.
9. “ఓ పక్క అల్లా తప్ప పవిత్రతే లేదనే వారు ఇంట్లో ఆడోళ్లకి స్వేచ్ఛగా స్వతంత్రంగా మసలే అవకాశాలు ఇవ్వని వారు నీతులు చెప్పొద్దు. నేను నా లెక్కలు పుస్తకాలను బట్టి ఉండవు నేలబారుగా కనబడే వాటి బట్టే రాస్తున్నాను”
Ans: ఇవి నెలబారు రాతలు కావు. ఇస్లాం అవగాహనా రాహిత్యంతో కూడిన చవకబారు రాతలని చెప్పాలి. ఏదో ఒక సంఘటనను బట్టో, ఒకరి విమర్శను బట్టో దాన్ని ఇస్లాంకు, మొత్తం ముస్లిం సమాజానికి అప్లై చేసెయ్యటం అజ్ఞానం అవుతుంది. ఇంట్లో ఆడోళ్లకి స్వేచ్ఛగా స్వతంత్రంగా మసలే అవకాశాలు ముస్లిం సమాజంలో లేదని చెప్పటానికి ఏదైనా సర్వే రిపోర్టు ఉందా? లేదా ముస్లిం సమాజంలో స్త్రీలెప్పుడైనా మేము స్వీచ్చా స్వతంత్రాలు కోల్పోయామని ఏదైనా ఉద్యమం చేసిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? వారంతా ఇస్లాం ఆదేశాలూ, ఆచారాలు పాటిస్తూ సంతోషంగా సర్వస్వతంత్రంగా ఉన్నారు. ఉన్నత స్థాయి పదవుల్లో సైతం ఉన్నారు. ఇస్లాం స్త్రీలకు ఆస్తి హక్కులు, విడాకులు పొందే హక్కుల నుండి సకల హక్కులను 1400 సం.ల క్రితమే ప్రసాదించింది. మంచి వ్యక్తులతో పాటు దుర్మార్గులూ, దుష్టులూ ప్రతీ మత వర్గంలోనూ ఉంటారు. తప్పితే దుర్మార్గులంతా కాపీరైట్స్ తీసుకుని ఏదో ఒక మతంలోనే ఉండరు. కాబట్టి కొందరి చెడును మొత్తం మత వర్గానికి ఆపాదించేసి ఆ మొత్తం మతావర్గాన్ని విమర్శించటం మూర్ఖత్వం అవుతుంది. హిందూ సమాజంలో ఉత్తమ హిందువులు ఎందరో ఉన్నారు. మూర్ఖులూ ఉన్నారు. అలాగే ముస్లిం సమాజంలో ఇతర మత వర్గాల్లో కూడా. ఇవన్నీ ఇస్లాంను వాట్స్ యాప్పుల్లో గాసిప్పుల్లో కాక యదార్థం గా స్టడీ చేసినప్పుడు అర్థమయ్యే విషయాలు.
