ఇస్లాం ఉగ్రవాదాన్ని బోధిస్తుందని, ముస్లిములు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో అశాంతి అలజడులు సృష్టించబడుతుంటాయని సామాన్య ముస్లిమేతర ప్రజానీకం దృష్టిలో ఇస్లాం పట్ల ధ్వేషాన్ని రగిలించటానికి సోషల్ మీడియాలో చిల్లరాతి చిల్లరతనంగా పోస్టులు, కామెంట్లు పెట్టే చాలా మంది మతోన్మాద పైత్యం తలకెక్కిన వేర్పాటువాదులు ఎప్పుడు చూసినా వారు చేసే పనేమిటంటే…
ముఖ్యంగా సిరియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాఖ్, సోమాలియా, యెమెన్ ఈ నాలుగైదు దేశాల్లో రాజకీయ పరంగా ఆయా దేశాల్లో జరిగే కొన్ని అంతర్గత అంతర్యుద్ధాలు, చెరుమదురుగా సున్నీ-షియాల మద్య జరిగే కొన్ని గొడవలు, తాలిబాన్ల మతోన్మాదం, అలాగే అమెరికా సోవియట్ రష్యాపై పగ సాధించటానికి ఎనభై దశకాల్లో ఆఫ్ఘనిస్తాన్ లో కొన్ని అల్లరి మూకలను పోగుచేసి సృష్టించిన అల్-ఖైదా, ISIS వగైరా టెర్రరిస్ట్ గ్రూపుల్లోని టోపీ, గెడ్డాలు పెట్టుకుని ముస్లిం వేషాలు ధరించిన కొందరిని చూపి.. “చూశారా! ఇస్లాం ఏ విధంగా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందో, మతోన్మాదాన్ని కలిగి ఉందో, అశాంతి అలజడులు సృష్టిస్తుందో” అని ధ్వేషాన్ని రగిలించటమే కాక, “ముస్లిములు అత్యధికంగా ఉన్న దేశాల్లో, ప్రాంతాల్లో తీవ్రవాదం వ్యాపించిపోతుందని, ముస్లిముల నుండి జాగ్రత్తగా ఉండాలని” ముస్లిమేతరుల్లో ముస్లిముల పట్ల అనవసర భాయాందోళనలను సృష్టిస్తూ ఉంటారు.
పైన పేర్కొనబడిన నాలుగైదు దేశాల్లో జరిగే కొన్ని సివిల్ వార్స్, సున్నీ-షియాల గొడవలు లేదా కొన్ని తీవ్రవాద సంఘటనలను ఉదాహరణగా తీసుకుని దానిని ఇస్లామిక్ టెర్రరిజంగా చిత్రీకరించి ఇస్లాం పట్ల సామాన్యుల్లో ధ్వేషం పెంచటం తప్ప మొత్తం ప్రపంచంలో మొత్తం 50 ముస్లిం దేశాలున్నాయని, ఈ నాలుగైదు దేశాలు మినహా మిగతా ఇస్లామిక్ దేశాలు నిత్యం శాంతియుతంగా ఉంటాయని, అక్కడి ముస్లిములు తమ మానాన తాము అందరితో కలిసి మెలసి జీవిస్తూ ఉంటారని, ఆయా ముస్లిం దేశాల్లో ఎన్నో పర్యాటక ప్రాంతాలుగా వినుతికెక్కాయన్న విషయం మీడియాలో ఇస్లాంపై విషం కక్కే చాలా మంది వేర్పాటువాదులకు తెలీదు. ఆయా దేశాల ప్రస్తావన వారు ఎప్పుడూ చెయ్యటానికి సాహసించరు కూడా!
మీరు కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఉదాహరణకు…
1. దాదాపు 90 శాతం సున్నీ, షియా ముస్లిములు కలిసి కట్టుగా నివసించే “కువైట్” లో ఎటువంటి సివిల్ వార్స్ గానీ, తీవ్రవాద సంఘటనలు ఎన్నడూ లేని అత్యంత ప్రశాంత పర్యాటక నగరం.
2. ఇండోనేషియాలో 90 శాతం ముస్లిములు నివశిస్తుంటారని చాలా మందికి తెలీదు. సివిల్ వార్స్ గానీ, తీవ్రవాద సంఘటనలు, మతపరమైన గొడవలు లేని అత్యంత శాంతికరమైన ముస్లిం దేశాల్లో ఇండోనేషియా ఒకటి.
3. 95 % ముస్లిములు నివసించే జోర్డాన్, 99 శాతం ముస్లిములు నివసించే మొరాకో, 97 శాతం ముస్లిములు నివసించే మాయోట్, 88 శాతం ముస్లిములు నివసించే మాల్దీవులు, 80శాతం ముస్లిములు నివసించే బ్రూనె, 98 శాతం ముస్లిములు నివసించే బంగ్లాదేశ్, 98 శాతం ముస్లిములు నివసించే అల్జీరియా, టర్కీ, ఇంకా 97 శాతం ముస్లిములు నివసించే కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా వగైరా దేశాల్లో ఎటువంటి టెర్రరీస్ట్ గ్రూపులు గానీ, టెర్రరిస్ట్ ఎటాక్స్ గానీ, సివిల్ వార్స్ గానీ, మతపరమైన అంతర్యుద్ధాలు గానీ ఎప్పుడూ జరగలేదు.
4. ఇవి కాక ఇంకా దాదాపు 80 నుండి 90 శాతం ముస్లిములు నివసించే దేశాలు చాలా ఉన్నాయి. నిజంగా ముస్లిములు అత్యధికంగా ఉన్న ప్రతీ ప్రాంతంలోనూ తీవ్రవాదం, అశాంతి, అలజడులు ఉంటాయన్నదే నిజమైతే.. ప్రపంచంలో 80 నుండి 90 శాతానికి పైగా ముస్లిములు నివసించే అనేక ముస్లిం/ఇస్లామిక్ దేశాలు అత్యంత శాంతికరమైన దేశాలుగా ఉన్నాయన్న పచ్చి నిజాన్ని సైతం ఒప్పుకోక తప్పదు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 250 కోట్ల మంది ముస్లిములు ఉన్నారు.
నిజానికి పైన పేర్కొనబడిన ముస్లిం దేశాల ప్రస్తావన గానీ ఆయా దేశాల్లో అన్ని కోట్ల ముస్లిములు నివసిస్తున్నారని గానీ చాలా మందికి తెలీదు. ఎందుకంటే మీడియా నిత్యం ఒక్క సిరియా, ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్, పాకిస్తాన్ దేశాల ప్రస్తావన మాత్రమే చేస్తూ ఇస్లాంపై ధ్వేషాన్ని కక్కుతూ ఉండటం మూలానా చాలా మందికి ఇవి మాత్రమే ఇస్లామిక్ దేశాలని, ఇస్లామిక్ దేశాలంటేనే ఇలా ఉంటాయన్న అభిప్రాయానికి చాలా మంది వచ్చేశారు.
అంతేకాదు ఈ నాలుగైదు దేశాల్లో జరిగే గొడవలకు, లేదా అల్-ఖైదా, ISIS ఇతర టెర్రరిస్ట్ గ్రూపులు చేసే తీవ్రవాద సంఘటనలకు ఇస్లామిక్ టెర్రరిజం అన్న పేరు తగిలించి పైగా ఆయా టెర్రరిస్ట్ గ్రూపుల్లో ముస్లిం వేషాల్లో ఉండే తీవ్రవాదులను జీహాదీలని తప్పుడు పేర్లు తగిలించి మీడియా పదే పదే వండి వార్చుతూ ఉండటం మూలానా.. ఒకప్పుడు భారత స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ తో తలపడి ప్రాణాలు కోల్పోయినవారిలో దాదాపు డభై శాతం మంది ముస్లిములే ఉన్నారన్న వాస్తవం మరుగున పడిపోయింది. ఉదాహరణకు వంద మంది వ్యక్తులున్న ఒక వర్గంలో ఎవరో ఒకరిద్దరు చేసే తప్పులను పట్టుకుని వాటిని మిగతా వారందరికీ ఆపాదించి, పైగా వారంతా అనుసరించే ధర్మానికి తీవ్రవాదాన్ని అంటగట్టి వారందరినీ పరోక్షంగా తీవ్రవాదులుగా జమకట్టటం ఎంత అన్యాయం కదా! నేడు ఇస్లాం పట్ల, ముస్లిముల పట్ల కొందరు మతోన్మాద రాజకీయ నాయకులు, వేర్పాటువాదులు, మీడియా వ్యవహరించే తీరు అచ్చం అలాగే ఉంది.
