ఇస్లాం & సమానత్వం

“నాతో పాటు మక్కా యాత్రకు దాదాపు పదివేల మంది యాత్రికులు ఇక్కడ ఉన్నారు. అందులో అన్ని రంగుల ప్రజలు ఉన్నారు. నీలికళ్లు కలిగిన శ్వేత జాతీయుడు నుండి నల్ల చర్మం కలిగిన నీగ్రోవరకు ఉన్నారు. మేమంతా ఎంతో ఐక్యతతో సోదర స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఒకే వరుసలో నిలబడి ఒకే దైవానికి ఆరాధన చేస్తున్నాము. అమెరికాలో నాకున్న అనుభవాన్ని బట్టి.. తెలుపు, నలుపు రంగుల వ్యక్తుల మధ్య ఇలాంటి పటిష్ట ఐక్యత కూడా ఉంటుందని నమ్మశక్యం కావటం లేదు..

అమెరికా ఇస్లాంను అర్థం చేసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఈ ధర్మం ఒక్కటే సమాజంలో జాత్యాహంకారం అన్న జాఢ్యాన్ని తుడిచిపెడుతుంది. నేను చేసిన ప్రయాణాలలో నేను ఎందరో వ్యక్తులతో మాట్లాడాను అమెరికన్స్ అయిన తెల్లజాతి ముస్లిములతో కూడా కలిసి తిన్నాను. కానీ వారి హృదయాలలో మేము తెల్లవాళ్లమన్న అహంకారాన్ని ఇస్లాం ఎప్పుడో తుడిచిపెట్టేసింది..

ఒకవేళ అమెరికన్ తెల్ల జాతీయులు కూడా దేవుని ఏకత్వాన్ని గనుక అంగీకరించగలిగితే.. వారుకూడా మానవులంతా ఒక్కటే అన్న వాస్తవాన్ని గ్రహించి, ఇతరులను రంగులను బట్టి వివక్ష చూపటాన్ని, హాని చెయ్యటాన్ని మానేస్తారు. నామాత్ర క్రైస్తవం కలిగిన అమెరికా నయం చేయలేని కేన్సర్ లాంటి జాతి వివక్షను కలిగి ఉంది.

ఇక్కడ నేను గౌరవింపబడుతున్నంతగా ఎప్పుడూ గౌరవింపబడలేదు. నేను ఓ అనర్హుడన్న భావన నాకు ఎప్పుడూ కలగలేదు. ఒక నల్లటి నీగ్రో పై ఇంతటి ఆశీర్వాదాలు కురవటాన్ని బహుశా ఎవరూ నమ్మరేమో.

నాతోటి ముస్లిము సోదరుడైన ఓ నీలి కళ్ల తెల్ల జాతీయుడు ఒక నల్లటి నీగ్రో కలిసి తిన్న కంచం నుండి తింటూ, అతను త్రాగిన గ్లాసు నుండి త్రాగుతూ.. వారితో పాటు ఒకే రగ్గు కప్పుకుని పడుకుంటూ.. ఈ విధంగా అందరం కలిసి ఒకే దైవాన్ని ఆరాధిస్తున్నాము.

ఓ నల్ల వాని వెనుక నిలబడి ప్రార్ధిస్తున్న ఓ తెల్ల వాని ప్రక్కన నేను నిలబడి అతనితో భుజం కలిపి ప్రార్థిస్తూ… ఓ నీలి రంగు కనుల వ్యక్తి తింటున్న కంచం నుండి ఆహారం తింటూ… మరియు ఓ లేత రంగు చర్మమున్న అరబ్బు షేక్ త్రాగిన కప్పు నుండి నీళ్లు త్రాగుతూ… మనస్ఫూర్తిగా ఈ పవిత్ర పట్టణాన్ని నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను”

ఇది మక్కా యాత్రకు వెళ్లిన మాల్కమ్ X అక్కడి నుండి తన భార్య ‘పట్టి సండేర్స్’ కు రాసిన లేఖ:
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

జాత్యాహంకారానికి వ్యతిరేకంగా గళాన్ని లేవనెత్తిన మాల్కమ్ – X గురించి దాదాపుగా తెలియని వారు ఉండరు.

“నల్లవానికి తెల్లవానిపై గానీ, తెల్లవానికి నల్లవానిపై గానీ ఎలాంటి అధిక్యతా లేదు కేవలం సత్ప్రవర్తన, భయభక్తుల ద్వారా తప్ప”

అంటూ జాత్యాహంకార భావనను కూకటివేళ్లతో పెకిలించి పరేసిన ఇస్లాం విశాలమైన బోధల పట్ల మాల్కమ్ X ప్రభావితుడై ఇస్లాంను లోతుగా పరిశీలించి చివరకు ఇస్లాం స్వీకరించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *