ముస్లిములు కరోనా బారినపడి చనిపోయిన హిందూ, క్రైస్తవ సోదరుల అంత్యక్రియలు చేయటం వెనుక పనిచేస్తున్న ప్రధానమైన ప్రేరకం ఏమిటి?

కేవలం తోటిమానవుల సేవ చెయ్యటం.. తద్వారా దైవ ప్రసన్నత పొందటం అన్న ఒక్క ప్రేరణ మాత్రమే ముస్లిములు కరోనా బారినపడి చనిపోయిన హిందూ సోదరుల అంత్యక్రియలు చేయటం వెనుక పనిచేస్తున్న ప్రధానమైన ప్రేరకం.

ఒకవేళ ముస్లిం సమాజం గత సంవత్సరం తబ్లీఖ్ ఉదంతంలో అన్యాయంగా నిందించబడనప్పటికీ, అనేక రకాలుగా హింసిచబడకపోయినప్పటికి కూడా.. ప్రస్తుత పరిస్థితుల్లో భారత ముస్లింలు కరోనా మృతుల కళేభరాలను ఖననం చేసే బాధ్యతను తమ భుజాలపై ఎత్తుకుని ఉండేది.

తప్పితే నేడు ముస్లింలు కరోనా కరోనా మృతుల కళేభరాలను ఖననం చేసే బాధ్యతను తమ భుజాలపై ఎత్తుకున్నది తమ మంచితనాన్నీ, సేవానిరతినీ పనికట్టుకుని ప్రదర్శించుకోవటానికి కాదు.

ఇంకా ఫేస్బుక్ లో కొందరు విమర్శకులకు బాధకలిగించే విషయం ఏమంటే ఈ ఖననాలు చేసేటప్పుడు పీపీఇ కిట్ వేసుకున్నా వేసుకోకపోయినా నెత్తిన టోపీ, వీలున్నంతవరకూ ఇస్లాం వస్త్రధారణ చేసుకుని వీడియోలలో, ఫోటోలలో తమ అస్థిత్వాన్ని చూపించుకోవాల్సి వస్తుందన్నది.

అలాంటి విమర్శకులకు తెలీని విషయం ఏమిటంటే.. ముస్లిం సమాజంలో మృతుని ఖనన ప్రక్రియ సైతం ఎంతో గౌరవంగా భక్తి శ్రద్ధలతో సూచీ శుభ్రతలు పాటిస్తూ చెయ్యటం జరుగుతుంది. అంత్యక్రియల్లో పాల్గొనే ముస్లిములందరూ ఇస్లాం వస్త్రధారణలో, తలపై టోపీ ధరించి మృతుని కోసం ‘ప్రత్యేక సామూహిక ప్రార్ధన’ చేస్తారు. దానినే ‘జనాజా నమాజ్’ అంటారు. ఆ తరువాత అందరూ సామూహికంగా అతని పాపాల మన్నింపు కోసం వేడుకుంటారు. ఆ తరువాత మట్టిలో పూడ్చిపెడతారు.

కరోనా మృతులను ఖననం చేసే సందర్భాల్లోనూ చనిపోయింది హిందువులైనా, క్రైస్తవులైనా లేక మరెవరైనా ముస్లిములు మట్టుకు ఆయా మృతుల మతపరమైన ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తూనే.. ఆ సమయంలో తాము పాటించాల్సిన నియమాలు పాటిస్తూ ఖననం చేస్తున్నారు. అందులో భాగంగానే వారు తలపై టోపీ ధరిస్తున్నారు. తప్పితే ఇది వారు తమ అస్థిత్వాన్ని చూపించుకోవటానికో, తమ ఐడెంటిటినీ ప్రదర్శించటానికో కాదు.

దేశ సేవ చెయ్యటం భారతదేశ ముస్లిముల నరనరాల్లోనూ ఉంది. అది స్వాతంత్రోధ్యమంలో ప్రాణాలు అర్పించటం నుండి నేడు కరోనా విజృంభిస్తున్న తరుణంలో తమ ప్రాణాలకు లెక్క చెయ్యకుండా కరోనా మృతుల ఖననాలు చెయ్యటం వరకు ఈ దేశ ముస్లిములు ఏదో రూపంలో ఈ దేశానికి సేవ చేస్తూనే ఉంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *