ఒళ్లంతా టాటులతో లతో నిత్యం డ్రగ్స్ లో మునిగి తేలుతూ విచిత్రంగా కనిపించే “రోబ్బి మాస్ట్రక్” ఒక ప్రక్క బైకి గా ఉంటూ అనేక నేరాలు చేసి చివరకు క్రిమినల్ గా మారి జైలు జీవితం అనుభవిస్తున్న సమయంలో ఇస్లాంను లోతుగా స్టడీ చేసి చివరకు ఇస్లాం స్వీకరించి.. ఒకప్పుడు క్రిమినల్ జీవితం గడిపి ఇప్పుడు ‘ఇస్లామిక్ యూత్ వర్కర్’గా మారిపోయి పూర్తి నైతిక జీవితం గడుపుతున్నాడు.
అయితే నేనితని కేస్ స్టడీ చేస్తున్నప్పుడు నాకొచ్చిన కొన్ని సందేహాలు: ఇస్లాం తన ప్రత్యేక మహత్తుతో అతన్ని నేరజీవితం నుండి నైతిక జీవితం వైపునకు తీసుకెళ్లిందా? లేక అతను ఇస్లాం బోధనల్ని పరిశీలించి అర్థం చేసుకోవటాన్ని బట్టి నైతిక జీవనం వైపునకు వెళ్లగలిగాడా? ఇస్లాం అతని చేత డ్రగ్స్ మాన్పించిందా? లేక ఇస్లాం బోధనల్ని అతను లోతుగా అర్థం చేసుకోవటాన్ని బట్టి అతని ప్రవర్తనలో మార్పొచ్చిందా?
ఎందుకంటే .. తలపై టోపీలు గెడ్డాలు పెట్టుకుని పైకి ఉర్దూ/అరబిక్ పేర్లు పెట్టుకుని టెర్రరిజం చేసే నామమాత్ర ముస్లిముల నుండి సిగరెట్లు, గుట్కా, బ్రాందీ, విస్కీలు త్రాగుతూ ఇంట్లో అడోళ్లను చితకబాదుతూ.. లక్షల్లో కట్నాలు గుంజుతూ.. ఎలా పడితే అలా బూతులు మాట్లాడుతూ అత్యాచారాలు సైతం చేసే ఘనులు ముస్లిం సమాజంలోనూ ఉన్నారు. ఒక్క ముస్లిం సమాజంలోనే కాదు అన్ని మత వర్గాల్లోనూ అలాంటి మూర్ఖులు, నీచులూ ఉండటం కామనే! ఎందుకంటే ఏ మతవర్గంలోనూ అందరూ మంచోళ్లూ ఉండరు.. అందరూ చెడ్డోళ్లూ ఉండరు కనుక! ఆ విషయం కాస్సేపు ప్రక్కనపెడితే..
ఓ క్రిమినల్ లేక.. ఓ తీవ్రావాది.. ఓ డ్రగ్స్ కు అలవాపడిన ముస్లిమేతరుడిపై ఇస్లాం ప్రభావం చూపగలిగినప్పుడు ముస్లిం సమాజంలో ఉంటూ పై విధమైన చెడుల్లో మునిగితేలే ముస్లిములపై అలాంటి ప్రభావం ఎందుకు చూపలేకపోతుంది? ముస్లిం సమాజంలో ఉంటూ పై విధమైన అనేక చెడులకు బానిసలుగా ఎందుకు మారిపోతున్నారు? లోపం ఇస్లాంలో ఉందా? దానిని పరిశీలించి అర్థం చేసుకోలేని కొందరు ముస్లిముల్లో ఉందా? క్రిమినల్స్ గా జీవితాలు గడుపుతూ ఇస్లాంను అర్థం చేసుకుని ఇస్లాం స్వీకరించి ఉత్తములుగా మారుతున్న అనేక ఉదాహరణలు దృష్టిలో పెట్టుకుంటే పై ప్రశ్నకు సమాధానం రెండవదే అవుతుంది!
ఇక్కడ కొందరు ఒక ప్రశ్న లేవనెత్తవచ్చు: అంటే రోబ్బి మాస్ట్రక్ లాంటి క్రిమినల్స్ 1400 వందల సంవత్సరాలకు ముందు.. అంటే.. ప్రవక్త ముహమ్మద్ (స) ఇస్లాం స్థాపించక ముందు ఎప్పుడూ ఎవరూ మార్పు చెందలేదా? ఒక్క ఇస్లాం మాత్రమే అలాంటి మహత్తరమైన బోధలను కలిగి ఉందా? అని.
కచ్చితంగా ఇస్లాంలో ఒక వ్యక్తి ప్రవర్తనను మార్చగలిగే మహత్తర బోధలున్నాయనటంలో సందేహం లేదు! ఆ విషయం ప్రక్కనపెడితే.. ఇస్లాం 1400 సం.లకు పూర్వం ప్రవక్త ముహమ్మద్ (స) ద్వారా స్థాపించబడలేదు కానీ పునః స్థాపించబడిందన్నది ముందు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. ముహమ్మద్ (స) కంటే పూర్వం “ఇస్లాం” యేసు ద్వారా అంతకు పూర్వం మోషే, యాకోబ్, అబ్రాహాం ఇంకా వెనక్కు వెళ్లిపోతే నోవాహు… భారతదేశ చరిత్రలో వైదిక ధర్మం పేరుతో .. ఇంకా వెనక్కు వెళ్లిపోతే ఆదిదంపతులైన ఆడమ్-ఈవ్ ల నుండి అనేక ప్రవక్తలూ, ఋషుల ద్వారా పరంపరగా బోధించబడుతూ వస్తున్న సనాతన ధర్మమే ఇస్లాం! “ఇస్లాం” అన్నది కేవలం “ఏకదేవుని విధేయతా ధర్మం” అన్న దృక్పథానికి సంక్షిప్త అరబిక్ పదం మాత్రమే.
కాబట్టి ప్రతీ కాలంలోనూ ధర్మాన్ని నిర్లక్ష్యం చేసేవారితో పాటు.. అనేక ప్రవక్తల ద్వారా బోధించబడిన ధర్మాన్ని లోతుగా పరిశీలించి అర్థం చేసుకోన్నోల్లూ ఉన్నారు. అలా అర్థం చేసుకున్నోల్లలో దుర్మాగులు దౌర్భాగ్యులు సైతం ధార్మికులుగా మారిపోయారు. ధర్మంలో ఉంటూనే ధర్మాన్ని అర్థం చేసుకోక నిర్లక్ష్యం చేసినోళ్లు నామ మాత్ర ధార్మికులుగా మిగిలిపోవటమే కాక.. దుర్మార్గపు పనులు చెయ్యటం కూడా మొదలెట్టారు.
కాబట్టి ఇస్లాం డ్రగ్స్, సిగరెట్లు, మత్తు పానీయాల వంటి వాటికి అలవాటు పడి మత్తులో మునిగితేలుతూ క్రిమినల్ జీవితం గడిపేవాణ్ణి పరిశుద్ధునిగా మార్చుతుందా? లేక అలాంటి జీవితం గడుపుతూ ఇస్లాంను లోతుగా చదివి అర్థం చేసుకుంటే పరిశుద్ధునిగా మారే అవకాశం లభిస్తుందా? అంటే చెయ్యల్సింది రెండవదే.
సనాతన ఇస్లాం ధర్మం ఉన్నతమైనదే.. కానీ దానిని ఎంత అర్థం చేసుకున్నాము అన్నదానిపైనే వ్యక్తి పరివర్తన అన్నది ఆధారపడి ఉంటుంది. ప్రభావవంతమైన నైతిక బోధలు ఉండటం వేరు వాటిని అర్థం చేసుకుని జీవితాన్ని తీర్చిదిద్ధుకోవటం వేరు. సిగరెట్ నో, విస్కీ నో త్రాగేటప్పుడు వాటిపై కూడా వీటిని మీరు దీనిని సేవిస్తే పోతారనే రాసి ఉంటుంది. జీవితం విలువ.. దానిని సేవించటం వల్ల కలిగే అనర్థాలు.. వాటి వల్ల కలిగే మానసిక-శారీరక నష్టాలు వగైరా వాటిని అనలైజ్ చేసేవారు వేరేగా ఉంటారు. ఆ.. ఇవన్నీ ఆలోచిస్తే లైఫ్ లో ఎంజాయ్మెంట్ ఉండదని ఆలోచించేవారూ కొందరుంటారు. మొదటి రకం వ్యక్తుల ప్రవర్తనలో మార్పు వస్తుంది. రెండవ రకం వ్యక్తుల ప్రవర్తన శూన్యమై సర్వనాశం అవుతుంది.
కాబట్టి చెడు అలవాట్లన్నీ మానేసుకుని మంచి జీవితం ప్రారంభించటానికి పెళ్లాం పిల్లల్ని వదిలేసి ప్రపంచానికి దూరంగా ఎక్కడో మఠాల్లో సన్యాసులుగా మారిపోవాల్సిన పనిలేదు. కేవలం ధార్మిక గ్రంథాల్లో సృష్టికర్త అయిన దేవుని ఆజ్ఞలు ఏమిటి? వాటిని పాటించటం వల్ల కలిగే మానసిక-శారీరక లాభాలేమిటి? నష్టాలేమిటి? సామాన్య జీవనం సాగిస్తూనే అంటే వ్యాపారాలు ఉధ్యోగాలు చేసుకుంటూనే పాటించటానికి అనువుగా ఎంతో సులువైన ధర్మాన్ని ఇస్తున్న ధార్మిక గ్రంథాల సందేశం ఏమిటి? అన్న విషయాల పట్ల దృష్టి సారించటమే
ఇస్లాం ఒక క్రిమినల్ ను మార్చగలుగుతుందా?
