ఖురాన్ వాక్యాలతో పాటు ఇతర గ్రంథాలపై కూడా పిటిషన్ వెయ్యాల్సింది కదా?

ఖురాన్ లోని 26 వాక్యాలు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నాయని సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన ఆ షియా మూర్ఖుడైన వసీం రిజ్వీకి మరి బైబిల్లో, వేదాల్లో, గీతా శాస్త్రాల్లోని కూడా దౌర్జన్యపరులను సంహరించమని, చంపమని కొన్ని వందల వాక్యాల్లో వ్రాయబడి ఉందన్న సంగతి తెలియదా?

అలాంటప్పుడు ఒక్క ఖురాన్ పైనే కాక, గీతా శాస్త్రం, బైబిల్ వాక్యాల పై కూడా కలిపి పిటిషన్ వెయ్యాల్సింది. కాకపోతే, ఇదంతా పబ్లిసిటీ స్టంట్ లో భాగం కాబట్టి అంత బుర్రా, బుద్ధీ ఉపయోగించే అవసరం ఉండదు. నిజంగా ఖురానే చదివి ఉంటే అన్యాయంగా ఏ ప్రాణినీ హతమార్చకూడదని చెప్పబడిన అనేక ఖురాన్ వాక్యాలు కూడా కళ్లకు కనపడి ఉండేవి.

రష్యాలో అచ్చం ఇలాగే ఓ మహానుభావుడు 2011లో భగవద్గీత ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని దానిపై కోర్టులో పిటిషన్ వెయ్యటం జరిగింది. దానిపై అప్పట్లో చాలా రభస జరిగింది. భారతదేశంలో కూడా ఆ కేసుపై నిరసనలు వెల్లువెత్తాయి. చివర్లో సెర్బియన్ కోర్టు ఆ కేసును కొట్టేసింది.

ఇలాంటి మూర్ఖులకు తెలీని విషయం ఏమిటంటే..

ధర్మాన్ని అణగద్రొక్కాలని కుట్ర పన్ని కొందరు దుర్మార్గులు విశ్వాసులపై దాడి చేసి, వారిని హతమార్చాలన్న ఉద్దేశంతో యుద్ధానికి కాలు దువ్విన సందర్భంలో.. అలాంటి దౌర్జన్యపరులకు వ్యతిరేకంగా యుద్ధం చేసి వారిని చంపేయమన్న వాక్యాలు ఒక్క ఖురాన్ లోనే కాదు గీతా శాస్త్రం, వేదాల్లో, బైబిల్లో అనేక వాక్యాల్లో ఉన్నాయన్నది. అది కేవలం ప్రాణ రక్షణ నిమిత్తమే తప్ప ఏ కారణం లేకుండా, అన్యాయంగా నిర్దాక్షణీయంగా అమాయకులను చంపేయమని కాదు. ఉగ్రవాదం చెయ్యమని ఏ గ్రంథమూ చెప్పదూ. ఈ విషయం ఖురాన్ పై కేసు వేసినా సగం మెదడు మేధావికి అస్సలు తెలీని విషయం.

సహజంగా షియా వర్గీయుల్లో ఖురాన్ జ్ఞానమే అంతంత మాత్రంగా.. అరాకొరా ఉంటుందంటే ఈ పిటిషన్ వేసిన వ్యక్తికి పాపం కనీసం అందులో పావువంతు జ్ఞానం కూడా లేదన్న విషయం తేలిపోతుంది.

సరే ఇంతకూ ఖురాన్ లోని 26 వాక్యాలు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నాయన్నదే నిజమైతే ఆ ఖురాన్ ను చదివి అనుసరించిన వేల కొద్దీ ముస్లిములూ, ముస్లిం పండితులూ స్వతంత్ర ఉధ్యమంలో ఈ దేశం కోసం తృణప్రాయంగా తమ ప్రాణాలు ఎలా అర్పించేశారు? వారు ఉగ్రవాదం చెయ్యలేదెందుకు?

అంటే ఖురాన్ ను బాగా అర్థం చేసుకుంది ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించేసిన నాటి ముస్లిములా? నేడు ముస్లిం పేర్లు పెట్టుకుని టెర్రరిజం చేస్తున్న అభినవ ఉగ్రవాదులా? అన్నది ఖురాన్ విమర్శకులు ఆలోచించుకోవాల్సిన అతి ముఖ్యమైన ప్రశ్న.

ఇక ఖురాన్ ఈ ప్రపంచంలో ఉనికిలో ఉన్నది కేవలం వ్రాతప్రతుల రూపంలో మాత్రమేనా? దానిపై కేసు పెట్టి కొన్ని వాక్యాలు తొలగించాల్సిందిగా కోరటానికి?

ప్రపంచంలో ఖురాన్ హాఫీజ్ లు (పూర్తి ఖురాన్ ను కంఠస్తం పట్టిన వారు) కోట్లలో ఉన్నారు. ప్రతీ సంవత్సరం లక్షల్లో ఖురాన్ కంఠస్తం పట్టిన విద్యార్థులు తయారవుతున్నారు. వారి మనో ఫలకాలపై ముద్రించబడి ఉన్న ఖురాన్ వాక్యాలు ఏ కోర్టులు తొలగించగలవు? ప్రపంచ జనాభాలో మూడొంతుల్లో ఒక భాగమైన ముస్లిముల ద్వారా ఏదో ఒక మూల ప్రతీ నిమిషం నమాజుల్లో పఠించబడుతూ ఉండే ఖురాన్ వాక్యాలు తొలగించటం ఏ దేశ చట్టాల వల్ల సాధ్యపడుతుంది?

ఈ మాత్రం లాజిక్కు ఆ పనికి మాలిన పిటిషన్ వేసే ముందు ఆ మూర్ఖుడు ఎలా మిస్సయ్యుంటాడంటారు!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *