సోమవారం సాయంత్రం ఆస్ట్రియాలోని వియన్నాలో ఒక్కసారిగా టెర్రరిస్ట్ ఎటాక్ జరిగిందనన్నది అందరికీ తెలిసిందే కానీ ఆ ఎటాక్ జరుగుతున్నప్పుడు ప్రాణాలకు తెగించి ఓ పోలీస్ ఆఫీసర్ ను మరో ఇద్దరు మహిళలను కాపాడింది టర్కీకి చెందిన ఇద్దరు ముస్లిం యువకులన్నది చాలా తక్కువ మందికి తెలిసిన విషయం.
ఎందుకంటే ఆ ఎటాక్ జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఎటాక్ లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అన్నదానికంటే ఆ కాల్పులు జరిపిన వ్యక్తి మతం ఏమిటా అని చాలా మంది వెతికారు తప్ప ఆ ఎటాక్ లో ప్రాణాలకు తెగించి కాపాడింది ముస్లిములన్న విషయం తెలియగానే ప్రధాన స్రవంతి మీడియా కుడా గమ్మున ఉండిపోయింది. దీని ప్రస్తావన కూడా మీడియాలో అస్సలు లేనే లేదు
ఆస్ట్రియాలో పుట్టి పెరిగిన టర్కీకి చెందిన ‘తయ్యిప్ గుల్టెకిన్’, ‘మికాయిల్ ఓజెన్’ సరిగ్గా గన్ ఫైరింగ్ ప్రారంభమైన ప్రదేశంలోనే ఉన్నారు. అప్పటికే ఆ కాల్పుల నుండి ఇద్దరు మహిళలను కాపాడారు ఒక పోలీస్ ఆఫీసర్ గాయాలతో పడి ఉన్నాడు. స్వతహాగా మిక్సెడ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ అయిన మికాయిల్ ఆ ఫైరింగ్ చేస్తున్న తీవ్రవాది బుల్లెట్ల నుండి జిగ్ జాగింగ్ గా తప్పించుకుంటూ ప్రాణాలకు తెగించి పరిగెడుతూ వెళ్లి నేలపై పడి ఉన్న ఆ పోలీస్ ఆఫీసర్ ను ఆంబులెన్స్ లోకి ఎక్కించాడు.
మీడియా ఎక్కడ కాల్పులు జరిగి అందులో ముస్లిముల పేర్లు ఉన్నా వారిని ఇస్లామిక్ టెర్రరిస్టులని, జిహాదిలని పేర్లు పెడుతుంది. నిజానికి “జిహాదీలు” అన్న పదం మారణహోమం సృష్టించేవారికి వాడే పదంకాదు. ఈ విషయం అటు మీడియాకు గానీ.. ఇస్లాం విమర్శకులకు గానీ తెలీని విషయం. కానీ, మారణహోమం జరక్కుండా ఆపుతారు చూడండి వారు అసలు జిహాదీలంటే. ఆస్ట్రియాలో ఒకవేళ మరలా కాల్పులు జరిపినా మేము నిస్సంకోచంగా వెళ్లి ప్రజల ప్రాణాలు కాపాడతాం అని చెప్పిన ఆ యువకులు అసలు జిహాదిలంటే..
ఇస్లాం ప్రకారం ప్రజల మానప్రాణాలను రక్షించటం జిహాద్.. చెడు చెయ్యటం కాదు చెడుతో పోరాడటం జీహాద్ చెయ్యటం అంటే. కాబట్టి తమ ప్రాణాలకు తెగించి తోటివారి ప్రాణాలు రక్షించిన వీరిని అనాలి.. అసలు జిహాదీలని
ప్రాణాలు కాపాడిన వీరు అసలు జిహాదీలు అంటే
