సాధారణంగా ఎక్కడ ఏ ముస్లిం పేర్లు పెట్టుకున్నోల్లు నేరం చేసినా.. ఎక్కడ ఉగ్రవాద ఘటనలు జరిగినా చాలా మంది ఇస్లాం క్రిటిక్స్ నుండి సోషల్ మీడియాలో సామాన్య విమర్శకులు, విశ్లేషకుల వరకూ తరచుగా చెప్పే మాట “ఇస్లాం సంస్కరించబడాల్సిన అవసరం” ఉందని. ఇటీవల ఫ్రాన్స్ లో జరిగిన టీచర్ హత్య అనంతరం సైతం ఆ దేశ అధ్యక్షుడు సైతం ఇదే మాట ప్రకటించాడు.
మీడియా ప్రభావానికి గురైన చాలా మంది ముస్లిమేతరులకు ఇది పైకి వినటానికి కరక్టే కదా అనిపిస్తుంది. ఇంకొందరైతే ఇంకో అడుగు ముందుకేసి.. ఇస్లాం నిజంగా శాంతి మతమే అయితే టెర్రరిస్టులందరినీ మార్చ గలగాలి కాదా? ముస్లిములు పేర్లు పెట్టుకున్నోళ్లలోనే టెర్రరిజం ఎక్కువగా ఎందుకుంది? అన్న ప్రశ్నలూ సంధించటం మొదలెడతారు.
అసలు “వరల్స్ క్రైమ్ స్టాటెస్స్టిక్స్” ప్రకారం చూస్తే… ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఐదు నిమిషాలకూ ఏదో మూల ఏదో ఒక ఏదో ఒక నేరం జరుగుతూనే ఉంది.. అందులో నేరాలకు పాల్పడేవారిలో ప్రతీ ఒక్కడూ ఏదో ఒక మతానికి చెందినోడే అయి ఉంటాడు. తప్పితే ఏదో ఒక పార్టిక్యులర్ మతానికి చెందిన వారే క్రైమ్స్ కాపీరైట్స్ తీసుకునైతే నేరాలకు పాల్పడరు. ఒక్క భారతదేశంలోనే ప్రతీ 15 నిముషాలకూ ఒక రేప్ జరుగుతుంది. స్థానిక వార్తా పత్రికల్లో కూడా రోజూ వరకట్న హత్యలు, కులహత్యలు లేక ఆస్తిపంపకాల్లో నరుక్కోడాలు, చంపుకోవటాలకు సంబంధించి ఏదో ఒక వార్త లేకుండా ఉండదు.
అవన్నీ హత్యలు, దాడులు, దౌర్జన్యాలు వగైరా పేర్లతో స్థానిక నేరాలుగా మీడియా చూపితే.. ఆయా నేరాల్లో ఏ ముస్లిం పేరున్న ఏ వ్యక్తో నేరం చేస్తే అది మటుకు అంతర్జాతీయ వార్త అయి కూర్చుంటుంది. మేయిన్ స్త్రీమ్ మీడియా/సోషల్ మీడియా దానిని ఇస్లామిక్ తీవ్రవాదంగా ముద్ర వేసేస్తుంది. ఆ నేరానికి మొత్తం ముస్లిం సమాజానికీ, ఇస్లాంకూ ముడిపెట్టేస్తుంది. దాని మీద డిస్కషన్లు కొన్ని వారాలు సాగుతాయి ఈలోపు కొన్ని వందల క్రైమ్స్ జరిగిపోతుంటాయి.
ఉదాహరణకు ఫ్రాన్స్ లో ఓ ముస్లిం కత్తిచ్చుకుని చంపేస్తే అది ఇస్లామిక్ టెర్రరిజం.. కానీ అదే ఫ్రాన్స్ లో “డర్టీ అరబ్స్” అని అరుస్తూ ఇద్దరు ముస్లిం మహిళలను ఈ మధ్యే ఓ ఫ్రెంచ్ మహిళ కత్తితో పొడినట్టు సోషల్ మీడియాలోనే చాలా మందికి తెలియదు. దానిని మటుకు మీడియా “టెర్రరిజం”గా చూపదు. ఎందుకంటే ముస్లిం పేర్లు పెట్టుకొన్నోల్లు చేసే నేరాలనే టెర్రరిజంగా మీడియా వండి వార్చుతుంటుంది గనుక దానికే చాలా మంది బ్రెయిన్ వాష్ చెయ్యబడి ఉంటారు.
ఇక అసలు టాపిక్ పై వస్తే..
ప్రపంచ చరిత్రను ఒకసారి తిరగేస్తే.. నీచమైన ముఢాచారాలలో మునిగిపోయి నైతికతలో అధః పాతాళానికి దిగజారిపోయిన ఒక అనాగరిక జాతిని కేవలం 23 మూడేళ్లలో ప్రపంచానికి నాగరికత, నైతిక విలువలు నేర్పే వ్యక్తులుగా మార్చగలిగిన వ్యక్తి కూడా ఒకతను ఉన్నాడు అతను వాళ్లను ఇస్లాం ధర్మం ఆధారంగా ఉన్నత స్థాయి నైతిక విలువలు కలిగిన వ్యక్తులుగా మార్చగలిగాడు ఆయన పేరే ప్రవక్త ముహమ్మద్ (స) అని చెబితే.. నేడు స్వయంగా ఆయన్ని విమర్శించే వ్యక్తులు తట్టుకోలేరు. ఎందుకంటే వారు ఆయన గురించి చదివింది లేదు కేవలం మీడియా ద్వారా బ్రెయిన్ వాష్ చెయ్యబడి, ఇంటర్నెట్ లో వచ్చే గాసిప్స్ నే చదివి ఉన్నారు కనుక.
మరి అప్పుడు ఆనాటి కాలం వ్యక్తులకు అంతలా ప్రభావం చూపిన ఇస్లాం ఈనాటి అధికశాతం ముస్లిములపై ఎందుకు ప్రభావం చూపలేకపోతుంది? అన్నది చాలా మంది లేవనెత్తే ప్రశ్న. దీనికి సమాధానం.. ప్రవక్త ముహమ్మద్ (స) ఉన్న కాలంలోనూ ఇస్లాంను తిరస్కరించినవారు త్రోసిపుచ్చినవారూ ఉన్నారు. ఇస్లాంపై ఘోరమైన విమర్శలు చేసేవారు. చివరకు ప్రవక్త ముహమ్మద్ (స) ఆయన శిష్యులపై యుద్ధం ప్రకటించి వారిని చంపేయటానికి కూడా సిద్ధమయ్యారు. ఇస్లాం సత్యతనూ, ప్రవక్త ముహమ్మద్ (స) బోధల్లో లోతునూ నిజాయితీని పరిశీలించి ఇస్లాం స్వీకరించిన వారూ ఉన్నారు. తరువాతి కాలాల్లో ఎందరో ప్రవక్త ముహమ్మద్ (స) శత్రువులే ఇస్లాం సైతం స్వీకరించారు.
ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే.. ఏ యుగంలోనైనా.. ఏ జాతిలో ఏ వర్గంలో నైనా పరిశీలకులూ, అవగాహనాపరులతో పాటు మూర్ఖులు, దౌర్జన్యపరులు కూడా కొందరు ఉంటారు. అలాగే ముస్లిములు అనగానే అందరూ నూటికీనూరుశాతం ఏ తప్పూ చెయ్యని దేవదూతలేమీ కారు. వారిలోనూ ఇస్లాంను అర్థం చేసుకున్న ఉన్నతమైన సంస్కారవంతులతో పాటు కొందరు మూర్ఖులు కూడా ఉన్నారు. మంచివారితో పాటు చెడు చేసేవారూ ఉన్నారు. దానికి కారణం ఇస్లాం కాదు. అలా అనుకుంటే హిందూత్వం ఎంత గొప్పదైనప్పటికీ క్రైస్తవం ఎంత గొప్పదైనప్పటికీ వారిలోనూ మంచివారితో పాటు చెడు చేసేవారూ ఉంటారు. ఆ కొందరు మూర్ఖులకు హిందూ శాస్త్రాలు లేక బైబిల్ బాధ్యత వహించవు కదా?
అలాగే.. ఇస్లాం బోధలు ఎంత గొప్పవైనా వాటిని లోతుగా అర్థం చేసుకున్నప్పుడే ఇస్లాం ఏ వ్యక్తిపై అయినా ప్రభావం చూపుతుంది.. తప్ప ఒక వ్యక్తి ముస్లిముల ఇంత పుట్టినంతలో.. ఏ ఉర్దూ/అరబిక్ పేరు పెట్టుకున్నంతలోనో ఆటోమేటిగ్గా ఇస్లాం ప్రభావం ఆవహించెయ్యదు. ఇంటి అల్మరాలో ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ఉన్నంత మాత్రానా ఇంట్లో అందరూ ఆటోమేట్టిగ్గా ఇంగ్లీష్ మాట్లాడేయరు కదా.
నేడు చాలా మంది ముస్లిముల పరిస్థితి అలానే ఉంది. ఇస్లాం అనే గొప్ప ధర్మాన్నీ, ఖురాన్ అనే గొప్ప నైతిక విలువలూ సహాన శాంతులు నేర్పే గ్రంథం వారి చేతుల్లో ఉన్నప్పటికీ.. ప్రవక్త ముహమ్మద్ (స) లాంటి మహా వ్యక్తి జీవిత చరిత్ర తాలూకు ఎన్నో పుస్తకాలు ఉన్నప్పటికీ వాటి అవగాహన చాలా మందికి లేదనటం అతిశయోక్తి కాదు.
ముస్లిం సమాజంలో కొందరు ప్రదర్శించే ముఢాచారాలూ, మూర్ఖపు పనుల వల్ల పరోక్షంగా ఇస్లాం నిందించబడుతూ ఉంటుంది. కారణం ముస్లిమేతర సమాజం ఇస్లాంను చూడదు ముస్లిం సమాజాన్నే చూస్తుంది కనుక. కాబట్టి ఇక్కడ సంస్కరించబడాల్సింది ఇస్లాం కాదు నేటి ముస్లిం సమాజంలో ఉన్న ఇస్లాం అనవగాహనాపరులైన కొందరు ముస్లిములు మాత్రమే.
కాబట్టి ముస్లిమేతరులు చెయ్యాల్సింది – ఇస్లాంను గాసిప్పుల్లో దొరికే సమాచారం ఆధారంగా కాకుండా ఖురాన్ ఆధారంగానే స్టడీ చెయ్యాలి.
ముస్లిములు చెయ్యల్సింది- తమకు వచ్చిన భాషలో ఖురాన్ ను ప్రవక్త ముహమ్మద్ (స) బోధలను చదివి అర్థం చేసుకుని ఇస్లాంను ఎవరికి వారు వ్యక్తిగతంగా స్టడీ చేస్తూ ఉండాలి.
