తన ఆలోచనలను మార్చేసిన 9/11 సంఘటన

పరమతం పై ధ్వేషాన్ని రగిలించాలంటే స్వమతానికి చెందిన కట్టడాన్నో లేక దేన్నో దాన్ని కూల్చేయ్యాటమో, కాల్చేయ్యాటమో లేక భావోద్రేకాలను రెచ్చగొట్టే కొన్ని గాలివార్తలో పుట్టిస్తే చాలు.. ఇది అమెరికా టూ అంతర్వేది వరకూ వర్కవుట్ అయ్యే సక్సెస్ ఫుల్ ఫార్ములా.

సరిగ్గా అలాంటి ప్రయత్నమే అగ్రరాజ్యమైన అమెరికాలో ఓ 19 ఏళ్ల క్రితం జరిగింది. ట్విన్ టవర్స్ కూల్చివేత.. దానికి కారణం ఇస్లామిక్ తీవ్రవాదులంటూ మీడియాలో జోరందుకున్న ప్రచారాలు వెరసి.. చాలా మంది సామాన్యుల్లో సైతం ఇస్లామోఫోబియా పెరగటానికి కారణమయ్యాయి.
ఆ వార్తలు విన్న అనేకమందిలో ఇంగ్లాండ్ కు చెందిన ‘విమోండమ్, నార్ఫ్లోక్’ కి చెందిన ‘అబ్రహాం కిల్లింటన్’ అనే ఓ క్రైస్తవ యువకుడు కూడా ఒకడు. అప్పట్లో మీడియా ప్రభావానికి ఓ కరుడుకట్టిన ఇస్లామోఫోబిక్ గా మారాడు. అంతేకాదు, ఇస్లాం అంతటి ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నప్పుడు కనీసం తన జీవితకాలంలో వీలైనంత మంది ముస్లిములను చంపి తానూ చావాలని నిర్ణయానికొచ్చాడు.

‘అబ్రహాం కిల్లింటన్’ గురించి సంక్షిప్తంగా చెప్పాలంటే- డ్రగ్స్ తీసుకుంటూ, త్రాగుడుకు అలవాటుపడి లైఫ్ ని జాలీగా ఎంజాయ్ చెయ్యటమే జీవితం అనుకుంటూ గడిపేస్తున్న ‘అబ్రహాం కిల్లింటన్’ 9/11 దాడులు జరిగిన నేపథ్యంలో మీడియా ఊకదంపుడుగా ఇస్లాం పట్ల ప్రజల్లో ధ్వేషాన్ని నూరిపోసే పనిలో బిజీగా మునిగి ఉండగా అందరిలానే తానూ ముస్లిములు అంటే టెర్రరిస్టులు అన్న అపార్థాన్నే తలకెక్కించుకున్నాడు.
ఆ తరువాత ఆఫ్గానిస్తాన్ పై అమెరికా దాడులు, అక్కడి టెర్రరిస్ట్ క్యాంపుల్లో ముస్లిం పేర్లతో, వేషాల్లో ఉన్న కొందరిని చూసి ముస్లిములంతా ఇంతే, వారే ప్రపంచం మొత్తం మీద భయంకరమైన దారుణాలు, ఉగ్రవాదం చేస్తుంది! వీరిని అలా తయారు చేసిందే ఇస్లాం అన్న భావనకు లోనై.. మరో ప్రక్క మీడియా ఇస్లాం గురించి చేస్తున్న ప్రతికూల (Negative) ప్రచారం తోడై ముస్లిములపై తీవ్రమైన కక్ష పెంచుకోవటానికి కారణమయ్యింది. అదే తన జీవిత కాలంలో ఎంతమందిని వీలైతే అంతమంది ముస్లిములను చంపటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవటం వైపు నడిపించింది. తన కల సాకారం కావాలంటే ముందు ఆర్మీలో జాయిన్ కావటమే కారెక్టని భావించి, ఆర్మీకి సెలక్షన్స్ కు మూడు సార్లు దరఖాస్తు పెట్టాడు.

కానీ, తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుచునన్నట్టు.. ఓసారి ఆర్మీకి దరఖాస్తు పెట్టటానికి వెళ్లినప్పుడు, అక్కడ రేడియోలో అమెరికన్ ప్రభూత్వం ద్వారా నడుపబడుతున్న ‘టెర్రర్ టాక్ (Terror talk)’ అనే అనే స్టేషన్లో ‘ప్రవక్త ముహమ్మద్ (స)’ గురించి చెప్పబడటం విన్నాడు. అందులో “ప్రపంచంలో చెడును అనుసరించే వారంతా ఆయననే అనుసరిస్తుంటారు” అన్న మాట తన చెవిలో పడిప్పుడు.. అటువంటప్పుడు ఇంతకూ అసలు ముస్లిముల విశ్వాసం ఏమిటి? అన్న ప్రశ్న అతనిలో బయలుదేరింది.

ఆ సమయంలో ఇతర మతాల విశ్వాసాల గురించి చదువుతున్న సమయంలో ఇస్లాం గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలిగి.. ఇంటర్నెట్ లో ఇస్లాం ప్రసంగాలు వింటూ ఉండగా ‘బాబా అలీ’ అనే ఎవరో ఓ ముస్లిం వక్త ప్రసంగం విని.. ఇతను ‘కాఫీర్లను చంపండి’ అంటూ ఉగ్రవాద ప్రసంగాలు చెయ్యక.. ఇస్లాం ‘శాంతి ధర్మం’ అంటూ చెబుతాదేంటీ? ఇతనెవరో పాపం వెనుకబడి ఉన్నాడనుకుని.. ఓ సారి ఖురాన్ చదివితే పోలా.. ఇస్లాం గురించి అసలు చిక్కు ముడి విడిపోతుంది కదా అనుకున్నాడు.
ఓ రోజు ఖురాన్ చేతిలో పట్టుకున్నప్పుడు కూడా ఓ “టెర్రరిస్ట్ హ్యాండ్ బుక్” నా చేతిలో ఉందనే మనసులో అనుకున్నాడు. ఆ తరువాత ఓ రోజు మొత్తం మసీదులో కూర్చొని ఖురాన్ చదవటానికి టైమ్ కేటాయించుకున్నాడు. ఒకొక్క అధ్యాయం చదువుతూ పోయే కోద్దీ అతనిలో ఆశక్తి పెరుగుతూ పోయింది.. ఇస్లాం పట్ల అతనికున్న అపార్థాల మబ్బులన్నీ ఒకొక్కటిగా తొలగిపోవటం మొదలయ్యంది. ఖురాన్ అతని ఆలోచనకు పదును పెట్టింది. ఖురాన్ అతనికి అసలు ఇస్లాంను పరిచయం చేస్తూ పోయింది. ఖురాన్ ఇస్తున్న శాంతి సందేశానికి మీడియా ప్రచారానికీ పొంతన లేదన్న సంగతి అతనికి చివరకు సుస్పష్టమయ్యింది.

ప్రపంచంలో కొందరు ముస్లిం పేర్లు తగిలించుకుని చేస్తున్న ఉగ్రవాదానికి, ఖురాన్ ఇస్తున్న సందేశానికి అసలు ఏ మాత్రం పొంతనలేదని తెలుసుకోవటమే కాదు, ఖురాన్ వాస్తవానికి ఉగ్రవాదాన్ని ఖండిస్తుంది అన్న విషయాన్ని తెలుసుకున్నాడు. చివరకు ముస్లిములను చంపాలని కంకణం కట్టుకుని బయలుదేరిన ‘అబ్రహాం కిల్లింటన్’ ఇస్లాం లోతైన అవగాహన చేయటంలో సమయం తీశాడు.. చివరకు ఇస్లాం విశాల దృక్పథాల అవగాహన పెరిగాక ఇస్లాం స్వీకరించి ముస్లింగా మారిపోయాడు.

చాలా సంవత్సరాల తరువాత అమెరికాలో ప్రముఖ యూనివర్శిటీలకు చెందిన వేల కొద్దీ సివిల్ ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్లూ కలిసి అసలు కేవలం విమానాలు ఢీ కొట్టినంత మాత్రానా ఎంతో ధృమైన బిల్డింగులు నేల కూలటం అసాధ్యం అని ఇది కేవలం అమెరికా కుట్ర అన్న నిజాన్ని బయటపెట్టినప్పటికే.. ఆఫ్ఘనిస్తాన్ పై జరిగిన అమెరికా సైనిక దాడుల్లో ఎందరివో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అమెరికన్ మీడియా పెంచి పోషించిన ఇస్లామోఫోబియాతో ‘అబ్రహాం కిల్లింటన్’ లాంటి ఎందరి మనసుల్లోనో ఇస్లాం పట్ల విషబీజాలు నాటుకుపోయాయి.

చివరిగా…

ధార్మిక గ్రంథాలు అధ్యయనం చేయకుండా ఏ మతావర్గాన్నైనా విమర్శించటం డ్రైవింగ్ నేర్చుకోకుండా కారునడిపి దేన్నోదాన్ని గుద్దేసి.. ఆ కార్ల కంపెనీని విమర్శించటం లాంటిదే.

ప్రపంచంలో ఏ వార్త వినటం వలన అయినా ఇస్లామోఫోబియా (ఇస్లాం పట్ల ధ్వేషం) మీలో కలిగితే “ఒకటి మీరు ఖురాన్ చదవండి లేదా కనీసం ఖురాన్ అవగాహన ఉన్న వ్యక్తితో అయినా మాట్లాడండి.. తప్పితే మీడియానో, ఇంటర్నెట్ నో ఆశ్రయించకండి” అంటూ అబ్రహాం కిల్లింగ్టన్ చెబుతున్న మాటలను ఈ క్రింది లింక్ ద్వారా మీరు వినవచ్చు.

https://www.youtube.com/watch?v=wQ0ZD7iYLI0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *