ఒకింత ఆశ్చర్యంగానూ వింతగానూ ఉంది కదూ ఎన్నో మసీదులు క్వారంటైన్ సెంటర్లుగా మారిపోయాయి అన్నది చదువుతూ ఉంటే! అలా ఆశ్చర్యంగా అనిపించటంలో తప్పులేదు ఎందుకంటే.. మొన్నటి వరకు కరోనా వ్యాప్తికి కారణమే ముస్లిములన్న చందంగా కొందరు ఇస్లామోఫోబియా పైత్యం తలకెక్కిన వేర్పాటువాదుల మతోన్మాద ప్రచారం ఆ రీతిలో సాగింది కాబట్టి.
ఢిల్లీ నిజాముద్దీన్ మార్కజ్ నుండే కరోనా అసలు ఇండియాలో వ్యాపించిందన్న ధోరణిలో ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా కొందరు మతోన్మాదులు తయారు చేసిన గాసిప్పులను గాలి వార్తలను బ్రేకింగ్ న్యూసుల పేరుతో ప్రసారం చేయటంలో చూపే అత్యుత్సాహం ప్రధాన స్రవంతి మీడియా ఇలాంటి అనుకూల (Positive) వార్తలను ప్రచారం చెయ్యటానికి పెద్దగా ఉత్సాహం చూపదు.
కరోనా మహమ్మారి సమాజంలో విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో స్వయంగా తమ ఆరాధనాలయాలైన మసీదులను, మదర్శాలను ‘క్వారంటైన్ సెంటర్లు’గా మార్చి దేశ ప్రజల సేవ చెయ్యటంలో నిమగ్నమైంది ముస్లిం సమాజం. అలాంటి వాటిలో కొన్ని మసీదులను గమనిద్ధాం.
1. మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ లోని ‘జామా మసీదు’లోని మదర్సా ను 100 మందికి సరిపడా పడకలు సిద్ధం చేసి క్వారంటైన్ సెంటర్ గా మార్చి ఎందరో కోవిడ్ పేషంట్ల సేవకు వినియోగించటం జరుగుతుంది.
2. మహారాష్ట్ర, థానే లోని భివండీలో జమాత్ ఇస్లామీ హింద్ యూనిట్ ద్వారా స్థానిక మసీదును క్వారంటైన్ సెంటర్ గా మార్చటం జరిగింది. అలాగే ఈస్ట్ భివండీ లోని శాంతినగర్ ఏరియాలో ఉన్న ‘మక్కా మసీదు’ను కూడా క్వారంటైన్ సెంటర్ గా మార్చి ఎందరో కోవిడ్ పేషంట్ల సేవకు వినియోగించటం జరుగుతుంది.
3. పూణే లోని ‘ఆజం క్యాంపస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్’ లో ఉన్న అతిపెద్ద మసీదును క్వారంటైన్ సెంటర్ గా మార్చి దాదాపు 80 పడకలు సిద్ధం చేసి ఎందరో కోవిడ్ పేషంట్ల సేవకు వినియోగించటం జరుగుతుంది.
4. గుజరాత్, వడోదరా లో పానీగేట్ ప్రాంతంలో ఉన్న మదర్సా తో పాటు, తాండల్జా ప్రాంతంలో ఉన్న ‘దారుల్ ఉలూమ్’ మదర్సా ను కూడా క్వారంటైన్ సెంటర్ గా మార్చి దాదాపు 200 పడకలు సిద్ధం చేసి ఎందరో కోవిడ్ పేషంట్ల సేవకు వినియోగించటం జరుగుతుంది.
5. వార్తల్లో నిలిచిన ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ అందరికీ తెలిసిందే. కానీ ప్రత్యక్షంగా మర్కజ్ కాంప్లెక్స్ మొత్తం క్వారంటైన్ సెంటర్ గా మార్చబడి ఎందరో కోవిడ్ పేషంట్ల సేవకు వినియోగించటం జరిగిందన్న విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం.
6. కలకత్తా లోని బెంగాలీ బజార్ మసీదు ప్రాంగణాన్ని ఆ మసీదు మూడవ అంతస్తును సైతం క్వారంటైన్ సెంటర్ గా మార్చి ఎందరో కోవిడ్ పేషంట్ల సేవకు వినియోగించటం జరుగుతుంది.
అలాగే భారతదేశంలోనే కాక…
మయన్మార్ లోని ఎన్నో మసీదులను క్వారంటైన్ సెంటర్లుగా మార్చి ఎందరో కోవిడ్ పేషంట్ల సేవకు వినియోగించటం జరుగుతుంది.
UK, బోల్టన్ లో ఉన్న ప్రఖ్యాత మస్జిదె గౌసియా సైతం క్వారంటైన్ సెంటర్ గా మార్చి ఎందరో కోవిడ్ పేషంట్ల సేవకు వినియోగించటం జరుగుతుంది. కానీ చిత్రమేమిటంటే.. హిందూ-ముస్లిముల మధ్య ఉన్న సోదరభావాన్ని దెబ్బతీయటానికి కొందరు వేర్పాటువాదుల ద్వారా తయారు చెయ్యబడ్డ ఫేక్ వీడియోల గురించి, అబద్ధ ప్రచారాల గురించి మీడియాలో చర్చలమీద చర్చలు జరిగిపోతుంటాయి.. కానీ పై సమాచారం తాలూకు వార్తలపై ఎక్కడా ఒక్క చర్చ కనపడదు. బహుశా ఇలాంటి అనుకూల వార్తలపై చర్చలు చేయటం వలన, ప్రసారం చెయ్యటం వలన ఎక్కడ హిందూ-ముస్లిముల మధ్య సోదరభావం ఇంకా గట్టి పడిపోతుందో అన్న భయం కాబోలు
