‘నేటి గోవధ నిషేధం రాజకీయ నినాదమే తప్ప వేద నినాదం కాద’ని దాశరధి రంగాచార్య గారన్నట్టు ప్రత్యేకంగా బక్రీద్ పండుగకు ముందు గోవధ అంశం తెరమీదకు వస్తూ ఉంటుంది. దానికి ప్రభావితమైన కొందరు ముస్లిమేతరులు కాస్త అమాయకంగా ‘గోవధ’ ఇతరుల మనోభావాలను దెబ్బతీయటం కాదా? అని ప్రశ్నిస్తూ ఉంటారు.
నిజానికి ముస్లిం సమాజంలో అధికశాతం మంది బక్రీద్ పండుగ నాడు మేకలు, గొర్రెలనే బలివ్వటానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇస్లాంలో కచ్చితంగా గోవునే బలి ఇవ్వాలనీ లేదు ప్రవక్త ముహమ్మద్ (స) జీవిత కాలంలో ఎక్కడా గోవులను బలి ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. కాబట్టి ఒకవేళ బక్రీద్ పండుగ నాడు గోవును బలివ్వటం మనోభావాలు దెబ్బతినే అంశమే అయితే కచ్చితంగా ఏ విధంగానైనా ఇతరుల మనోభావాలు దేబ్బతీసే కించిత్తు అవకాశం ఇస్లాం ఎక్కడా ఇవ్వటం లేదన్నది అందరూ గ్రహించాల్సిన విషయం. కాబట్టి చట్టపరమైన ఆదేశాలను గౌరవించటం ప్రతీ పౌరుని విధి కాబట్టి బక్రీద్ నాడు ఇతర మేసే చతుష్పాది జంతువులను బలిదానాలు ఇచ్చినా ఏ ఇబ్బందీ లేదు
అయినప్పటికీ ప్రపంచంలో గోమాంస ఎగుమతిలో మొట్టమొదటి స్థానంలో ఉన్న భారతదేశంలో.. కొందరు పనికట్టుకుని కేవలం ముస్లిములు మాత్రమే గోమాంస భక్షకులన్న రంగు పూసి రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో.. ముఖ్యంగా తెలుసుకోవలసింది భారతదేశంలో గోమాంసం తినే వారిలో ఒకరు కొందరు ముస్లిములున్నారు తప్ప ఒక్క ముస్లిములే గోమాంసం తినటం లేదన్నది.
మరీ ముఖ్యంగా భారతదేశంలో 95% బీఫ్ ట్రేడర్స్ (Beef Traders) అనగా ‘గో మాంస వ్యాపారస్తులు’ ఎవరో కాదు హిందువులే! ఇది నేను చెబుతున్నది కాదు, ఢిల్లీ హై కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చెబుతుంది! దానికి సంబంధించిన లింకును ఈ క్రింది చూడగలరు.
https://timesofindia.indiatimes.com/…/arti…/49866811.cms
భారత దేశంలో ఉన్న అతిపెద్ద ప్రపంచ ప్రఖ్యాత గో మాంస ఎగుమతి కంపెనీలు 6 ఉంటే అందులో 4 హిందు బ్రాహ్మిణ్ లకు చెందినవే కావటం గమనార్హం! పైగా అవికూడా పైకి ముస్లిం పేర్లు పెట్టుకుని గోమాంసం ఎగుమతి చెయ్యటం మరింత గమనార్హం. దానికి సంబంధించిన లింకును ఈ క్రింది చూడగలరు.
https://sabrangindia.in/…/who-making-millions-india-out…
ముఖ్యంగా “ఇందిరా కృష్ణ మూర్తి నూయి” తమిళ్ బ్రాహ్మిణ్ కుటుంబానికి చెందిన ఈమె “మెటడోర్” సంస్థ ద్వారా అమెరికాలో విస్తారంగా గోమాంసం ఎగుమతి చేస్తుంది. దానికి సంబంధించిన లింకును ఈ క్రింది చూడగలరు.
http://muslimmirror.com/…/indira-nooyi-a-tamil-brahmin…/
అసలు ఖుర్బానీ విషయంలో ఖురాన్ చెబుతున్నదేమిటంటే…
“వాటి (జంతువుల) మాంసమూ అల్లాహ్ కు చేరదు, వాటి రక్తమూ చేరదు” – 22:37
ఇక్కడ అసలు గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఖుర్బానీ (బలి) కి ఫలానా జంతువన్న ప్రాముఖ్యతా లేదు.. ఆయా జంతువుల రక్తమాంసాలు కూడా దైవానికి అవసరం లేదు. ఇక్కడ దేవుడు కోరుకుంటుంది ఆయా జంతువుల రక్తమాంసాలు కావు కానీ చేరేవి కేవలం భయభక్తులు మాత్రమే!
వివరంగా చెప్పాలంటే.. ప్రవక్త ఇబ్రాహీం (అలై) దైవ మార్గంలో చేసిన బలికి గుర్తు (Symbol) గా దైవ మార్గంలో ఒక గొర్రెనో, మేకనో, ఆవు లేక ఒంటెనో బలి ఇవ్వాల్సిందిగా నిర్దేశించటం జరిగింది. దానికి కారణం- ఆ బలి ఇవ్వగా వచ్చిన మాంసంలో మూడు భాగాలు చేసి ఒక భాగం బీదలకు పంచిమరొక భాగం బంధువులు, దగ్గరవారు, ఇరుగుపొరుగువారికి వారికి దానం చేసి మిగిలిన ఒక భాగం స్వయంగా తినటం కోసం అన్న ఉద్దేశంతో మాత్రమే! ఈ ప్రక్రియలో దైవ ప్రసన్నత లభించాలన్న భయభక్తులతో కూడిన సంకల్పమే తప్ప వేరే ఏ ఉద్దేశమూ ఉండకూడదు కూడా. ఆ భయభక్తులే దైవానికి చేరేవి.
సంక్షిప్తంగా పై వాస్తవాలను ముస్లిములు మాత్రమే గోమాంస భక్షకులన్న కొందరి ప్రచారాలకు ప్రభావితమై ‘గోవధ’ ద్వారా ఇతరుల మనోభావాలను దెబ్బతీయటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించే కొందరు ముస్లిమేతర సోదరులు అవగాహన చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది
‘గోవధ’ ఇతర మతస్తుల మనోభావాలను దెబ్బతీయటం కాదా?
