మతాభిమానం ఉండటంలో తప్పులేదు కానీ ఇతర మతాల పట్ల ధ్వేషాన్ని వెళ్లగక్కే మతమౌఢ్యం లేక మతోన్మాదం ఉండకూడదు. అలాంటి కొందరు మతోన్మాదులు సామాన్య హిందూ-ముస్లిం ప్రజానీకానికి మధ్య ధ్వేషాన్ని రెచ్చగొట్టటానికి పదే పదే చెప్పే విషయం- మధ్య యుగాలనాటి ముస్లిం పాలకులు హిందూ దేవాలయాలు పడగొట్టేసి బలవంతంగా హింసతో ఇక్కడి హిందువులను ముస్లిములుగా మార్చేశారు” అన్నది
నిజంగా ఇస్లాం కత్తితో వ్యాపించిందా? అన్న టాపిక్ పై వాదోపవాదాలు చేసుకుంటూ టైమ్ వెస్ట్ చేసుకునే కంటే అసలు ఇస్లాంను బలవంతంగా అంగీకరింపజేయటం సాధ్యమేనా? అన్న ఒక్క ప్రశ్నకు సమాధానం తెలుసుకోగలిగితే చాలు కొందరు పనికట్టుకుని “ఇస్లాం బలవంతంగా వ్యాపించింది లేక కత్తితో వ్యాపించింది” అని లేవనెత్తుతున్న వాదన ఎంతవరకు సమంజసమైనదో తేలిపోతుంది.
***
“ఇస్లాం కత్తి ద్వారా వ్యాపించింది, ముస్లిం పాలకులు హిందూ దేవాలయాలు పడగొట్టేసి బలవంతంగా హింసతో ఇక్కడి హిందువులను ముస్లిములుగా మార్చేశారు” అంటూ మధ్యయుగాల నాటి చరిత్రలను వక్రీకరించి చెబుతూ హిందూ-ముస్లిముల మధ్య ఐక్యతను బీటలు వార్చటానికి నిరంతరం కష్టపడే మతోన్మాద వేర్పాటువాదులు… తెలుసుకోవలసింది-
ఇస్లాంను బలవంతంగా అంగీకరింపజేయటం ఎలా సాధ్యపడుతుంది? అన్నది. అంతకంటే ముందు… ఒక వ్యక్తి ఇస్లాంను అంగీకరించి, ముస్లింగా మారాలంటే అతను చెయ్యల్సింది ఏమిటో తెలుసుకోవాల్సి ఉంది.
ఇస్లాంను అంగీకరించటం అంటే ఏమిటి?
ఇస్లాంను అంగీకరించటం అంటే “లాయిలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్రసూలిల్లాహ్” (ఒక్క సృష్టికర్త అయిన అల్లాహ్ తప్ప ఏ దేవుడూ లేడు, ముహమ్మద్ ఆయన దాసుడు) అన్న నాలుగు అరబీ పదాలు నోటితో వల్లించేసినంత మాత్రానా లేక ఒకరితో బలవంతంగా చెప్పించేసినంత మాత్రానా ఒక వ్యక్తి ముస్లింగా మారిపోతాడా? ఒకవేళ మారిపోతాడని ఎవరైనా చెబితే అతను ముద్ద పప్పులో కాలేసినట్టే!
అసలు ఇస్లాంను అంగీకరించటం అంటే…?
1. “లాయిలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్రసూలిల్లాహ్” (ఒక్క సృష్టికర్త తప్ప ఏ దేవుడూ లేదు ముహమ్మద్ ఆయన దాసుడు) అని అంగీకరించి, సాక్ష్యం ఇవ్వటం
2. ఆ సృష్టికర్త అయిన దైవాన్ని (అల్లాహ్ ను) ప్రతిరోజూ ఐదు పూటలా నిష్టతో ప్రార్ధన చెయ్యటం
3. ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ ప్రసన్నత కొరకు తమకు ఉన్న ఆస్తిపాస్తులపై, డబ్బు, బంగారంపై కొంత శాతం తీసి ప్రతీ సంవత్సరం దానం (జకాత్) ఇవ్వటం
4. ఆ సృష్టికర్త అయిన దేవుని ప్రసన్నత కొరకు ప్రతీ సంవత్సరం రమజాన్ నెల అంతా నిష్టతో ఉపవాసాలు ఉండటం
5. స్తోమత ఉన్నోల్లు జీవితకాలంలో హజ్ యాత్ర చెయ్యటం
పై 5 క్రతువులను ఇస్లాం “మూల స్థంబాలు (Pillars of Islam)” అంటారు. అంటే ఒక వ్యక్తి ముస్లిం అవ్వాలన్న అర్హత పొందాలి అంటే… పై ఐదు ఇస్లామియా ముల స్థంబాలనూ అతను అంగీకరించి వాటి ప్రకారం ఆచరించాలి.
ఇప్పుడు మనం అసలు పాయింట్ కి వద్దాం. కాస్సేపు కొందరు వాదిస్తున్నట్టు ఇస్లాంను మధ్యయుగాల్లో కొందరు ముస్లిం పాలకులు గుళ్లు, దేవాలయాలు పగలగొట్టేసి… బలవంతంగా ప్రజలను ఇస్లాంలోకి మార్చేశారే అనుకుందాం. ఎలా మార్చేసి ఉంటారు? ఎందుకంటే పై ఐదు ఇస్లామియా మూల స్థంబాలలో “లాయిలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్రసూలిల్లాహ్” అన్న ఒక్క సాక్ష్యం ఇచ్చే తంతును ప్రక్కన పెడితే మిగతా నాలుగూ “#వ్యక్తిగత_ఆచరణ (Practice)” కు సంబంధించినవి.
బలవంతంగా ప్రజలను ఇస్లాంలోకి మార్చాలనుకున్నప్పుడు… పైన ప్రస్తావించిన ఐదు ఇస్లామియా క్రతువులలో ప్రజలకు కత్తి చూపించి భయపెట్టి ఎన్నింటిని వారి ద్వారా ఆచరించేలా చెయ్యటం సాధ్యపడుతుంది?
మహాలేదంటే గొంతుపై కత్తి పెట్టి ప్రజల నోటితో “లాయిలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్రసూలిల్లాహ్” అని కొన్ని అరబ్బీ పదాలు చెప్పించటం సాధ్యపడుతుందేమో… కానీ అలా చెప్పించేసినంత మాత్రానా వారంతా ఆటోమేట్టిగ్గా ఒక్కసారిగా ముస్లిములుగా మారిపోరు కదా!
అయినప్పటికీ ఎవరో కత్తితో బెదిరించి ప్రజల ద్వారా పై అరబ్బీ పదాలు పలికించేశారే అనుకుందాం. కత్తి చూపి భయపెట్టి పై అరబ్బీ పదాలు నోటితో బలవంతంగా పలికించేసినోల్లు వెళ్లిపోయిన తరువాత ప్రజలు వ్యక్తిగతంగా తాము విడిచిపెట్టిన పూర్వపు ఇష్టదైవాలనే ఆరాధించుకుంటారే తప్ప వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఎక్కడ ఏ సందర్భంలో ఉన్నా అల్లాహ్ పట్ల శ్రద్ధాభక్తులు కలిగి ఐదు పుట్లా నమాజ్ ఎందుకు చదువుతారు?
అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ప్రతీ సంవత్సరం రంజాన్ నెలంతా నిష్ఠతో ఉపవాసాలు ఎందుకు ఉంటారు?
అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి తమ సంపదపై కొంత శాతాన్ని విధిగా తీసి ఎందుకు దానమిస్తారు? హజ్ యాత్ర ఎందుకు చేస్తారు?
ఎందుకంటే… ఎవరన్నా ప్రజల మెడ మీద కత్తి పెట్టి జీవితాంతం పై ఇస్లామియా క్రతువులనీ దగ్గర ఉండి ఆచరిపజేయలేరు కదా? అలా చేయించాలనుకుంటే ఎంతమంది ద్వారా ఎన్నాళ్లు చేయించటం సాధ్యపడుతుంది?
ఎందుకంటే ఇస్లాంను స్వీకరించి ముస్లింగా మారటం అంటే- నోటితో కేవలం లాయిలాహ ఇల్లల్లాహ్ అని ఓ నాలుగు అరబీ పదాలు వల్లించెయ్యటం కాదు. మనసా, వాచా, కర్మేణా దేవుడు ఒక్కడు అని నమ్ముతూ… ఆయన కోసం భయభక్తులతో ఐదు పుట్లా నమాజ్ చెయ్యటం, ఉపవాసాలు ఉండటం, దానధర్మాలు చెయ్యటం వగైరా ఎన్నో క్రతువులను వ్యక్తిగత శ్రద్ధతో నిర్వర్తించటం.
ఇవన్నీ ఒక వ్యక్తి విశ్వాస పరంగా ఖురాన్ ను చదివి, ప్రవక్త ముహమ్మద్ (స) సందేశాన్ని అర్థం చేసుకుని భయభక్తులతో వ్యక్తిగత అంగీకారంతో, శ్రద్ధతో, నిష్ఠతో ఆచరించే పనులు. తప్పితే ఒకరు మెడపై కత్తిపెట్టో… బలవంత పెట్టో చేయించే పనులు కావు.
పోనీ, అలా మెడ మీద కత్తి పెట్టి బెదిరించి నోటితో లాయిలాహ ఇల్లల్లాహ్ అని ఓ నాలుగు అరబీ పదాలు పలికించేసి ప్రజలను నామమాత్ర ముస్లిములుగా మార్చేశారే అనుకుందాం. అలా బలవంతంగా ముస్లిములుగా మారినోల్లు తమ సంతానాన్ని ముస్లిములుగా ఎందుకు పెంచుతారు? తమపై బలవంతంగా రుద్దబడిన మతాన్ని తమ తరువాతి తరాలపై ఎందుకు రుద్దుతారు? వారిని తాము విడిచిపెట్టిన పూర్వపు మత విశ్వాసాలతోనే పెంచుతారు.
హింస ద్వారా కత్తితో బలవంతంగా ఇస్లాం ప్రజల ద్వారా అంగీకరింపజేయబడిందన్నదే నిజమైతే… గత 1400 వందల సంవత్సరాలుగా ప్రపంచంలోనే అతిపెద్ద ధర్మంగా ఇస్లాం బిలియన్ల కొద్దీ ప్రజల ద్వారా తరతరాలుగా స్వీకరించబడుతూ రావటం అసలు సాధ్యమేనా? ఈ లాజిక్ ప్రకారం చూసినా ఇస్లాం ఎప్పుడో కనుమరుగైపోయి ఉండాలి.
పై పాయింట్లపై ఏ మాత్రం కొంచెం మెదడు ఉండి ఆలోచన చేయగలిగే సామర్థ్యం ఉన్నా చాలు ఇస్లాం కత్తి ద్వారా వ్యాపించింది లేక ఇక్కడి హిందువులను బలవంతంగా ముస్లిములుగా మార్చేశారు అన్నది ఎంత మూర్ఖమైన వాదనో ఇట్టే తేటతెల్లమైపోతుంది.
ఇస్లాంను బలవంతంగా అంగీకరింపజేయటం సాధ్యమేనా?
