పౌల్ పోగ్బా – ఇస్లాం ఎందుకు స్వీకరించాడు?

పౌల్ పోగ్బా – ప్రఖ్యాత ‘మాంచెస్టర్ యునైటెడ్’ ఫుట్ బాల్ ప్లేయర్ ఇస్లాం పట్ల ఎలా ఆకర్షితుడయ్యాడు? అన్నది ఇక్కడ ప్రత్యేకంగా షేర్ చేయటానికి కారణం…

ఇస్లాం హింస ద్వారా వ్యాపించింది, ఇస్లాం ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందన్నది ఇస్లాం అవగాహన లేని మరియు గాసిప్పుల్లో దొరికే సమాచారం ఆధారంగా చేసుకుని మాట్లాడేవారి వాదన. ఇక ఖురాన్, ప్రవక్త ముహమ్మద్ (స) చరిత్రను నిస్పక్షపాతంగా పరిశీలన చేసేవారు అలాంటి తీర్మానాలు చేయటానికి సాహసించలేరన్నది నిర్వివాదం

సరే, ప్రఖ్యాత ఫుట్ బాల్ ప్లేయర్ అయిన పౌల్ పోగ్బా ఇస్లాంను స్వీకరించటానికి కారణం తన స్నేహితుల్లో చాలా మంది ఇస్లాం స్వీకరించటం, తరువాత వారి వ్యాక్తిత్వాలలో మార్పును గమనించాక వ్యక్తిగతంగా తాను కూడా ఇస్లాంను లోతుగా పరిశీలించటం మొదలు పెట్టాడు. చివరకు ఇస్లాంలోని విశాలమైన దృక్పథాలు… తద్వారా లభించే మానసిక ప్రశాంతత… అవి వ్యక్తిత్వ నిర్మాణం విషయంలో చూపే మహత్తర ప్రభావాన్ని గుర్తించాక ఇస్లాం పట్ల ఆకర్షితుడయ్యాడు.

లైఫ్ టైమ్ పోడ్ కాస్ట్ ఇంటర్వ్యూ లో పౌల్ పోగ్బా తన పరిశీలనలో ఇస్లాం గురించి చెప్పింది ఏమిటంటే…

“చాలామంది పైపైన చూస్తున్న స్వరూపం ఇస్లాం కాదు, మీడియాలో టెర్రరిజం అంటూ ఎదైతే చెప్పబడుతుందో అది కూడా ఇస్లాం కాదు. అదొక అందమైన ధర్మం. ఇస్లాం వాస్తవ జీవిత సత్యాలను తెలియజేసి, వ్యక్తిగత ప్రశాంతతను కలగజేయ్యటమే కాక నాలో గొప్ప మార్పును తెచ్చింది మరియు నన్ను ఉత్తమ వ్యక్తిగా మార్చింది. ఒక్క మాటలో ఇస్లాం అంటే – తోటి మానవుల పట్ల ఉన్నత గౌరవాన్ని నేర్పే ధర్మం”.

Link:

https://nilefm.com/…/paul-pogba-reveals-how-why-he…

సరే, పౌల్ పోగ్బా లాంటి ఎందరో ఇస్లాంను వ్యక్తిగతంగా పరిశీలించి ఇస్లాం వాస్తవికత తెలుసుకుంటున్నారు వారి గొడవ ప్రక్కన పెడితే… మరి ఇస్లాం వాస్తవికత ఏమిటో తెలుసుకోనివారు… ఇస్లాం పట్ల అనేక అపార్థాలు కలిగి ఉన్నవారు సమాజంలో అనేకమంది ఉన్నారు కదా

సమాజంలో అనేక మంది ఇస్లాం అంటే అదేదో ప్రవక్త ముహమ్మద్ పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం స్థాపించిన కొత్త ధర్మమని, ఇస్లాం ముస్లిముల మతమని… వగైరా అనేక అపార్థాలు కలిగి ఉండటమే కాక… సమాజంలో ఈనాటికీ ట్రిపుల్ తలాక్, బురఖా, జిహాద్ వగైరా చిన్న చిన్న అంశాల పట్ల సైతం ముస్లిమేతరుల్లో అనేక అపార్థాలు నాటుకుపోయి ఉన్నాయంటే… తప్పు ఎవరిది? వారిదా? వారికి అర్థమయ్యే విధంగా… వారికి అర్థమయ్యే భాషలో ధర్మావగాహన కలిగించలేని ముస్లిం సమాజానిదా?

ఇస్లాం అంటే అర్థం శాంతి. అయినప్పటికీ ఇస్లాం ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంది… ఇస్లాం హింస ద్వారా వ్యాపించింది అని ఇస్లామోఫోబియాను పెంచి పోషించే మీడియా ప్రచారాన్ని నిజమని భావించి అపార్థం చేసుకున్నవారు… విమర్శిస్తున్నవారు సమాజంలో ఎందరో ఉన్నారు. అలాంటప్పుడు వారిలో ఉన్న అపార్థాలను దూరం చేయవలసిన బాధ్యత ఎవరిది?

విమర్శలకు ప్రతివిమర్శలు చేస్తూ కాలం వెళ్లగొట్టటం సరైన పద్ధతి అవుతుందా? స్వయంగా ఇస్లాంను విశాల దృష్టితో అవగాహన చేసుకుని… ఇస్లాం విమర్శకులకు అవగాహన పరచటం సరైన పద్ధతి అవుతుందా?

ఇస్లాం అంటే ప్రాచీన ధర్మమమని, సకల ఋషులు, ప్రవక్తలు బోధించింది “ఏకేశ్వరోపాసన ఆధారిత ధర్మమైన ఇస్లామే” అని, తప్పితే ఇస్లాం క్రొత్త ధర్మం కాదని… హిందూ శాస్త్రాల్లో సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, అక్షరపరబ్రహ్మగా… బైబిల్లో యెహోగా పరిచయమైన దేవుడే ఖురాన్ లో అరబిక్ భాషలో “అల్లాహ్” గా పరిచయమయ్యాడని… ఆ “సృష్టికర్త అయిన దేవునికి విధేయత” చూపటాన్నే ‘ఇస్లాం’ అంటారన్న వాస్తవాలను అవగాహన పరచి, ప్రజలలో ఇస్లాం పట్ల అపార్థాలు తొలగించాల్సిన బాధ్యత ఎవరిది?

ఈ విషయంలో మీ ఉద్దేశం ఏమిటో… చెయ్యాల్సిన కార్యాచరణ ప్రాణాళిక ఏమిటో? కామెంట్ల రూపంలో తెలియజేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *