‘జకాత్’ ధనాన్ని ICU బెడ్స్ కోసం దానమిచ్చిన ముస్లిములు

ఓ ప్రక్క మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇచల్ కరంజి అనే ఓ చిన్న గ్రామంలోని ముస్లిములు రంజాన్ నెలలో ముస్లిములు బీదసాదలకు ఇచ్చే ‘జకాత్’ ధనం దాదాపు 36 లక్షల రూపాయలను ఆ గ్రామంలోని తోటి ముస్లిముల నుండి సేకరించి, పది ICU బెడ్స్ ను కొని ‘ఇందిరా గాంధీ మెమోరియల్ సివిల్ హాస్పిటల్’ కు ఇవ్వటం జరిగింది.

ఈ హాస్పిటల్లో ICU సెక్షన్ ను ఉద్దవ్ ధాక్రే మొన్న సోమవారం రంజాన్ పండుగ రోజు ప్రారంభోత్సవం చెయ్యటం జరిగింది.
‘ఈదుల్ ఫిత్ర్ (దానాల పండుగ)’ ను అసలు ఏ విధంగా జరుపుకోవాలి అన్నదానికి ముస్లిం సమాజం ఒక గొప్ప ఉదాహరణ అంటూ ఉద్దవ్ ధాక్రే కొనియాడారు

ఇలాంటి విషయాలు ప్రధాన స్రవంతి మీడియాలో పెద్దగా కనపడవు. అదే ఇస్లామోఫోబియా తలకెక్కిన కొందరు కొన్ని పొంతన లేని వీడియో క్లిప్పులు ఎత్తుకొచ్చి వాటికి మార్ఫింగులు చేసి ‘కరోనా వ్యాప్తి చేస్తున్న ముస్లిములు’ అంటూ హెడ్డింగులు పెట్టి, ముస్లిం సమాజంపై తమకున్న ధ్వేషాన్ని వెళ్లగక్కితే అలాంటి పనికి మాలిన వార్తలు మటుకు మొత్తం మీడియా/సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడతాయి

‘జకాత్’ అన్నది ఇస్లాంలో ఆర్థిక స్థోమత ఉన్నవారు సంవత్సరానికి ఒకసారి విధిగా తమకు ఉన్న ఆస్తిపాస్తులపై కొంత శాతం ధనాన్ని తీసి బీదసాదలకు, అగత్యపరులకు ఇచ్చే దానం.

Link

https://m.timesofindia.com/…/articleshow/76041648.cms…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *