ఉపవాస లక్ష్యం- నైతిక ప్రవర్తన అలవర్చుకోవటమే

మనిషి భౌతికంగా ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ నైతికంగా అభివృద్ధి చెందనప్పుడు అతని జీవితంలో శాంతి, సాఫల్యాలు లభించవు. ధార్మిక గ్రంధాల అవతరణ లక్ష్యం మనిషిని నైతికంగా అభివృద్ధి పరచి అతని భౌతిక జీవితాన్ని, పరలోక జీవితాన్ని సాఫల్యపరచటం కొరకే. స్వయంగా సృష్టికర్త అయిన దేవుడు ప్రేమించే ఈ క్రింది ఏడు గుణాలను అలవర్చుకోవటం ద్వారా మనిషిలో ఉత్తమ నైతిక విలువలు పెంపొందించబడతాయి. అలాంటి నైతిక విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని ఆచణాత్మకంగా నిర్మించుకోవటానికే ఉపవాసాలు విధించటం జరిగింది.

1. పశ్చాత్తాపం.
“నిశ్చయంగా దేవుడు పశ్చాత్తాపం పడే వారిని ప్రేమిస్తాడు” – ఖుర్ఆన్ 2 : 222

2. పరిశుభ్రత
“దేవుడు పారిశుద్ధ్యాన్ని అవలంబించే వారిని ప్రేమిస్తాడు” – ఖుర్ఆన్ 2 : 222

3. భయభక్తులు.
“నిశ్చయంగా దేవుడు భయభక్తులు గల వారిని ప్రేమిస్తాడు”- ఖుర్ఆన్ 9 : 4

4. సదాచరణ
“దేవుడు ఇలాంటి సదాచర సంపన్నులనే ప్రేమిస్తాడు” – ఖుర్ఆన్ 3 : 134

5. దేవునిపై_నమ్మకం:
“నిశ్చయంగా దేవుడు తనను నమ్ముకున్న వారిని ప్రేమిస్తాడు” – ఖుర్ఆన్ 3 : 159

6. న్యాయం:
“నిస్సందేహంగా దేవుడు న్యాయశీలురను ప్రేమిస్తాడు” – ఖుర్ఆన్ 5 : 42

“నిశ్చయంగా సమభావంతో వ్యవహరించే వారిని దేవుడు ప్రేమిస్తాడు” – ఖుర్ఆన్ 49 : 9

7. సహనం:
“దేవుడు సహనం వహించే వారిని ప్రేమిస్తాడు”- ఖుర్ఆన్ 3 : 146

సృష్టికర్త అయిన దేవుడు ప్రేమించే పై ఏడు గుణాలను ఆచరణాత్మకంగా పెంపొందించుకుని నైతిక విలువలు అలవర్చుకోవటమే ఉపవాసం విధించటం లోని లక్ష్యం. ఇలాంటి గుణగణాలలో కూడిన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోకుండా కేవలం అన్న పానీయాలు మానేసి ఉండే ఉపవాసం దేవుని దృష్టిలో కేవలం ఆకలి దప్పులతో పడుండటంతో సమానం అవుతుంది. ఇదే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ (స) ఈ క్రింది విధంగా తెలియజేశారు

“ఉపవాస వ్రతం పాటిస్తున్నప్పటికీ అసత్యం పలకటాన్ని, చెడు పనులు చెయ్యటాన్ని మానివెయ్యని వ్యక్తి ఆకలి దప్పులతో పడి ఉండటం అల్లాహ్ కు ఏ మాత్రం ఇష్టం లేదు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *