చేపలకు హలాల్ ఎందుకు అవసరం లేదు?

‘హలాల్’ కు సంబంధించి గతంలో ఒక టాపిక్ రాసినప్పుడు కొందరు మిత్రులు అడిగిన ప్రశ్న- జంతువులకు హలాల్ చేసినప్పుడు ‘చేపలకు హలాల్’ ఎందుకు చెయ్యనవసరం లేదు? అని. దీనికి సమాధానం గమనించగలరు.

తినటానికి/వాడుటకు యోగ్యమైన లేదా అనుమతి ఉన్న (Permissible) వాటిని ‘హలాల్’ అని అంటే… తినటానికి/వాడుటకు యోగ్యంకాని లేదా అనుమతి లేని (Forbidden) వాటిని ‘హరామ్’ అంటారు.

జంతువును ‘హలాల్’ చెయ్యటం వెనుక అసలు లక్ష్యం?

నిజానికి జంతు కంఠాన్ని, మెడ నాళము (Jugular Vein) ను కోసి “హలాల్” చెయ్యటం వెనుక ప్రధాన లక్ష్యం- జంతువు శరీరంలో రక్తమంతా బయటకు వచ్చెయ్యటమే! తద్వారా మాత్రమే దాని మాంసం తినటానికి యోగ్యమైనదిగా ‘శుద్ది (Purify)’ చేయబడుతుంది. ఎందుకంటే రక్తంలో ప్రమాదకరమైన టాక్సిక్ యాసిడ్లు, యూరిక్ యాసిడ్ మాత్రమే కాక చాలా రకాల విషపదార్థాలు ఉంటాయి.

‘చేప’కు హలాల్ ఎందుకు అవసరం లేదు?

ధార్మికంగా చూస్తే- ఖురాన్ “సముద్ర జీవుల్ని తినటం మీ కొరకు ధర్మసమ్మతం (హలాల్)” – 5.96 అంటూ ఎలాగూ ధర్మసమ్మతం చేసింది. కాబట్టి ఒక్క చేపలనే కాదు సముద్రంలో తినగలిగే వేటినీ ప్రత్యేకంగా ‘జిబహ్’ లేదా ‘హలాల్’ చెయ్యనవసరం లేదు? దాని వెనుక సైంటిఫిక్ రీజన్ ఏమిటి? అంటే-

చేప సహజంగా చనిపోయినప్పటికీ దాని మాంసంలో రక్తం ప్రవాహం (flowing blood) గడ్డకట్టి ఉండిపోదు. చేప సహజంగా చనిపోయినప్పటికీ దాని మాంసం స్వచ్ఛంగా ఉంటుంది. దానికి కొన్ని కారణాలున్నాయి: అవి-

చేప రక్తప్రసరణ వ్యవస్థ (Circulatory system) జంతువులకంటే వేరుగా ఉంటుంది. చేప కేవలం ‘ఏక రక్త ప్రవాహక వ్యవస్థ (Single circulatory system) కలిగి ఉంటుంది. చేప గుండెకు ఒక్క “అట్రియం” (atrium) ఒక్క “వెంట్రికల్” (Ventricle) మాత్రమే ఉంటాయి. దానికి కారణం మిగతాజీవుల మాదిరిగా కాక చేపలో అతి తక్కువ రక్తం ఉండటమే! మిగతా జీవులన్నిటికీ ఎక్కువ శాతం రక్తం ఉండి “ద్వి రక్తప్రసరణ వ్యవస్థ (Double circulatory system) ఉండి వాటి గుండెలో రెండేసి ‘అట్రియమ్స్, వెంట్రికల్స్’ ఉంటాయి.

చేపలు నీటిలో 80% ఆక్సిజన్ ను మొప్పల ద్వారానే గ్రహిస్తుంది. అంతేకాక చేప ధమనులు (Arteries) లో తక్కువ రక్తం ఉన్నప్పటికీ… రక్తం మెల్లగా ప్రవహిస్తూ ఉండటం వల్ల ఎక్కువ ఆక్సిజన్ ను గ్రహించగలుగుతుంది.

పైగా చేప రక్తంలో ‘Prothrombin’ అనే ఎంజైమ్ ఎక్కువ శాతంలో ఉంటుంది. దీనివల్లే రక్తం గడ్డకట్టటం అనేది జరుగుతుంది. చేపను ఎప్పుడైతే నీటినుండి బయటకు తీస్తామో ఈ ‘Prothrombin’ శాతం చేపలో ఎక్కువగా ఉండటం వల్ల దాదాపు రక్తమంతా గుండెలో ఒక్కసారిగా గడ్డ కట్టుకుపోతుంది. దాని శరీరంలో ఉండే కొద్దిపాటి రక్తం కూడా దాని తలలో పోగై కోసినప్పుడు బయటకు వచ్చేస్తుంది.

కాబట్టి మిగతా జీవుల మాదిరిగా చేపలకు ప్రత్యేకంగా ‘జిబహ్’ లేక ‘హలాల్’ చెయ్యనవసరం ఉండదు. మిగతా సముద్ర జీవుల శారీరక నిర్మాణం కూడా దాదాపు ఇదే విధంగా ఉంటుంది. అందుకే ధార్మికంగానే నీటిలో పెరిగే జీవుల్ని హలాల్ (Permitted) గా నిర్ధారించటం జరిగింది. అయినప్పటికీ “పరిశుభ్రమైన వాటినన్నిటిని మీరు తినండి” (ఖుర్ఆన్ 2:168) అని చెప్పటాన్ని బట్టి సముద్ర జీవుల్లోనూ తినగలిగే పరిశుభ్రమైన వాటిని మాత్రమే తినే స్వేచ్చ ఉంది.

ఈనాడు అనాటమీ చదివి, సైంటిస్టులు పై విషయాలన్నీ కనిపెట్టటాన్ని బట్టి చేపకు ‘హలాల్’ ఎందుకు అవసరం లేదో సైంటిఫిక్ ఆధారాలతో సహా చెప్పటం సాధ్యమైంది. కానీ, 1400 సం.ల క్రితం ఎడారి ప్రాంతానికి చెందిన నిరక్ష్యరాసి అయిన ముహమ్మద్ అనే వ్యక్తి ‘హలాల్’ జంతువులకే తప్ప ‘చేపలకు’ అవసరం ఉండదని ఎలా చెప్పగలిగారు? అన్నదే ఇక్కడ గమనించాల్సిన అంశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *