నిప్పుల్లో చేతులు పెట్టొద్దు పెడితే కాలుద్దని జాగ్రత్త చెప్పాక కూడా అసలు పెడితే ఏమవుద్దో అని పనికట్టుకుని నిప్పుల్లో చెయ్యిపెట్టి కాల్చుకుని తిరిగి ఆ జాగ్రత్త చెప్పినోణ్ణే పట్టుకుని “నవ్వు కాపాడలేకపోయావ్ ఏమీ చెయ్యలేకపోయావ్” అని నిందిస్తూ కూర్చునేవాడిని ఏమంటారు చెప్పండి? వెర్రిబాగులోడు, అజ్ఞాని, మోకాలు మెదడు మేధావి ఇలా ఎన్ని పేర్లు పెట్టినా తక్కువే.
కరోనా కొని తెచ్చుకుంది కూడా అలా పని కట్టుకునే! చైనా ఉహాన్ మార్కెట్ ఒక్క మనిషి మాంసం తప్ప పాములు, గబ్బిలాలు, ఎలుకలు, కుక్కలు, పందులు ఇలా ప్రతీ అడ్డమైన జంతు మాంసాలనూ అమ్మే మార్కెట్ అయితే, తినటానికి కాదేదీ అనర్హం అన్న చందంగా గబ్బిలాల సూపులు చేసుకుని తినటం నుండి దొరికిన ప్రతీ కీటకాలనూ, జంతువులను బ్రతికి ఉండగానే లోట్టలేసుకుంటూ పిక్కుతినే రాక్షస జాతి చైనా ప్రజలు.
వీరి దిక్కుమాలిన రాక్షస తిండిని చూసి కొందరు అనుభవజ్ఞులు చైనా భవిష్యత్తులో వైరస్ రూపంలో పెద్ద విపత్తును ఎదుర్కోబోతుందని ముందే హెచ్చరించారు కూడా!
సృష్టికర్త అయిన దేవుడైతే ఎప్పుడో హెచ్చరించాడు!
“ప్రజలారా, భూమిలో ధర్మ సమ్మతమైన పరిశుభ్రమైన వాటినన్నిటినీ మీరు తినండి” – ఖుర్ఆన్ 2:168
“మీ కొరకు పచ్చిక మెసే చతుష్పాద జంతువులన్నీ (తినటానికి) ధర్మసమ్మతం చేయబడ్డాయి” – ఖుర్ఆన్ 5:1
“మృత పశువు, రక్తము, పంది మాంసం, దేవేతరుల పేరుతో బలివ్వబడిన పశువులు, ఊపిరాడక లేక దెబ్బతిని, ఎత్తు ప్రదేశం నుండి పడి లేక దేన్నైనా ఢీకొని లేక అడవి మృగం చీల్చగా మరణించిన జంతువులు మీకు నిషేధించబడ్డాయి” – ఖుర్ఆన్ 5:3
ఈనాడు వేటిని తినటం వల్లనైతే అనేక ప్రమాదకర రోగాలు ప్రబలుతున్నాయో, భయంకరమైన వైరస్ లు మహమ్మారులుగా మారి విజృంభిస్తున్నాయో అలాంటి జంతువులను తినటాన్ని ఖురాన్ పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే నిషేధించింది. అలాంటి ఎన్నో ఆజ్ఞలను అటు బైబిల్లో వేదాల్లో సైతం గమనించగలం.
ప్రత్యేకంగా ఖురాన్లో “పచ్చిక మెసే చతుష్పాద జంతువులన్నీ ధర్మసమ్మతం చేయబడ్డాయి”- 5:1 అన్నది అత్యంత గమనార్హం. అంటే కోరపళ్లు లేని, శాఖాహారాన్ని మాత్రమే భుజించే జంతువులను తప్ప కోరపళ్లు కలిగి ఉండే ప్రతీ జంతువులనూ నిషేధించటం జరిగింది.
ఒక్క శాఖాహారాన్ని మాత్రమే భుజించే ఒంటే, ఆవు, మేక, గొర్రెలు వగైరా జంతువులను తప్ప కోరపళ్లు కలిగి మాంసాహారాన్ని తినే ప్రతీ జంతువునూ నిషేధించటం వెనుక ఎంత పెద్ద కారణం ఉందో ఈనాడు సంభవిస్తున్న పరిణామాలను బట్టి అర్థం కావటం లేదూ?
అంతుచిక్కని రోగాలకు కారకమయ్యే ఎన్నో రకాల వైరస్ లు కోరపళ్లు కలిగి వేటాడి మాంసాహారాన్ని తినే క్రూర జంతువుల్లోనే ఉన్నట్లు ఈనాడు సైంటిస్టులు కనుగొనటం జరిగింది. అందులో ముఖ్యంగా గబ్బిలాలు అనేక రకాల వైరస్ లను మోసుకు తిరిగే భయంకర జీవి (Fruit bats harbor more deadly viruses) అన్న విషయం ఈ మధ్యే కనుగొనబడింది. అలాగే చాలా మందికి తెలీని విషయం “ఆల్ఫా కరోనా/బీటా కరోనా/గామ్మాకరోనా/డెల్టా కరోనా” వగైరా ఎన్నో రకాల అనేక వైరస్ లు పుట్టుకకు మూలం జంతువులే.
చైనాలో పుట్టిన సార్స్ కరోనా వైరస్ 2003 లోనే 26 ప్రపంచదేశాలకు పాకి 8000 మంది ఆ అంటురోగం బారిన పడ్డారు. ఆ వైరస్ కు మూల కారణం గబ్బిలమని తేలింది. ఇప్పుడు బయటపడిన “నోవల్ కరోనా వైరస్” దీనికి కూడా మూలం గబ్బిలమని ఆ గబ్బిలాలను పాములు తినటం ఆ పాములను, గబ్బిలాలనూ చైనీయులు లొట్టలేసుకుని సూపులు చేసుకుని మరీ తినటమే నేడు విజృంబిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తికి కారణమని చెబుతున్నారు. ముఖ్యంగా 1918 సం.లో ప్రపంచాన్ని గడగడలాడించిన “స్పానిష్ ఫ్లూ” ఇది అప్పట్లోనే 50 నుండి 100 మిలియన్ ప్రజలను పొట్టనపెట్టుకుంది. ఈ విధంగా కరోనా, సార్స్, ఎబోలా, HIV వగైరా ఎన్నో వైరస్లు వివిధ గబ్బిలాలు, కోతులు అనేక ఇతర జంతువుల నుండి మనుషులకు ఆ తరువాత వ్యక్తుల నుండి వ్యక్తులకూ వ్యాపించి మహమ్మారులుగా మారుతుంటాయని ఇప్పుడు శాస్త్రవేత్తలు తేల్చారు.
———————-
సృష్టికర్త అయిన దేవుని అనేక ఆదేశాలు ఉపద్రవాలు రాకుండా ఆపటానికే…
“పరిశుభ్రమైన వాటినన్నిటినీ మీరు తినండి” – ఖుర్ఆన్ 2:168
అని ఆజ్ఞాపించటం వెనుక కారణం అపరిశుభ్రమైనవి తింటే వివిధ రోగాల బారిన పడాల్సివస్తుందన్నది…
“పచ్చిక మెసే చతుష్పాద జంతువులు తినండి” – ఖుర్ఆన్ 5:1
అని ఆజ్ఞాపించటం వెనుక కారణం కోరపళ్లు కలిగి వేటాడే జంతువులను తింటే వివిధ వైరస్ ల బారిన పడాల్సివస్తుందన్నది…
“మృత పశువు, రక్తము, పంది మాంసం తినకండి” – ఖుర్ఆన్ 5:3
అని ఆజ్ఞాపించటం వెనుక కారణం అనేక ప్రాణాంతకమైన బాక్టీరియాల బారిన పడాల్సివస్తుందన్నది…
“వ్యభిచారం దరిదాపులకు పోకండి” – ఖుర్ఆన్ 17:32
అని ఆజ్ఞాపించటం వెనుక కారణం తద్వారా సమాజంలో నైతిక విలువలు మానవత్వం చచ్చిపోయి సమాజం నాశనం అవుతుందన్నది…
“విశ్వసించిన పురుషులు చూపులు కాపాడుకోండి”
అని ఆజ్ఞాపించటం వెనుక కారణం ఇతర స్త్రీలను కామ దృష్టితో చూడటం వ్యభిచారానికి ప్రాధమిక మెట్టు అవుతుందన్నది…
“విశ్వసులైన స్త్రీలు దుప్పట్ల కొంగులను తమపై వ్రేలాడదీసుకోవాలి” – ఖుర్ఆన్ 33:59
అని ఆజ్ఞాపించటం వెనుక కారణం స్త్రీ ఆకర్షింపబడటం కామ దృష్టితో చూసేవారికి ద్వారాలు తెరవటమే! అది అనేక అనర్థాలకు దారితీస్తుందన్నది…
“మీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి” – ఖుర్ఆన్ 7:31
అని ఆజ్ఞాపించటం వెనుక కారణం మనిషికి బట్టలు ఎంత శోభనిస్తాయో అందులో హద్దులు మీరి ఆధునికత పేరుతో శరీర ఒంపుసొంపులు కనపడేలా పిచ్చి పిచ్చి బట్టలు వేసుకోవటం వల్ల అనేక అనర్థాలకు దారితీస్తుందన్నది…
“సారాయి, జూదం, దైవేతర మందిరాలు, పాచికల ద్వారా జోస్యం వీటిని విసర్జించండి”
అని ఆజ్ఞాపించటం వెనుక కారణం సారాయి, జూదం, దైవేతర మందిరాలు, పాచికల ద్వారా జోస్యం ఇవన్నీ ప్రజల జేబులు ఖాళీ చేయించే విషయాలు అన్నది…
———————-
ఈ విధంగా సృష్టికర్త అయిన దేవుడు తినటం నుండి కట్టుకునే బట్టల వరకు అశ్రద్ధ వహించటం వల్ల అనార్ధాలకు, అనారోగ్యాలకు, ప్రాణాంతక వ్యాధులకు కారణమయ్యే అనేక విషయాల గురించి ముందే హెచ్చరించాడు. ఈ హెచ్చరికలకు భిన్నంగా ప్రవర్తిస్తూ పోయి రక రకాల రోగాల బారిన పడి, పనికట్టుకుని సమస్యలు కొని తెచ్చుకుని, చేతులు కాల్చుకుని దేవుడు మమ్మల్ని కాపాడకపోవటం ఏంటి? దేవుడే ఉంటే మమ్మల్ని కాపాడాలి కదా? దేవుడు కంటే సైంటిస్టులే గొప్ప అంటూ చిలక పలుకులు పలుకుతున్న నేటి కొందరు మోకాలి మెదడు వర్గ సమాజం సభ్యులు కాస్త పై విషయాలను గురించి ఆలోచించాలి.
గుళ్లూ, గోపురాల్లో, చెట్లలో, పుట్టల్లో చాలామంది ప్రజలు ఆరాధిస్తున్న మిధ్యా దైవాలకూ, ధార్మిక గ్రంధాలలో సర్వేశ్వరునిగా, యెహోవాగా, అల్లాహ్ గా పరిచయం అవుతున్న ఏకైక సృష్టికర్తకూ తేడా తెలుసుకోకుండా గుళ్ళు, గోపురాలు కట్టేశారు కాబట్టి దేవుడు ఫెయిల్ అయిపోయాడు, మా సైంటిస్టులే పెద్ద తోపులు అంటూ ప్రగల్భాలు పలుకుతున్న వారు కాస్త బుర్ర ఉపయోగించే సమయం ఆసన్నమైంది.
చేతులు కాల్చుకుని దేవుడు ఏమీ చెయ్యటం లేదంటే ఎలా?
