భారతదేశాన్ని ఇస్లామిక్ స్టేట్ గామార్చేయటం ముస్లిముల లక్ష్యమా!?

“హిందుత్వం ప్రమాదంలో ఉంది” “భారతదేశంలో ముస్లిముల సంఖ్య పెరిగిపోతుంది” “భారతదేశాన్ని ఇస్లామిక్ దేశం”గా మార్చటమే ముస్లిముల లక్ష్యం” “కాబట్టి భారతదేశాన్ని హిందూ రాష్ట్రగా మనం తయారుచేసుకోవాలి” ఈ రకమైన ధ్వేషపూరిత స్టేట్మెంట్లు పదే పదే చెప్పిందే చెప్పి, ‘విభజించు పాలించు’ అన్న సూత్రాన్ని బాగా వంటబట్టించుకున్న నేటి మతోన్మాద శక్తులు అధికశాతం సామాన్య హిందూ ప్రజానీకం మనస్తత్వాన్ని ఎంతగా కలుషితం చేసి పరేశారంటే వారు నిజంగానే “ఓహో! భారతదేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చటం ముస్లిముల అంతర్గత లక్ష్యం అన్నమాట!” అని భావిస్తూ, ముస్లిముల వంక అనుమానపు చూపులు చూడటం, వారి పట్ల అంతర్గతంగా ఏహ్యా భావం పెంచుకునేంతగా వారి మనస్తత్వాలను ప్రభావితం చేసి పరేశారు.

భారతదేశ ముస్లిముల పట్ల ఈరకమైన ధ్వేషపూరిత ప్రసంగాలు (Hatred Speeches) చివరకు అధిక శాతం సామాన్య హిందూ ప్రజానీకం మనస్తత్వాలను ఎంతగా ప్రభావితం చేశాయంటే- ముస్లిములు దాదాపు భారత దేశాన్ని వెయ్యి సంవత్సరాలు పరిపాలించారని, ఈ దేశానికి అసలు “హిందూస్తాన్”గా నామకరణం చేసిందే ఒకప్పటి ముస్లిములని, పూర్తి భారతదేశం ముస్లిముల పాలనలో ఉండగా నిజంగా ముస్లిముల ఏజండా లేకా వారి పాలసీలో భారతదేశాన్ని “ఇస్లామిక్ కంట్రీ”గా మార్చేయటం అన్నది ఉండి ఉంటే ఈ దేశానికి “హిందుస్తాన్” అన్న పేరు పెట్టటానికి బదులు ఏదో ఒక ఉర్దూ/అరబిక్ పేరు పెట్టేసి ఈ దేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చిపరేయటానికి వారికి ఓ కప్పు టీ త్రాగినంత సమయం కంటే ఎక్కువ సమయం పట్టి ఉండేది కాదని, కానీ వారు అన్నేళ్ల పరిపాలనా కాలంలో భారతదేశ సంస్కృతిని, హిందూ సమాజాన్ని కాపాడారే తప్ప నాశనం చేసిపరెయ్యలేదని అలా చేసి ఉంటే ఎప్పుడో హిందూ సమాజం అంతరించిపోయి, భారతదేశం ఎప్పుడో ముస్లిం కంట్రీగా మారిపోయి ఉండేదని ఆలోచించలేనంతగా వారి మెదళ్లు మొద్దుబారిపోయేంతగా ప్రభావితం చేసేశాయి.

అంతవరకు అవసరం లేదు అసలు భారతదేశ స్వతంత్రం వచ్చిందే వేలకొద్దీ సామాన్య ముస్లిములు, ముస్లిం రాజులు ఇక్కడ ఉన్న హిందువులతో భుజం భుజం కలిపి, ఈ దేశం కోసం తమ ప్రాణాల్ని తృణప్రాయంగా వదిలేయటం కారణంగానే సాధ్యమైందన్న కనీస చరిత్ర అవగాహన చేసుకోలేనంతగా నేటి మతోన్మాద వాదులు అధికశాతం సామాన్య హిందూ ప్రజానీకాన్ని అజ్ఞానపు కారు చీకట్లలో నెట్టేసి, ముస్లిములు దేశద్రోహులన్నట్టు చిత్రీకరించి, వారి పట్ల ధ్వేషాన్ని పెంచి పరేశారు.

అంతేకాదు ముస్లిములు ఈ దేశాన్ని సర్వ నాశనం చేసేశారని, హిందువులను చంపేశారని, ఆలయాలు ధ్వంసం చేసేశారని వక్రీకరించబడిన చరిత్రలను వారి మెదళ్లలో పదే పదే నూరిపోసిన కారణంగా ఈ విమర్శలు నిజమేనేమో అనుకుని చాలా మంది సామాన్య హిందువులు ముస్లిముల పట్ల కారణం లేని ద్వేషాన్ని పెంచుకోవటం మొదలెట్టారు.

ముస్లిం పాలకులు ఇండియాను ఇస్లామిక్ స్టేట్ గా మార్చేయ్యొచ్చుగా?

నేటి కొందరు మతతత్వవాదులు చెబుతున్నట్టు నిజంగా హిందూ సమాజాన్ని అంతం చేసెయ్యటం, హిందూ సంస్కృతిని నామరూపాలు లేకుండా చేసిపరేసి ఇండియాను ఇస్లామిక్ కంట్రీగా మార్చటమే ముస్లిముల లక్ష్యమైతే దాదాపు వెయ్యేళ్లు ముస్లిం రాజుల క్రింద పాలించబడిన భారతదేశంలో స్వతంత్రం వచ్చేనాటికి ముస్లిములు పది శాతం కంటే తక్కువగా, హిందువులు ఎనభై శాతం కంటే ఎక్కువగా ఎందుకు ఉన్నారు? వారి క్రిందే పాలించబడుతున్న భారతదేశంలో ఉండే మొత్తం హిందూ సమాజాన్ని, సంస్కృతిని, మొత్తం ఆలయాలను నామరూపాలు తుడిచిపెట్టి పరేయటం వారికి పెద్ద పనేం కాదుకదా? నిజంగా గుళ్లన్నీ పడగొట్టేయటం ఒకనాటి ముస్లిం పాలకుల లక్ష్యమే అయితే కొన్ని గుళ్లే పడగొట్టి మిగతా గుళ్లను ఎందుకు వదిలిపెడతారు? కానీ అన్నేళ్ల ముస్లిముల పాలన అనంతరం సైతం ఈనాటికీ హిందూ సంస్కృతి ఇంకా సజీవంగానే ఎందుకు ఉంది? ఈ ప్రశ్నలకు వారు సమాధానం చెప్పలేరు సరికదా ఇలాంటి ప్రశ్నల పట్ల లాజికల్గా ఆలోచన చేసేంతగా నేటి మతతత్వవాదులు సామాన్య హిందూ ప్రజానీకం మెదళ్లను ఎదగనివ్వలేదు కూడా.

కాబట్టి దాదాపు వెయ్యి సంవత్సరాల ముస్లిం పాలన అనంతరం సైతం స్వతంత్రం వచ్చేనాటికి హిందువుల జనాభా ఎనభై శాతం కంటే ఎక్కువగా ఉందంటే అది హిందువుల గొప్పతనమో లేక వారు ఏ శిలాజిత్ లేహ్యమో వాడిన దాని ఫలితమైతే కాదు! కేవలం భారతదేశాన్ని హిందుస్తాన్ అన్న పేరుపెట్టి, ఇక్కడ హిందూ ప్రజానీకాన్ని, హిందూ సంస్కృతిని చెక్కుచెదరకుండా అనేక వందల సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు కాపాడుకుంటూ వచ్చిన ఒకనాటి ముస్లిం పాలకుల ఫలితమే అన్నది నిర్వివాదం.

ముస్లిం రాజులు ఆలయాలు ధ్వంశం చేయలేదా?

ముస్లిం రాజులు ఆలయాలు ధ్వంశం చేశారని చరిత్రలో ఉంది! అది యుద్ధోన్మాదమే తప్ప మతోన్మాదం కాదు అన్నది చరిత్ర అవగాహన ఉన్నోల్లకు ఎరుకే! వాస్తవానికి అప్పట్లో ప్రతీ రాజ్యానీకీ ఒక రాష్ట్ర దైవం ఉండేది. ఆ రాజ్యం తాలూకు ఆలయంలోనే రహస్య మాళిగలలో సంపదలను భద్రపరుచుకోవటం జరిగేది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆలయాలు రాజ్యపు అస్తిత్వ రూపాలుగా ఉండేవి. ఒక్కో రాజ్యానికి ఒక్కో దేవత ఉండేది. ఒక రాజ్యం మరో రాజ్యాన్ని జయించినప్పుడు ఓడిపోయిన రాజ్యం యొక్క రాజ్య దేవతను, ధ్వంశం చెయ్యాటమో, తరలించుకుపోయి తమ రాజ్యంలో కలుపుకునేవారు. అలా చెయ్యటం యుద్ధాన్ని నెగ్గటానికి, వారి రాజ్యాన్ని తమ రాజ్యంలో కలుపుకోవటానికి సంకేతంగా (Symbolic) భావించేవారు. ఆ విధంగా రాజ్యాలకు రాజ్యాలకూ మధ్య జరిగిన అనేక యుద్ధల్లో ఒక్క ముస్లిం రాజులే కాదు అనేక హిందూ రాజులు సైతం ఆలయాలను ధ్వంశం చేసినట్లు, సంపదలను తమ రాజ్యాలకు తరలించుకుపోయినట్లు చరిత్రలో ఉంది. కానీ, హిందుత్వ మతోన్మాదులు ఈ కోణాన్ని దాచిపెట్టి కేవలం ముస్లిం రాజులు మాత్రమే మతోన్మాదంతో ఆలయాలు ధ్వంసం చేసి సంపదలు దోచుకెళ్లి పోయారని చరిత్రలను వక్రీకరించి, హిందు ప్రజానీకంలో ధ్వేషాన్ని పెంచి పోషిస్తూ ఉంటారు. గమనార్హమైన విషయం ఏమిటంటే- బ్రిటిషర్లు ఇండియాను దోచుకుని బ్రిటన్, ఫ్రెంచ్ నగరాలను నిర్మించుకున్నట్టు ముస్లిం రాజులు ఈ దేశ సంపదను కొల్లగొట్టి ఏ ముస్లిం దేశాలూ నిర్మించుకోలేదు! వెయ్యెళ్ళ ముస్లిం పాలనలో ముస్లిం రాజులు ఈ దేశ సంపదను ఈ దేశం కోసమే ఖర్చుపెట్టారు!

ఇక యుద్ధాలు లేని సమయంలో ముహమ్మద్ బిన్ తుగ్లక్, అక్బర్, ఔరంగజేబు, కులీ కుతుబ్ షా వగైరా ముస్లిం రాజులు ఆలయాలను పునరుద్ధరించినట్లు, ఆలయాలు నిర్మించినట్లు చూడగలం. కానీ, మతతత్వవాదం తలకెక్కించుకున్న మూర్ఖులు చరిత్రలో సమాధి కాబడ్డ ఈ నిజాల్ని బయటకు తీయరు. కేవలం మతోన్మాదం తలకెక్కిన ముస్లిములు ఈ దేశంలో ఆలయాలను ధ్వంశం చేసిపారేశారని, అలా చేయటంలో వారి లక్ష్యం ఈ దేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చేయ్యటమే అని ఏమాత్రం పొంతన లేని దిక్కుమాలిన వక్రీకరించబడిన కల్పిత చరిత్రలను సామాన్య హిందూ ప్రజల తలకెక్కించి వారిలో ధ్వేషాన్ని పెంచి పోషిస్తూ పైశాచికానందాన్ని పొందుతూ ఉంటారంతే!

ఇస్లాం ముస్లిములపై మోపిన బాధ్యత ఇస్లామిక్ స్టేట్ స్థాపనా? వ్యక్తి సంస్కరణా?

ఇస్లాం ముస్లిం సమాజంపై మోపిన బాధ్యత, మౌలిక లక్ష్యం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఒక్క వ్యక్తి సంస్కరణ మాత్రమే! తప్పితే “ఇస్లామిక్ రాజ్య (ఇస్లామిక్ స్టేట్) స్థాపన” కానే కాదు. పూర్తి ఖురాన్ లో ముస్లిములకు అలాంటి ఆదేశం ఇచ్చినట్టు ఒక్కటంటే ఒక్క వాక్యం ఎక్కడా ఉండదు. ముస్లిం సమాజంపై ఖురాన్ పెట్టిన బాధ్యత ఏదైనా ఉందంటే ఈ క్రిందదే-

“ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికి, వారి సంస్కరణకు రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. మీరు మంచి చేయండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు” – ఖుర్ఆన్ 3:110

ఇస్లాం లేదా ఇస్లామిక్ అన్న పదాలు వ్యక్తి ఆచరణకు సంబంధించివే తప్ప ఇస్లామిక్ స్టేట్, ఇస్లామిక్ టౌన్, ఇస్లామిక్ టెర్రరిజం వగైరా అంటూ ఉండవు! ఒకవేళ ఉంటే ముస్లిం సొసైటీ కల్చర్ ఉండొచ్చు, ముస్లిం పాపులేటెడ్ కంట్రీస్ ఉండొచ్చు క్రిస్టియన్ కంట్రీస్ మాదిరిగా! ఇస్లాం అంటే శాబ్దిక అర్థం శాంతి ఇంకా దేవుని విధేయత అని అర్థం. ఇస్లాంను ఆచరిస్తూ ఇతరులకు చేరవెయ్యటమే ఖురాన్ మోపిన బాధ్యత తప్ప ఇస్లామిక్ స్టేట్స్ స్థాపించటం కాదు. ఇస్లాం ధర్మం ప్రాబల్యం ఉన్న దేశాలను సామాన్య పరిభాషలో ఇస్లామిక్ కంట్రీస్ అని అనటం జరుగుతుంది తప్ప నిజానికి ఇస్లామిక్ బిహేవియర్ మాత్రమే ఉంటుంది.

ఇస్లామిక్ స్టేట్ అన్నది ముస్లిముల లక్ష్యం కాకపోతే పాకిస్తాన్ దేనికీ? అన్న ప్రశ్న రావొచ్చు. నిజానికి పాకిస్తాన్ ప్రస్తావన 1937 తరువాత ప్రారంభమైందే! అంతకు ముందే ఎందరో ముస్లిం రాజులూ సామాన్యులు ఈ దేశంకోసం ప్రాణాలు అర్పించేసారు. వారికి కనీసం పాకిస్తాన్ ప్రస్తావన కూడా తెలియదు. ముస్లిములు వేలల్లో ప్రాణార్పణలు చేసింది ఈ దేశాన్ని ఇస్లామిక్ కంట్రీ గా మార్చటానికో పాకిస్తాన్ కోసమో కాదు హిందూస్తాన్ బంగారు భవిష్యత్తు కోసమే

మరి ప్రపంచంలో ముస్లిం కంట్రీస్ ఎలా ఏర్పడ్డాయి?

ముస్లిం పాపులేటెడ్ కంట్రీస్ ఎలా ఏర్పడ్డాయి అన్నదానికి చరిత్రను సంక్షిప్తంగా పరిశీలిస్తే అవి కూడా ఆయా దేశాల్లో స్థానిక ప్రజలను ముస్లిములు తన్ని తరిమేసో, బలవంతంగా ఇస్లాంలోకి మార్చేసో, చంపెయ్యటం వలనో కాదు. దానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రాచీనకాలం నుండి స్వార్థపరులైన మత పండితులు కాల్పనిక ధర్మాలను సృష్టించి విధిస్తూ వచ్చిన కఠినమైన కర్మకాండలు, ఆచరణకు యోగ్యంకాని ముఢాచారాలు, వర్ణ, వర్గ, జాతి పరమైన వివక్షల క్రింద నలిగిపోతూ ఉండే ప్రజలు ఇలాంటి ముఢాచారాలను కూకటివెళ్లతో పెకిలించివేసి, మతవివక్షలను, కుల-మత భేదభావాలను త్రుంచి వేసి, సోదరభావాన్ని, మానవ ఐక్యతను, సమానత్వాని బోధించే ఇస్లాం పట్ల సహజంగానే ఆకర్షితులయ్యారు. అలా ఆకర్షితులై ఇస్లాంను స్వీకరించిన ఎన్నో దేశాలు ఉన్నాయి. వారు షరియా ను తమ దేశ శాసనంగా స్థిరపరచుకున్నాక కాలానుగుణంగా ముస్లిం దేశాలుగా పిలువబడ్డాయి. దాని అర్థం అక్కడ నూటికి నూరు శాతం ముస్లిములే ఉంటారని కాదు. అనేక మతాల వారితో పాటు ముస్లిముల జనాభా కాస్త ఎక్కువగా ఉంటుంది అంతే! ఇక పాకిస్తాన్ ఇండియా నుండి విడిపోవటం ఒక పోలిటికల్ ఫీట్ తప్ప, భారతదేశంలో ఉండే మొత్తం ముస్లిములు మాకో సపరేట్ ముస్లిం కంట్రీ కావాలని ఎప్పుడూ కోరుకోలేదు. ఆమాటకొస్తే పాకిస్తాన్ మరల రెండు భాగాలుగా విడిపోయి ఒక భాగం బాంగ్లాదేశ్ గా ఏర్పడింది. ఇవన్నీ పొలిటికల్ గా జరిగిన పరిణామాలు. అలాగే పాకిస్తాన్ వెళ్ళిపోయినవారిలో నూటికినూరు శాతం ముస్లిములే కాదు హిందువులు కూడా ఉన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడ హిందువులు, ఇంకా అనేక ముస్లిమేతరులు కూడా కలిసి మెలిసి నివసిస్తున్నారు కూడా. ఇక ఈ దేశాన్ని ప్రేమించే ఎందరో ముస్లిములు ఇక్కడే ఉండిపోయి ఈ దేశం కోసం ప్రాణాలు సైతం అర్పించారు.

కాబట్టి భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న కులాలు, భిన్న జాతులు, భిన్న మతవర్గాలు ఏనాటి నుండో కలిసిమెలసి ఉంటున్న ఈ భారతదేశంలో ఏ వర్గపు ప్రజలు ఎక్కువ ఉన్నా తక్కువగా ఉన్నా ఇది ఎప్పటికీ హిందుస్తాన్ మాత్రమే! ఒకవేళ భారతదేశాన్ని హిందూ రాష్ట్రగా మార్చేయ్యాలి, హిందూత్వాన్ని కాపాడుకోవాలి అని ఉబలాటపడేవారు చెయ్యాల్సింది ఇక్కడ నివసించే ముస్లిమేతరులను ఇతరదేశాలకు తన్ని తరిమేయాలని అనుకోకూడదు వారి పట్ల అనవసర ధ్వేషాన్ని పెంచుకోకూడదు చేతనైతే వేదోపనిషత్తుల వెలుగులో వైదిక ధర్మాని అర్థం చేసుకుని పాటిస్తూ వాటి సారమైన మానవసేవయే మాధవ సేవ అన్న విషయాన్ని అవగాహన చేసుకుని, సర్వేజనా సుఖినోభవంతు అని చెబుతున్న హిందూ శాస్త్రాల భావం ప్రకారం కులమతాలకతీతంగా తోటిమానవులందరినీ ప్రేమించగలిగే ఉత్తమ హిందూ పౌరులుగా తీర్చిదిద్దే పనులు చెయ్యాలి. ఇదీ హిందూ దేశాన్ని నిర్మించే పధ్ధతి. తప్పితే ఇక్కడ ఉన్న వారిలో ధ్వేషాన్ని నూరిపోసి మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ సైకోలుగానో, శాడిస్టుల మాదిరిగానో తయారు చేయకూడదు.

ఇక భారతదేశాన్ని ఇస్లామిక్ స్టేట్ గా మార్చటమే ముస్లిముల లక్ష్యం అన్నది ముస్లిముల కోరికా కాదు, డిమాండ్ అంతకంటే కూడా కాదు అలాంటి లక్ష్యాలు ముస్లిములకు లేవు కూడా! కానీ, కావాలనే సామాన్య హిందూ ప్రజానీకం దృష్టిలో ముస్లిముల పట్ల ధ్వేష భావాన్ని పెంచటానికి ముస్లిములను ఈ దేశం నుండి వెళ్లగొట్టకపోతే వారు నాలుగేసి పెళ్లిళ్లు చేసేసుకుంటారు ఆ విధంగా జనాభా పెంచేసుకుని, ఈ దేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చేసుకుంటారు. కాబట్టి, మనకంటూ ఓ హిందూ దేశం ఉండాలి, ఎడారి మతస్తులను తరిమికొట్టాలి వంటి నినాదాలు మతోన్మాదుల తరఫు నుండి సృష్టించబడినవి మాత్రమే! ఇదంతా కేవలం ముస్లిముల పట్ల ధ్వేషాన్ని పెంచి, హిందుత్వవాదాన్ని రెచ్చగొట్టి, హిందూ ఓటుబ్యాంకు పెంచుకోవటంలో భాగంగా చెయ్యబతున్న పోలిటికల్ ఫీట్ తప్ప భారతదేశంలో దాదాపు తొంబైశాతం మంది ఇంట్లో ఉన్న ఒక్క భార్య ఒకరిద్దరు పిల్లల్ని సరిగ్గా పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్న సామాన్య మిడిల్ క్లాస్ ముస్లిం ప్రజానీకమే ఉన్నారు. దేశాన్ని తాకట్టు పెట్టటానికి బ్రిటిషర్ల బూట్లు నాకిన సావర్కర్ శిష్యులకు ఒకప్పుడు దేశం కోసం ప్రాణాలు అర్పించి, ఈ దేశాన్ని ప్రాణప్రదంగా ప్రేమించే సామాన్య ముస్లిములు ఎలా ఉగ్రవాదుల్లా, ఇస్లామిక్ స్టేట్ నిర్మించుకునే వారిగా కనపడుతుంటారో ఎంత జుట్టు పీక్కున్నా ఎప్పటికీ అర్థం కాని లాజిక్కే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *