“జీహాద్” అన్న పదాన్ని నోటితో పలుకుతూ ఒకడు ఉగ్రవాదం చెయ్యటాన్ని బట్టి “జీహాద్” కు అర్థం ఉగ్రవాదం అని ఊహించుకోవటం “జై శ్రీరామ్” అని పలుకుతూ ఒకడు ఉగ్రవాదం చెయ్యటాన్ని బట్టి శ్రీరాముడు ఉగ్రవాదం నేర్పాడని ఊహించుకోవటం లాంటిదే! చెడుపై పోరాడుతున్నానన్న భావనలో ఉండి ఒకడు తీవ్రవాదం చేస్తూ జీహాద్ అని పలికినా, అదే భావనలో ఉండి ఒకడు తీవ్రవాదం చేస్తూ “జై శ్రీరామ్” అని పలికినా ఇద్దరిలో కామన్ గా పని చేసే అంశం మూర్ఖత్వమే! ఈ విషయాన్ని కాస్త ప్రక్కన పెడితే…
మర్యాద, సంస్కారం వంటివి వాటితో పెద్దగా పరిచయంలేని లేని నేటి కొందరు అభినవ మతోన్మాదులు ముస్లిములను అవహేళన చేయటానికి సోషల్ మీడియాలో ఎక్కువగా వాడే ఉత పదం “జిహాదీ గాళ్లు” అన్నది! అసలు “జీహాద్” అనే అరబీ పదానికి తెలుగు అర్థం తెసిస్తే, కాస్త బుద్ధిని ఉపయోగించి ఆ పదం యొక్క అసలు లక్ష్యం అవగాహన చేసుకుంటే జీవితంలో చచ్చినా ఇంకోసారి ముస్లిములను అవహేళన చెయ్యటానికి “జిహాదీ గాళ్ల”న్న పదం తన నోటి నుండి తీసే సాహసం ఏ ఒక్కడూ చెయ్యనే చెయ్యడు అనటం అతిశయోక్తికాదు! సహజంగా ఒకర్ని తిట్టాలన్నా, వెక్కిరించాలన్నా లేక అవహేళన చెయ్యాలన్నా బూతో లేక ఏ వ్యంగ పదమో వాడటం పరిపాటి. తప్పితే అర్థం తెలీని పరభాష తాలూకు గౌరవ ప్రదమైన పదాన్నో లేక ఒక బిరుదునో అపార్థం చేసుకుని ఇతరుల్ని అవహేళన చెయ్యటం కోసం వాడటానికి మించిన హాస్యాస్పదమైన విషయం మరొకటి ఉండదు. ఇప్పుడు కొందరు భాష పరిజ్ఞానం లేని మతోన్మాదులు చేస్తుంది అదే!
“జిహాదీలు” అంటే “టెర్రరిస్టులు” అని అర్థమా?
ప్రపంచంలో ఎక్కడ ఏ తీవ్రవాద సంఘటన జరిగినా అందులో ఏ ఉర్దూ/అరబిక్ పేరు గల తీవ్రవాదో పట్టుబడితే ఇస్లామోఫోబియాను పెంచి పోషించే పేయిడ్ అయితే “ఇస్లామిక్ జిహాదీ” అని ప్రచారం చెయ్యటం మొదలెడుతుంది దాన్ని పట్టుకుని సోషల్ మీడియాలో తెలుగు వ్యాకరణమే సరిగ్గా తెలీని కొందరు మొత్తం ముస్లిం సమాజాన్ని ఉద్దేశిస్తూ “జీహాదీ గాళ్లని” అని వెక్కిరించటం మొదలెడతారు.
“జీహాద్” కు వ్యతిరేకపదం “టెర్రరిజం!”
“టెర్రరిజం (Terrorism)” అన్న పదాన్ని అరబ్బీలో “జిహాద్” అనరు “ఇర్హాబ్ (إرهاب) అంటారు అంటే భాయోత్పాతానికి గురిచెయ్యటం (Terrorize) అన్న మాట! అలాగే “టెర్రరిస్ట్ లేక ఉగ్రవాది (Terrorist)” అన్న పదాన్ని అరబ్బీలో “జిహాదీ” అనరు కానీ, “ఇర్హాబి” (إرهابي) అంటారు. కాబట్టి ఉగ్రవాదానికి జిహాద్ అన్న పదానికి అసలు ఎటువంటి సంబంధం లేదు! “జీహాద్” అన్న పదానికి వ్యతిరేక పదం అరబ్బీలో “ఇర్హాబ్”! అలాగే “జీహాద్” అన్నది హింసతో కూడిన ప్రక్రియను సూచించే పదం కానే కాదు.
అయితే మరి “జిహాద్” అన్న అరబిక్ పదానికి అర్థం ఏమిటి?
జిహాద్ అన్న అరబిక్ పదానికి ధాతువు “జ.హ.ద” దీని శాబ్దిక అర్థం “శ్రమించుట” లేక “కృషి చేయుట (Strive or Struggle)” అన్నది. తప్పితే ప్రజలను భయభ్రాంతులకు గురిచెయ్యటమో, ఉగ్రవాదం చెయ్యాటమో అని కాదు.
నేడు ఇస్లాం ధ్వేషకులు విమర్శిస్తున్నట్లు ఖురాన్ ఉగ్రవాదం చేసి సమాజంలో బలవంతంగా చెడును స్థాపించమనటం లేదు కానీ, దానికి వ్యతిరేకంగా “నీవు చెడును శ్రేష్ఠమైన మంచి ద్వారా తొలగించు” (41:34) అని ఆజ్ఞాపిస్తుంది. ఈ నేపథ్యంలో స్వయంగా ప్రవక్త ముహమ్మద్ (స) చెయ్యమంటున్న జిహాద్ ఏమిటో ఒకసారి చదవండి.
“ఏ వ్యక్తి అయితే దైవం కొరకు తన హృదయంలో మెదిలే చెడులతో పోరాడతాడో అతడే వాస్తవంగా జిహాద్ చేసిన వాడు” – సహీహ్, ఇబ్నె హిబ్బన్ 4862
మరో సందర్భంలో “క్రూరుడైన పరిపాలనాధికారి సమక్షంలో సత్యవాక్కును పలకటం “ఉత్తమోత్తమ జిహాద్” అని చెప్పారు.
1). మనస్సులో మెదిలే చెడులతో పోరాడటం
2). సత్యవాక్కును పలకటం
అన్న ప్రక్రియలు “జీహాద్” అయినప్పుడు దానిని ఉగ్రవాదంతో ముడిపెట్టటానికి మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదు అన్న విషయం వేరేగా చెప్పనవసరం లేదు. కాబట్టి జీహాద్ అన్న పదానికి చెడుకు వ్యతిరేకంగా చేసే పోరాటం లేక చెడును తొలగించటానికి చేసే తీవ్రమైన కృషి అయితే “జీహాదీ” అన్న పదానికి “చెడు భావాలకు, శక్తులకు వ్యతిరేకంగా పోరాడేవాడు” అన్నమాట! ఇది ఎంతో ఉన్నత వ్యక్తిత్వం ఉన్నోల్లు పొందే స్థానం, ఉత్తమ సంస్కారవంతులకు ఇవ్వబడే ఒక బిరుదు.
ఇది తెలీని ఇస్లాం విమర్శకులు తమకు ఉన్న అర్థ జ్ఞానంతో “జీహాద్” అన్న పదాన్ని హిందువులపై చేసే దాడిగా అభివర్ణిస్తూ ముస్లిం యువకులు హిందూ యువతులను ప్రేమించటాన్ని, పెళ్లాడటాన్ని “లవ్ జిహాద్” అనే ఓ దిక్కుమాలిన పదాన్ని కనిపెట్టారు.
ఉగ్రవాదులు పాకిస్తాన్ నుండి మాత్రమే దిగుమతి అవుతారా?
అతి అరుదైనా కంగారు జాతి జంతువులు ఆస్ట్రేలియాలో మాత్రమే ఉంటాయన్నట్టు ఇస్లామోఫోబియా పెంచి పోషించే పేయిడ్ మీడియా ఉగ్రవాదం చేసేటోల్లు పాకిస్తాన్ లో మాత్రమే ఉంటారు, అలాగే ఉర్దూ/అరబిక్ పేర్లు పెట్టుకుని ఉగ్రవాదం చేసేటోళ్లను మాత్రమే టెర్రరిస్టులు అంటారన్న భావజాలాన్నిసర్వసామాన్యం చేసేసింది. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి, సమాజంలో అశాంతిని రేకెత్తించేవాడు సిరాజ్ అయినా, శ్రీరామ్ అయినా, సామ్యూల్ అయినా టెర్రరిస్టులుగానే పరిగణించబడతారు! తప్పితే శ్రీరామ్, సామ్యూల్ అని పేరుపెట్టుకున్నోల్లు చేసే తీవ్రవాదాన్ని దౌర్జన్యం అని, అబ్దుల్లా, అబ్దుర్రహ్మాన్ వగైరా ఉర్దూ/అరబిక్ పేర్లు పెట్టుకున్నోల్లు చేసే తీవ్రవాదాన్ని “టెర్రరిజం” అని అనరు! కానీ, ప్రస్తుత మీడియా ముస్లిమేతరులు చేసే తీవ్రవాదాన్ని “దౌర్జన్యమని” ముస్లిం పేర్లు పెట్టుకుని చేసే తీవ్రవాదాన్ని “ఇస్లామిక్ టెర్రరిజం” అని ప్రత్యేక పడికట్టు పదాలతో తమ న్యూస్ ను ప్రెజెంట్ చెయ్యటాన్ని బట్టి ముస్లిం పేర్లు పెట్టుకుని చేసే తీవ్రవాదాన్నే “టెర్రరిజం” అంటారు, వారిని ఇస్లామిక్ టెర్రరిస్టులు” అంటారు వారు చేసే టెర్రరిజాన్ని “జీహాద్” అంటారు అన్న తప్పుడు భావన సర్వసామాన్యమవుతూ పోతుంది.
కానీ, టెర్రరిజం చేస్తుంది ఎక్కువగా ముస్లిములే కదా!
టెర్రరిజం లేదా జీహాద్ అన్న అంశాలపై ఎప్పుడు వ్యాసాలు వ్రాసినా చాలా మంది అమాయకంగానో అతి తెలివిగానో “ముస్లిములంతా టెర్రరిస్టులు కారు కానీ టెర్రరిస్టులు అంతా ముస్లిములే కదా?” అని ప్రశ్నిస్తూ ఉంటారు.
ఇది పక్కా అజ్ఞానం అని నేను అంటాను. ఎందుకంటే కేవలం ఉర్దూ/అరబిక్ పేర్లు పెట్టుకున్నోల్లు చేసే తీవ్రవాదాన్ని మాత్రమే టెర్రరిజం అంటారన్న మీడియా పెంచి పోషిస్తున్న ఆజ్ఞానాన్ని తలకెక్కించుకున్నోల్లకు ముస్లిమేతర వర్గాలకు చెందిన వారు ఎంత ఘోరమైన తీవ్రవాదం చేసినా అది టెర్రరిజంలా కనపడదు. లక్షలాది యూదుల్ని ఘోరంగా చంపేసిన క్రైస్తవుడైన హిట్లర్ ను “క్రిస్టియన్ టెర్రరిస్ట్” అన్న పదంతో మీడియా ఎప్పుడూ పరిచయం చేయలేదు. లక్షలాది ఇరాకీ ముస్లిములను చంపేసిన జార్జ్ బుష్ ను మీడియా ఎప్పుడూ “క్రిస్టియన్ టెర్రరిస్ట్” అనలేదు. గాజా, పాలస్తీనా పై బాంబుల వర్షం కురిపించి లక్షల మంది ముస్లిములను చంపటాన్ని బట్టి “ఇజ్రాయిల్ టెర్రరిజం/జ్యూ టెర్రరిజం” అన్న పదాలు మీడియాలో వినపడలేదు.
గాంధీని చంపిన గాడ్సే నుండి గుజరాత్ లో జరిగిన హత్యాకాండ (Genocide) లో వేలమంది ముస్లిములను చంపేసినవారందరినీ హిందుత్వ ఉగ్రవాదులు అనే అనాలి. నరోడా పటియాలో 97 మంది ముస్లిములను చావుకు కారణమైన భజరంగ్ దళ్ లీడర్ అయిన బాబు భజరంగీ నుండి ఈ మధ్య కేరళలో పోలీస్ స్టేషన్ పై బాంబులు విసిరిన RSS వర్కర్ అయిన కె. ప్రాభేష్, మంగళూర్ ఎయిర్ పోర్టులో బాంబులు పెట్టిన ఆధిత్యారావ్, ఆజ్మీర్, మక్కా మస్జిద్, సంఝూవ్తా ఎక్స్ ప్రెస్ లలో బాంబులు పెట్టిన స్వామీ ఆశీమానంద అతని అనుచరులు, ఆ సంఘటనలలో పట్టుబడి జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చిన ప్రజ్ఞ్యాసింగ్ ఠాకూర్, గొరక్షక్ పేరుతో ఎంతో మంది ముస్లిం, దళిత మైనారిటీల చావుకు కారణమైన గొరక్షక్ దళ్ సభ్యులు, ఈ మధ్య షాహిన్ బాగ్ ముస్లిం ప్రొటెస్టర్స్ పై జైశ్రీరామ్ నినాదాలు చేస్తూ బహిరంగ కాల్పులు జరిపిన రామ్ భక్త్ గోపాల్, కపిల్ గుజ్జర్ వరకూ వీరందరినీ “హిందుత్వ ఉగ్రవాదులు” అనే అనాలి వారు చేసిన తీవ్రవాదాన్ని హిందుత్వ ఉగ్రవాదం అనే అనాలి.
మంచిని, మతాన్ని, మానవత్వాన్ని ప్రక్కన పెట్టేసినోడే తీవ్రవాదమైనా, అత్యాచారమైనా చెయ్యగలడు. అలాంటోడికి మతాన్ని అంటగట్టి వాడి పేరును బట్టి ఆయా మత వర్గం ప్రజలను సూటిపోటి మాటలతో హేళన చెయ్యటం అన్నది ఘోరమైన ఉగ్రవాదం అవుతుంది.
“జీహాదీ గాళ్లు”
