“ఆ రేప్ చేసినోళ్లను నడి రోడ్డు మీద ఉరి తీయాలి అప్పుడు గానీ రేప్ లు ఆగవు!”
“ఆ రేప్ చేసినోళ్లను పబ్లిక్ లో రాళ్ళతో కొట్టి చంపాలి అప్పుడు గానీ రేప్ లు ఆగవు!”
ఇవి ప్రతీసారి ఎక్కడో చోట దారుణమైన రేప్ సంఘటనలు జరిగినప్పుడల్లా సోషల్ మీడియాలో చాలా మంది చేస్తూ ఉండే నినాదాలే! ఇలా ఓ నాలుగైదు రోజులు నినాదాలు చెయ్యటం ఆ తరువాత “అయినా మన దేశంలో రేప్ చేసేటోళ్లకు ఉన్నంత ధైర్యం మన దేశ చట్టాలను అమలు పరిచేటోల్లకు మాత్రం ఎక్కడ ఉంది? అయినా ఆ రేప్ చేసినోల్లు పట్టుబడిన వెంటనే వారికి ఉరిశిక్ష వెయ్యగలరా? ఏంటి! అంటూ ఓ నిట్టూర్పు వదిలి, తిట్టుకుంటూ తమ పనుల్లో తాము నిమగ్నమవటం మళ్లా ఇంకో వారం తరువాత ఫ్రెష్ గా ఇంకో రేప్ సొంఘటన, మళ్లా సేమ్ నినాదాలు చివర్లో సేమ్ నిట్టూర్పు!
ఇప్పటికీ నాకు గుర్తుంది- నిర్భయ ఘటన జరిగినప్పుడు ప్రధాన నిందితుణ్ణి “ఇంత కిరాతకంగా హింసించి నువ్వు ఎలా రేప్ చెయ్యగలిగావ్?” అని ప్రశ్నిస్తే అతను ఇచ్చిన స్టేట్మెంట్ – “నేను చేయాలనుకున్నది చేశాను, ఇప్పుడు మీరు కావాలంటే నన్ను చంపేసుకున్నా పర్లేదు” అని. ఇంత ధైర్యంగా అలా ఎలా చెప్పగలిగాడు అంటే ఇండియాలో ప్రతీ రోజూ ఎన్ని రేపులు జరగటం లేదు రేప్ జరిగిన ప్రతీ ఒక్కడినీ 24 గంటల్లో ఉరికంబం ఎక్కించేసేంత బలమైన చట్టాలు ఎక్కడ ఉన్నాయి అన్న ధైర్యమా? లేక మహా అయితే జైల్లో కూర్చోబెట్టి మేపటం తప్ప ప్రాణహాని తలపెట్టి, మనల్ని పీకగలిగేంత సీన్ ఇక్కడి చట్టలకు లేవన్న ధైర్యమా? అన్న పాయింట్ ప్రక్కనపెడితే, అతనే కాదు రేప్ చెయ్యాలి అనుకున్నోల్ల మైండ్ సెట్ స్టడీ చేస్తే దాదాపు అందరూ ఒక రకమైన సైకో మాదిరి క్రూరమైన స్వభావాన్ని ముందుగా ఆవహింపజేసుకున్న తరువాతే రేప్ చెయ్యాలనుకున్నా లేదా ఎవర్నైనా హత్య చెయ్యాలనుకున్నా లేదా వేరే ఏ క్రైమ్ చెయ్యటమైన సాధ్యమవుతుంది అనటంలో డౌట్ లేదు. ఆ సమయంలో మానవత్వం నైతిక విలువలు అనేవి ఏవీ క్రైమ్ చెయ్యాలనుకున్నోళ్ల మైండ్ సెట్ ను కంట్రోల్ చెయ్యలేవు.
*****************
“భయం” – క్రిమినల్ మైండ్ సెట్ ను నియంత్రించగలిగే సాధనం!
“ఈ క్రైమ్ చేస్తే ఫలానా తీవ్రమైన శిక్షకు నేను గురుకావలసి ఉంటుంది” అన్న ఒక్క “భయం” అన్న ప్రేరకం మాత్రమే ఎటువంటి క్రిమినల్ మైండ్ సెట్ నైనా ఆ క్రైమ్ చేయకుండా నియంత్రించగలిగే ఏకైక సాధనం కాగలదు అన్నది నిర్వివాదం. అయినప్పటికీ ఏ నేరస్తుడైనా ఎటువంటి నేరాన్నైనా చెయ్యటం, చెయ్యకపోవటం అన్నది సైతం ఆ శిక్ష తీవ్రత మీదే ఆధారపడి ఉంటుంది అన్నది కూడా ఒప్పుకుతీరాలి.
ఉదాహరణకు ఖురాన్- “చంపటం చెడ్డడే కానీ పీడన అంతకంటే చెడ్డది” – 2:191 అని చెబుతుంది. ఈ విధంగా ఒక వ్యక్తిని పీడించటాన్ని ఇస్లాం హత్యకంటే అత్యంత తీవ్రమైన పాపంగా పరిగణిస్తుంది. అందుకే స్త్రీలను పీడించి క్రూరంగా అత్యాచారం చేయాలనుకునే మృగాళ్ల మైండ్ సెట్ ను కంట్రోల్ చెయ్యగలిగే బలమైన చట్టాన్ని “ఇస్లామిక్ షరియా”లో (ఇస్లామిక్ చట్టంలో) పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే పటిష్టంగా తయారు చెయ్యబడింది. దాని ప్రకారం ఒకవేళ ఎవరైనా స్త్రీని రేప్ చేసి పట్టుబడి నేరం రుజువైతే, అలాంటి నేరస్తుణ్ణి జైలు కు పంపటాలు, రిమాండ్ లో పెట్టి ఆ తరువాత జైల్లో కూర్చోబెట్టి మేపటం అనేవి ఉండవు. ఒకవేళ ఎవరైనా స్త్రీ అత్యాచారానికి గురైతే ఆ అత్యాచారం చేసినోడు పట్టుబడితే నడి బజారులో నిలబెట్టి ముందుగా ప్రజలందరినీ అక్కడకు హాజరవ్వాల్సిందిగా చాటింపు వెయ్యటం జరుగుతుంది. ఆ తరువాత ప్రజల మధ్య నిలబెట్టి రాళ్ళతో కొట్టించి లేక ఉరివేసి చంపటం జరుగుతుంది. దానికి కారణం అతని ద్వారా ఆ స్త్రీ తీవ్రంగా పీడించబడి రేప్ చేయబడటం అన్నది ఇస్లాం హత్య చెయ్యటం కంటే నేరంగా పరిగణిస్తుంది కాబట్టి! అంత తీవ్రమైన శిక్ష దేనికి అంటే మళ్లా అలాంటి తప్పు ఎవరు చెయ్యాలనుకున్నా వారి వెన్నులో నుండి వణుకు పుట్టటానికి! ఈ రకమైన కఠిన శిక్షల తాలూకు భయమే ఎటువంటి క్రిమినల్ మైండ్ సెట్ నైనా కంట్రోల్ చెయ్యగలిగే బలమైన ప్రేరకం అవుతుంది. కాబట్టే అరబ్ దేశాల్లో ఇతర దేశాలతో పోలిస్తే సంవత్సరానికి ఎక్కడో ఒకటో రెండో తప్ప భారత దేశంలో లాగ గంటకో రేప్ జరగదు. కారణం అక్కడి చట్టాలు విధించే శిక్షల తాలూకు “భయం!”
కానీ, భారతదేశంలో అమ్మాయిలపై యాసిడ్లు పోసి ముఖాలు కాల్చేసినా, గుంపుగా మీదపడి అతి కిరాతకంగా సామూహిక అత్యాచారాలు చేసేసినా వారా కాలిన ముఖాలతోనో, అత్యాచారం చెయ్యబడో దీనమైన జీవనం గడపటమే తప్ప వారిని అతి కిరాతకంగా పీడించి, వారి జీవితాలు దుర్భరం చేసినవారికి ప్రతిఫలంగా తీవ్రమైన శిక్షలు అంటూ ఏవీ లేవు! అది కూడా ఒకవేళ దొరికితే ఆ రేప్ చేసినోడి వయసు 18 సం.ల కంటే రెండ్రోజులు తక్కువ ఉన్నా చాలు మైనర్ గా పరిగణించి, జువైనల్ కోర్టు ద్వారా నామమాత్రంగా ఓ రెండేళ్ళు జైలలో బాగా మేపి, కౌన్సిలింగ్ ఇప్పించి పంపించేయ్యటం జరుగుతుంది. అదే మేజర్ అయితే మహా అయితే కొన్నేళ్లు జైలు శిక్ష పడుతుంది అంతే! ఆశ్చర్యంగా ఈ మధ్యకాలంలో మొట్టమొదటిసారి 12 ఏళ్ల లోపు పిల్లల్ని రేప్ చేస్తే ఉరిశిక్ష అన్న అరుదైన చట్టాన్ని తేవటం జరిగింది. అంటే 12 ఏళ్ల పైన ఉండే స్త్రీలను రేప్ చేసేసినా ఉరిశిక్ష లేదనే కదా? అలాంటప్పుడు రేప్ చేసినోల్లను ఉరిశిక్ష వెయ్యాలని నేడు ఎంతమంది ఎన్ని నినాదాలు చేసినా లాభం ఏంటి? అవన్నీ ఎడారిలో పొలి కేకలేగానే మిగిలిపోతాయి అంతే.
కాబట్టే “మేము ఎన్ని రేపులు చేసేసినా ప్రాణహాని అయితే ఎలాగూ లేదు! అది కూడా మేము దొరికిన తరువాత కదా!” అన్న మైండ్ సెట్ నేరస్తుల్లో సర్వసాధారణం అయిపోవటమే భారతదేశాన్ని స్త్రీలకు అత్యంత ప్రమాదకర దేశాల్లో మొదటి స్థానం పొందగలిగే అరుదైన జాబితాలోకి తీసుకెళ్లింది.
ఒకప్పుడు ఇస్లామిక్ షరియా విధించే తీవ్రమైన శిక్షలను న్యూసుల్లో చదివి చాలా మంది వాటిని “ఆటవిక చట్టాలని” “క్రూరమైన అమానవీయ చట్టాలని” వెక్కిరించినోల్లే నిర్భయ లాంటి దారుణమైన రేప్ సంఘటనలు జరుగుతున్న ప్పుడల్లా “ఆ రేప్ చేసినోళ్లను నడి రోడ్డు మీద ఉరి తీయాలి! ఆ రేప్ చేసినోళ్లను పబ్లిక్ లో రాళ్ళతో కొట్టి చంపాలి అప్పుడు గానీ రేప్ లు ఆగవు, దుర్మార్గులకు బుద్ధి రాదు !” అంటూ నినాదాలు చెయ్యటం మొదలెట్టారు. కానీ, ఇలాంటి దారుణాలు జరగకుండా ఎలాంటి క్రూర స్వభావం కలిగినవాడినైనా ఆ నేరం చెయ్యకుండా నియంత్రించే బలమైన చట్టాలను ఇస్లాం పద్నాలుగు వందల సం.ల క్రితమే నిర్దేశించింది అన్నది గమనార్హం.
సరే, ఇంతకూ ఇప్పుడు భారత దేశంలో ఇలాంటి దారుణమైన హత్యాచారాలు లేదా స్త్రీలపై యాసిడ్ దాడులు వంటి కిరాతక సంఘటనలు జరక్కుండా ఏమి చెయ్యాలి? ఒక్క మాటలో చెప్పండి అని ప్రశ్నిస్తే ఒకటి- ఇండియాలో ఇస్లామిక్ షరియా వంటి కఠిన శిక్షలు అమలు పరచాలి! లేదా కనీసం రేప్ జరిగిన 24 గంటల లోపు ఉరితీసేలా క్రొత్త చట్టాలను తేగలగాలి. ఇవేమీ ఎలాగూ సాధ్యం కావు కాబట్టి ఇలాంటి కిరాతకమైన రేప్ సంఘటనలు జరిగినప్పుడల్లా క్యాండిల్ మార్చ్ లు చెయ్యటాలు, ఫ్లా కార్డులు, బ్యానర్లు పట్టుకుని నేరస్తులను శిక్షించాలని నినాదాలు చెయ్యటాలు, రాస్తా రోకోలు చేసుకోవటాలు, ఫెస్బుక్, వాట్సాప్ డి.పి లు మార్చుకోవటాలు వంటివి చేసుకోవటం తప్ప చేయటానికి ఏముండదు! ఫ్రెష్ గా ఇంకో సంఘటన నెక్స్ట్ వీక్ కి రెడీ అవుతుంది! మల్లా సేమ్ టూ సేమ్ ప్రాసెస్ షురూ
నేరము – శిక్ష – ఇస్లామిక్ షరియా
