నా ఫేస్ బుక్ పేజ్ పై నేను రాసిన “ముస్లిం పేర్లు పెట్టుకున్న ఉగ్రవాదులు ముస్లిములు కాగలరా?” అన్న టాపిక్ చదివి, దానిపై నాతో కాస్త ముఖ పరిచయం ఉన్న ఓ హైందవ మిత్రుడికీ మధ్య “ఉగ్రవాదం” టాపిక్ పై ప్రశ్నోత్తరాల రూపంలో చాలా ఆసక్తికరమైన సంభాషణ సాగింది. చాలా సేపు జరిగిన సంభాషణలో అతి ముఖ్యమైన విషయాలు చర్చించబడుతూ ఉండగా డిస్కషన్ మధ్యలో మిత్రుడు “ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం చేస్తున్నది ముస్లిములే కదా!? అని ప్రశ్నించటం జరిగింది. దానికి సమాధానంగా …
నేను: ఉగ్రవాదం ముస్లిములు చేస్తున్నారా? హిందువులు లేక క్రైస్తవులు చెయ్యటం లేదా? అన్నది ప్రక్కనపెడితే అసలు “ఉగ్రవాదం” అన్న పదానికి అర్థం చెప్పగలరా?
హైందవ మిత్రుడు: ఏముందండీ! చూస్తున్నాం కదా. టెర్రరిస్ట్ గ్రూపులు నడుపుతూ, జీహాద్ పేరుతో బాంబులు పెట్టి చంపటమే ఉగ్రవాదం!
నేను: ఉదాహరణకు “హత్య” అన్న పదానికి “ప్రాణం తీయటం” అని అర్థం అయితే అది కేవలం ఒక ముస్లిం బాంబు పెట్టి చంపితేనే హత్య అనబడుతుందా? లేక ఎవడైనా ఏ విధంగా ప్రాణం తీసినా కూడా అది హత్య అవుతుందా?
హైందవ మిత్రుడు: ఎవరు ఎలా చంపినా హత్యే అవుతుంది.
నేను: ఉగ్రవాదం కూడా అంతే! ముస్లిం పేర్లు పెట్టుకున్నోల్లు చేసే దౌర్జన్యాలనే ఉగ్రవాదం అనరు! “టెర్రరిజం” అన్న పదం “టెర్రీఫై (Terrify) నుండి పుట్టింది. అంటే డిక్షనరీ ప్రకారం- “cause to feel extreme fear” అంటే “అత్యంత భయభ్రాంతులకు గురిచెయ్యటం” అలాగే “టెర్రరిజం”- “The unlawful use of violence and intimidation” అంటే- “చట్ట విరుద్ధంగా హింస మరియు బెదిరింపులకు గురిచెయ్యటం”. ఈ అర్థాన్ని దృష్టిలో పెట్టుకుంటే హింసా, దౌర్జన్యాలు లాంటివి ఒక్క ముస్లిం పేరు పెట్టుకున్నోల్లు చేసినప్పుడు మాత్రమే అది “ఉగ్రవాదం” అనబడదు కదా? ఎవరు చేసినా అది ఉగ్రవాదమే అవుతుంది.
హైందవ మిత్రుడు: అలా అయితే సమాజంలో ప్రతీ హింసాత్మక చర్యనూ మీరు ఉగ్రవాదంలో జమకడతారా?
నేను: ఎగ్జాక్ట్ గా నేను చెప్పాలనుకున్నది అదే! ఉదాహరణకు ఈ మధ్య బీహార్ నలందా జిల్లాలో ఓ యువతీ, యువకుడు నిర్జన ప్రదేశంలో మాట్లాడుకుంటూ ఉండగా కొందరు హిందూ యువకులు ఆ యువకుడి ముందే ఆ యువతిని గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు. ఇలాంటివి దేశంలో గంటకు ఒకటి చొప్పున నెలకు వేలల్లో జరుగుతున్నాయి. చిన్నారి ఆసిఫా లాంటి ఎందరో అమ్మాయిలు గ్యాంగ్ రేప్ కి గురౌతున్నారు. వరకట్న దాహానికి ఎందరో స్త్రీలు కిరోసిన్ మంటల్లో కాలి బూడిదౌతున్నారు. ఇవేమీ “చట్ట విరుద్ధంగా భయభ్రాంతులకు గురిచెయ్యటం, హింసా, దౌర్జన్యాలు చెయ్యటం” అన్న కోవలోకి రావంటారా? నిర్భయ అత్యాచారం నుండి నేటి నలందా జిల్లాలో జరిగియ మూక అత్యాచారాల వరకూ అన్నీ ఉగ్రవాద దాడులే అవుతాయి. ఇలాంటి సంఘటనలు హిందూ సమాజంలో ఇతర సమాజాల్లో ఎన్ని జరగటం లేదు? అయితే నిర్భయ సంఘటన నుండి ఆసిఫా నేటి నలందా గ్యాంగ్ రేప్ సంఘటన వరకు అత్యాచారం చేసినోళ్ళు హిందూ పేర్లు తగిలించుకుని ఉండటం మూలానా మీడియా సైలెంట్ గా ఉంది తప్పితే అదే ఆ సంఘటనలు ఏ ముస్లిం పేర్లు తగిలించుకున్నోల్లో చేసి ఉంటే ఈ పాటికే దానిని ఇస్లామిక్ టెర్రరిజం, లవ్ జీహాద్ లాంటి దిక్కుమాలిన పేర్లు తగిలించి ప్రచారాలు చేసేవారు.
హైందవ మిత్రుడు: ఇలాంటి సంఘటనలు ప్రతీ మత వర్గంలోనూ కోకొల్లలుగా జరుగుతూ ఉంటాయి. వాటిని బట్టి చట్టం శిక్షిస్తుంది. వాటిని బట్టి ఆయా మత వర్గాలన్నిటినీ ఉగ్రవాదం చేస్తున్నాయని చెప్పలేము కదా?
నేను: ఉగ్రవాదం అంటేనే చట్ట వ్యతిరేక హింసాత్మక చర్య! తపై టోపీ గెడ్డం కలిగి ముస్లిం/అరబిక్ పేరు పెట్టుకున్నోల్లు బాంబులు పెట్టి మారణ హోమం సృష్టించటాన్నే ఉగ్రవాదం అనరు! మీడియా “ఇస్లామిక్ టెర్రరిజం” అనే దిక్కుమాలిన పదం ఉనికి లోనికి తెచ్చి, ఆ రకమైన ఫోకస్ చెయ్యటం వల్ల టెర్రరిజం అంటే అది కేవలం ముస్లిములు చేసే మారణ హోమం అన్న అపార్థం ఈ రోజు కామన్ అయిపోయింది. గుజరాత్ దాడుల్లో వందల కొద్ది ముస్లిం ప్రజానీకం చనిపోయింది కానీ మీడియా దానిని “హిందూ టెర్రరరిజం” అని చెప్పదు. రోహింగ్యాలో వేలమంది ముస్లిములను బుద్ధిస్టులు దారుణంగా చంపారు. దానిని మీడియా “బుద్దిస్ట్ టెర్రరిజం” అని చెప్పలేదు. అనేక సంవత్సరాలుగా ఇస్రాయీల్ పాలస్తీనా, గాజాలపై బాంబుల వర్షం కురిపించి లక్షల ముస్లిముల ప్రాణాలు తీసేసినా దానిని మీడియా “జ్యూయిష్ టెర్రరిజం” అని చెప్పదు. రెండొందల సంవత్సరాలు బ్రిటీష్ వారు ఈ దేశంపై చేసిన అత్యాచారాన్ని కానివ్వండి, లేదా అమెరికా ఇరాఖ్ పై బాంబుల వర్షం కురిపించి లక్షల మందిని పొట్టన పెట్టుకున్నా దానిని “క్రిష్టియన్ టెర్రరిజం” అని చెప్పలేదు! దానికి కారణం పెయిడ్ మీడియా టెర్రరిజం అన్నది ముస్లిం సమాజానికే ప్రత్యేకం చేయాలన్న కంకణం కట్టుకుంది కాబట్టి.
99% క్రైస్తవ దేశాలు పాల్గొని కోట్లమందిని చంపిన రెండవ ప్రపంచయుద్ధం ఉగ్రవాదమే! 200 సం.లు బ్రిటీషర్స్ ఈ దేశంపై చేసింది ఉగ్రవాదమే! గాందీ, ఇందిరా గాంధీలను చంపినవారు చేసిందీ ఉగ్రవాదమే! జలియన్ వాలా బాగ్ లో వందల హిందువుల్ని చంపిన బ్రిటీషర్లు చేసిందీ ఉగ్రవాదమే! ఇరాఖ్ పై బాంబుల వర్షం కురిపించి అమెరికా 12 లక్షల మందిని చంపటమూ ఉగ్రవాదమే! గాంధీని, ఇందిరా గాంధీని చాపటం నుండి గౌరీ లంకేష్ ను చంపటం ఉగ్రవాదమే! గుజరాత్ దాడులైనా, రోహింగ్యా దాడులైనా, ఈ మధ్య ఓ ఆస్ట్రేలియన్ క్రైస్తవుడు న్యూజిలాండ్ మసీదులో దూరి 50 మంది ముస్లిములను కాల్చి చంపిందీ ఉగ్రవాదమే! గోరక్షక్ పేరుతో అనేక ముస్లిం, దళితులను చంపటమూ ఉగ్రవాదమే! ఆజ్మీర్ షరీఫ్, మక్కా మైసీదుల్లో బాంబులు పెట్టి ముస్లిములను చంపిన ప్రజ్ఞా సింగ్, స్వామీ ఆశీమానంద గ్యాంగ్ చేసిన దారుణాలూ ఉగ్రవాదమే! చిత్రం ఏమిటంటే పై ఉగ్రవాదాలు చేసింది ములు కాదు! చివరకు ఆస్తి పంపకాల్లో తేడా వచ్చి ఓ అన్న తమ్ముణ్ణి చంపేసినా కూడా ఉగ్రవాదమే అవుతుంది.
హైందవ మిత్రుడు: కరెక్టే! గుజరాత్, రోహింగ్యా లేక పాలస్తీనా, గాజా వగైరా దాడులు దౌర్జన్యమే కానీ అవేమీ మతం కోసం చేయబడ్డ దాడులు కాదు కదా? ఇస్లామిక్ టెర్రరిస్టులు చేసేది ఇస్లాం వ్యాప్తికోసం “జీహాద్” చేస్తున్నారు అంటే ఉగ్రవాదం చేస్తున్నారు. మీరు కాదనగలరా?
నేను: మీరు గమనించాల్సిన మొదటి విషయం- “ప్రజలను భయభ్రాంతులకు గురిచెయ్యటం, హింసా, దౌర్జన్యాల”ను “ఉగ్రవాదం” అంటారు అంతే! తప్పితే మతం కోసం ముస్లిం పేర్లు పెట్టుకున్నోల్లు చేసే దౌర్జన్యాన్ని మాత్రమే “టెర్రరిజం” అనరు. రెండు- మతం ఎప్పుడూ ఉగ్రవాదం చెయ్యమనదు! ఉగ్రవాదానికి మతం అనేది ఉండదు! గమనార్హమైన విషయం ఏమిటంటే- ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద దాడులన్నిటిలో చనిపోతుంది అధికశాతం ముస్లిములే! అందులో ముఖ్య పాత్ర ISIS సంస్థదే! వాస్తవానికి 70,80 వ దశకాల్లో అటు అల్-ఖైదా, ISIS తయారుచేసిందే అమెరికన్ CIA గూఢచార సంస్థలు! ఆ రెండు సంస్థల ద్వారా జరిగే దారుణాలకు వాస్తవానికి క్రైస్తవ దేశమైన అమెరికా యే బాధ్యత వహించాలి. పైగా ఉత్తమ ప్రవర్తన, నైతిక బోధల ఆధారంగా ఇస్లాం వ్యాప్తి చెయ్యటానికే ప్రాధాన్యత ఉంది తప్ప ఇస్లాంను బలవంతంగా స్వీకరింపజేయటానికి ఖురానే స్వయంగా ఒప్పుకోవటం లేదు. ఇక ఇస్లాం అంటే అర్థమే “శాంతి” “దైవానికి స్వయం సమర్పణ చేసుకోవటం” అటువంటప్పుడు ఉగ్రవాదం ఆధారంగా శాంతిని నెలకొల్పటం ఎటువంటిదంటే చల్లదనం కోసం అగ్గి మంట వేసుకున్నంత మూర్ఖత్వమైంది! ఇక జీహాద్ అన్నదానికి నిఘంటు అర్థం- ‘కృషి చెయ్యటం” “ప్రయత్నించటం” ఖురాన్ చెయ్యమంటున్న “జీహాదుల్ అక్బర్ (గొప్ప జీహాద్)” మనిషి తన హృదయంలో మెదిలే చెడులతో, తన మనస్సుతో పోరాడటం! తప్పితే జీహాద్ అంటే దాడి చెయ్యాటమో, దౌర్జన్యం చెయ్యాటమో కాదు! ఆ విధమైన దిక్కుమాలిన అపార్థాలు ప్రాచారం చేసేది యాంటీ-ఇస్లామిక్ పేయిడ్ మీడియా మాత్రమే!
హైందవ మిత్రుడు: కానీ ఉగ్రవాదం చేసేటప్పుడు టెర్రరిస్టులు అల్లాహుఅక్బర్ అని చెప్పే చంపుతున్నారు కదా! ఇస్లాంకు ఉగ్రవాదంతో సంబంధం లేదంటారా?
నేను: అల్లాహుఅక్బర్ అని ముస్లిం పేర్లు తగిలించుకున్నోల్లు ఉగ్రవాదం చెయ్యటాన్ని బట్టి ఇస్లాం ఉగ్రవాదం బోధిస్తుందని ఊహించుకోవటం, జై శ్రీరామ్ పేరుతో హిందూ పేర్లు పెట్టుకున్నోల్లు మైనార్టీలను హింసించటం, చంపటాన్ని బట్టి హిందూ శాస్త్రాలు ఉగ్రవాదం బోధిస్తున్నాయి అనటం వంటిదే! ఏ మతమూ ఉగ్రవాదాన్ని బోధించదు ఏ నిజ ధార్మికుడూ ఉగ్రవాదం చెయ్యడు. ఇలాంటి వారిని “ఎక్స్ ట్రీమిస్ట్స్ (Extremists)” అంటారు. ఉగ్రవాదం అన్నది ఓ ఉన్మాద చర్య అయితే ఆ ఉన్మాదాన్ని చేసేవారు ముస్లిం/అరబిక్ పేర్లు పెట్టుకుంటే దాన్ని ఇస్లాంతో లేక హిందూ పేర్లు పెట్టుకుంటే దాన్ని హిందుత్వానికి, క్రైస్తవ పేర్లు పెట్టుకుంటే దాన్ని క్రైస్తవాన్ని ఆపాదించటం అతి ఘోరమైన అజ్ఞానం, మూర్ఖత్వం అవుతుంది.
హైందవ మిత్రుడు: ముస్లిం పేర్లు పెట్టుకుని ఉగ్రవాదం చేస్తున్నవారు ముస్లిములు కాదంటారా? ముస్లిమేతరులను చంపమని ఖురాన్ చెబుతుంది కదా?
నేను: ముస్లిములకు, ముస్లిం పేర్లు పెట్టుకున్నోల్లకు చాలా తేడా ఉంది. ముస్లిం అంటే “దైవ విశ్వాసి” “దేవునికి లోబడినవాడు” అన్న అర్థాలు ఉన్నాయి. నిజానికి సృష్టిలో దేవునికి లోబడి ఉన్న అణువు నుండి, విశ్వంలో బ్రహ్మాండం వరకూ దేవునికి లోబడి ఉన్నవన్నీ ముస్లిములే! ఒకవేళ హిందూ శాస్త్రాలు చదివి నిజ సృష్టికర్త అయిన దేవుడు ఇక్కడే అని తెలుసుకుని ఆయనకు మీరు లోబడి ఉన్నా చాలు మీ పేరు హిందూ పేరైనా మీరూ ముస్లిమే అవుతారు. ముస్లిం అన్నది దృక్పథం తాలూకు పేరు తప్ప ప్రత్యేక మతం తాలూకు పేరు కాదు. మీరు గమనించాల్సిన మరో విషయం స్వతంత్ర ఉధ్యమంలో 200 సం.లు బ్రిటీషర్లతో పొరాడి ప్రాణాలు అర్పించిన వారిలో ముస్లిములు వేలల్లో ఉన్నారు. వేల కొద్ది ముస్లిములు ఈ దేశం కోసం, దేశ ప్రజల కోసం ఉరి తాళ్లను ముద్దాడి, తుపాకీ గుళ్ళకు బలై ఇష్టంగా తమ ప్రాణ త్యాగాలు చేసేశారు. కారణం ఇస్లాం స్వదేశానికి, పుట్టిన భూమికి ఇమ్మంటున్న ప్రాధాన్యతే! కాబట్టి ఖురాన్ బాగా అర్థమైంది ఆనాడు ముస్లిమేతరుల కోసం ప్రాణత్యాగాలు చేసిన ముస్లిములకా? ఈనాడు ముస్లిమని, ముస్లిమేతరులని చూడకుండా చంపుతున్న ఉన్మాద ఉగ్రవాదులకా? చెప్పండి. ముస్లిమేతరులను చంపమని ఖురాన్ చెబుతున్నదే నిజమైతే ముస్లిమేతరుల కోసం వేలకొద్ది ముస్లిములు తమ ప్రాణాలను అర్పించటం సాధ్యమేనా? 1000 సం. ముస్లిములు పాలించిన చరిత్ర భారత దేశానికి ఉంది అయినప్పటికీ 80% హిందువులు ఉన్న దేశంలో ఈ రోజుకూ ముస్లిముల సంఖ్య 14.7% మించి లేదు! విశ్వాసులపై, ధర్మంపై కాలు దువ్వి యుద్ధానికి తెగబడే దుర్మార్గులను చంపమని భగవద్గీత, వేదం, బైబిల్లోనూ ఉంది. అంటే ఈ గ్రంధాలన్నీ ఉగ్రవాదం చెయ్యమంటున్నాయని కాదుగా! అన్యాయంగా చంపమని ఏ గ్రంథమూ చెప్పదు. ఒక వ్యక్తి ప్రాణాన్ని అన్యాయంగా తీస్తే సమస్త మానవాళిని చంపినంత పాపమని ఖురాన్ చెబుతుంటే దానికి భిన్నంగా ఇస్లాంను ఉగ్రవాదంతో ముడిపెట్టటం కేవలం అజ్ఞానమే అవుతుంది. నిజానికి ఈరోజు ముస్లిం/అరబిక్ పేర్లు తగిలించుకుని ఉగ్రవాదం చేస్తున్నోల్లు ప్రపంచ ముస్లిం జనాభాతో పోల్చుకుంటే 1% కూడా ఉండరేమో దానికి 99% ముస్లిములను దొషులుగా నిలబెట్టటం, ప్రపంచంలో జరిగే ఘోరమైన దౌర్జన్యాలను ఉగ్రవాదంగా చూపకపోవటం మీడియా ఆడే నాటకం మాత్రమే! ఇస్లాం అంటే “శాంతి” దీనిని మీడియా టెర్రరిజంతో ముడిపెట్టి ఇస్లామిక్ టెర్రరిజం అనే వింత పదాన్ని కనిపెట్టింది దీనిని అనువదిస్తే శాంతి ఉగ్రవాదం అని చెప్పాల్సి ఉంటుంది. ఇంతకంటే బహుశా హాస్యాస్పదమైన పదం బహుశా భూమిమీద ఉండదేమో!
————–
అసలైన ఉగ్రవాదం ఏమిటంటే ఏ వర్గంలోనైనా ఒక శాతం మూర్ఖులు చేసే ఉగ్రవాదాన్ని దానితో సంబంధంలేని తొంభై తొమ్మిది శాతం మంది సామాన్యులకు ఆ ఉగ్రవాదాన్ని ఆపాదించటం! ఈ రోజు ఇస్లామోఫోబిక్కులు చేస్తున్న పని అదే. దీని కారణంగా నాతో పైన వాదించిన నా మిత్రుడికే కాదు అనేక మందిలో పై అపార్థాలు ఇస్లాం పట్ల పేరుకుపోయాయి. కాబట్టి ఇస్లామోఫోబియా పెంచుకోవాలంటే గాసిప్పుల్లో ఇస్లాంను వినాలి ఇస్లామోఫోబియా వదిలించుకోవాలంటే ఖురాన్లో ఇస్లాంను చూడాలి. లేదంటే ఇస్లామోఫోబియా అనే వింత వ్యాధితో బాధపడుతూ ఇస్లాంను విమర్శిస్తూనే కాలం వెళ్లదీయటం తప్పదు.
“ఉగ్రవాదం” అంటే…? ఉగ్రవాదం ముస్లిములే చేస్తున్నారా?
