ముస్లిములంతా ఉగ్రవాదులు కారు! కానీ ఉగ్రవాదులంతా ముస్లిములేనా?

గోమాత పేరుతో ముస్లిములను చంపేసినా, గుజరాత్ అల్లర్లలో ముస్లిములను తెగనరికినా, మక్కా మసీదులో బాంబులు పెట్టి మారణహోమం సృష్టించినా దానిని మీడియా “హిందూ టెర్రరిజం” అని చెప్పలేదు!

అమెరికా ఇరాక్, ఆఫ్గనిస్థాన్ల పై బాంబులు విసిరి కొన్ని లక్షల మంది అమాయక ప్రజలను చంపేసినా దానిని మీడియా “అమెరికా చేసిన” యుద్ధం అంటుందే తప్ప “క్రైస్తవ ఉగ్రవాదం” అని చెప్పలేదు.

పాలస్తీనా, గాజా, సిరియాలపై యూదులు సాగించిన మారణహోమాన్ని మీడియా అఫీషియల్ గా ఇశ్రాయేలు సాగించిన పోరాటం అంటుందే తప్ప దానిని “యూద టెర్రరిజం” అనలేదు!

వేలకొలదీ రోహింగ్యా ముస్లిములను దారుణంగా చంపినప్పుడు “బుద్దిస్ట్ టెర్రరరిజం” అన్న పేరూ వినపడలేదు! కానీ కొన్ని అమెరికా, యూరప్, ఇస్రాయీల్ పెంపుడు కుక్కలైన కొందరు ముస్లిముల పేర్లు పెట్టుకుని, ముస్లిం వేషాలు ధరించి తీవ్రవాదం చేస్తున్న కారణంగా ప్రపంచంలో ఏ మూల ఉగ్రవాద చర్య జరిగినా, మరుక్షణమే “మీడియా” “ఇస్లామిక్ టెర్రరిజం” అన్న ఓ విచిత్రమైన పదాన్ని పరిచయం చేస్తూ, “జిహాద్” అంటే ఉగ్రవాదం అన్న రీతిలో క్రొత్త అర్థాలను ఇస్తూ ఉంటుంది.

“శాంతి ఉగ్రవాదం” కూడా ఉంటుందా?

“ఇస్లాం” అన్నపదానికి “శాంతి” అన్న అర్థం సైతం తెలియని మీడియా “శాంతి ఉగ్రవాదం” అన్న పదాన్ని కనిపెట్టటానికి మించిన ఆశ్చర్యకరమైన విషయం మరొకటి ఏముంటుంది చెప్పండి? ఒక్క మాటలో చెప్పాలంటే సమాజంలో “అహింస” “అశాంతిని” నిర్మూలించటానికి ఇస్లాం చెయ్యమంటున్న కృషి పేరే జిహాద్ అంటే! జిహాద్ లక్ష్యం సమాజంలో శాంతిని స్థాపించటం మాత్రమే! చివరకు ఒక మనిషి తన మనసులో మెదిలే చెడు ప్రేరణలనతో పోరాడటం కూడా ఇస్లాం పేర్కొంటున్న జిహాదే! ఈ విషయం తెలియని అధిక శాతం సామాన్య ప్రజలు నేడు మీడియా ఏదైతే “ఇస్లామిక్ టెర్రరిజం” అనే క్రొత్త పదాన్ని కనిపెట్టి, ఏదైతే ప్రజలకు చూపుతుందో అదే జిహాద్ అన్న అపార్థాంలో ఉన్నారనటం అతిశయోక్తి కాదు.

మీడియా కనిపెట్టిన “ఇస్లామిక్ టెర్రరిజం” అనే వింత పదాన్ని వినే సామాన్య ప్రజలు మటుకు పాపం ఇస్లాం టెర్రరిజాన్ని ప్రేరేపిస్తుందన్న అపోహకు గురైపోతుంటారు! కొందరికి ఆ అపోహ బాగా తలకెక్కి సోషల్ మీడియాలో “ముస్లిములంతా ఉగ్రవాదులు కారు! కానీ ఉగ్రవాదులందరూ ముస్లిములే!” అంటూ చవకబారు మాటలు మాట్లాడుతుంటారు.

జిహాద్ అన్న పదానికి అసలు అర్థం ఏమిటి?

“జిహాద్” అంటే “టెర్రరిజం!” ఇదీ నేటి మీడియా మాయలో చిక్కుకున్న అధికశాతం మంది చేస్తున్న విమర్శ! “జిహాద్” అన్నది జ.హ.దా. అన్న పదం నుండి ఏర్పడింది. దాని అర్థం- “శ్రమించటం” “కృషి చెయ్యటం” అని. తప్ప భయభ్రాంతులకు గురిచెయ్యటం అని కాదు! ఖురాన్ చెడును మారణాయుధాలతో కాదు “నీవు చెడును శ్రేష్ఠమైన మంచి ద్వారా తొలగించు” (41:34) అని చెబుతుంది. ప్రవక్త ముహమ్మద్(స) చెయ్యమంటున్న జిహాద్ ఏమిటో ఒకసారి చదవండి.

“ఏ వ్యక్తి అయితే దైవం కొరకు తన హృదయంలో మెదిలే చెడులతో పోరాడతాడో అతడే వాస్తవంగా జిహాద్ చేసిన వాడు” – (సహీహ్, ఇబ్నె హిబ్బన్ 4862)

పై ప్రవక్త ప్రవచనం చదివిన తరువాత “జిహాద్” అంటే చెడు తలంపులతో, మనసుతో మనిషి చేసే అంతర్గత పోరాటం అని తెలుస్తుంది. పొరుగువాడు (అతను హిందువైనా, క్రైస్తవుడైన ఏ వర్గానికి చెందిన వాడైనా) ఆకలిగా ఉండి తాను మాత్రమే కడుపునిండా భుజించేవాడు అసలు విశ్వసే కాదన్నారు మహా ప్రవక్త ముహమ్మద్ (స) అలాంటి ఉన్నత సోదరభావాన్ని బోధించిన వ్యక్తి తోటిసోదరులు అవిశ్వాసులైతే వారిని నిర్దాక్షనీయంగా చంపేయమని చెప్పగలడా?

ఇక కొన్ని వాక్యాలు చూపి ఖురాన్ అవిశ్వాసులను చంపేయమంటుందని బురదజల్లే ప్రయత్నాలు చేసేవారు తెలుసుకోవలసింది- అలాంటి ఆదేశాలు నిజానికి భగవద్గీత, బైబిళ్లలో కోకొల్లలుగా ఉన్నాయన్నది. కాబట్టి భగవద్గీత, బైబిళ్లు ఉగ్రవాదం బోధిస్తున్నాయని అనుకోవచ్చా? వాస్తవానికి అప్పట్లో ప్రవక్త ముహమ్మద్ (స) వారి కాలంలో జరిగిన యుద్ధాలు కేవలం ధర్మాన్ని అణచటానికి శత్రువులు కాలు దువ్వినప్పుడు దైవధర్మ రక్షణకు చేసిన యుద్ధాలే తప్ప తమతఫున అమాయకులపై చేసిన అన్యాయపు యుద్ధాలు ఎంతమాత్రం కావు!

ముస్లిమేతరుల పట్ల ప్రవక్త ముహమ్మద్ (స) దౌర్జన్యం చెయ్యమని చెబుతున్నారా?

“జాగ్రత్త! ఎవరైతే ముస్లిమేతరుల పట్ల క్రూరంగా కఠినంగా ప్రవర్తిస్తారో వారి హక్కులను కాజేస్తారో వారిపై అధిక భారం మోపుతారో వారిని దోచుకుంటారో అలాంటి వారి గురించి ప్రళయ దినాన నేనే స్వయంగా దేవుని వద్ద ఫిర్యాదు చేస్తాను” – ప్రవక్త ముహమ్మద్ (స)

ఇదీ ముస్లిమేతరుల విషయంలో ప్రవక్త ముహమ్మద్ (స) ఇచ్చిన ఆదేశం! వాస్తవం ఇదైనప్పుడు, అవిశ్వాసులను చంపటం ద్వారా స్వర్గం ప్రాప్తిస్తుంది అంటూ ఉన్మాదపు మాటలు చెబుతూ ముస్లిం వేషాలు ధరించి మారణ హోమాన్ని సృష్టిస్తున్న ఉగ్రవాదులు ప్రవక్త ముహమ్మద్ (స) అనుచరులు లేక ముస్లిములు ఎలా కాగలరు?

పైగా ఖురాన్ చెబుతున్నదేమిటంటే-

“హత్యకు బదులు హత్యగానీ లేదా కల్లోలాన్ని వ్యాపింపజేసినందుకు గానీ కాక, మరే కారణం వల్లనైనా ఒక మానవుణ్ణి చంపినవాడు సమస్త మానవులను చంపినట్లే. ఒక మానవుడి ప్రాణాన్ని కాపాడిన వాడు మొత్తం మానవుల ప్రాణాలను కాపాడినట్లే” – ఖురాన్ 5:32

“ఏ కారణం వల్లనైనా ఒక మానవుణ్ణి చంపినవాడు సమస్త మానవులను చంపినట్లే” అని ఖురాన్ చెబుతుంది తప్ప “ఒక ముస్లింను కాపాడిన వాడు” అని చెప్పటం లేదు! అటువంటప్పుడు ఖురాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంది, జిహాద్ పేరుతో ముస్లిమేతరులను చంపమంటుంది అన్న నేటి కొందరు లేవనెత్తుతున్న నినాదాలు అర్థరహితం కాదా?

ఉగ్రవాదం చేస్తున్నది ముస్లిములే కదా!

“మసూద్ అజ్ హర్” “ఆదిల్ అహ్మద్” “ముహమ్మద్ ఆతిఫ్” “అబ్దుల్ రషీద్” “అబు ముహమ్మద్ అల్ జులని” వగైరా ముస్లిం పేర్లు తగిలించుకుని తీవ్రవాదం చేస్తున్న కొందరు “పగటి వేషగాళ్లను” చూడగానే వారంతా ముస్లిములే కదా! స్వచ్చమైన ముస్లిం పేర్లు పెట్టుకున్నారు! గెడ్డం టోపీలు పెట్టుకున్నారు! అల్లాహ్, జన్నత్ అంటున్నారు! అలాంటోల్లంతా ముస్లిములు కాకపోవటం ఏమిటి? ఇస్లాంకు సంబంధం లేకపోవటం ఏమిటి? అన్నది ప్రస్తుతం చాలా మంది చేసే వాదన! కొందరైతే కాస్త అఫీషియల్ “ముస్లిములంతా ఉగ్రవాదులు అని మేము అనటం లేదు కానీ ఖురాన్ లో ఉన్న కొన్ని లోపాలను, ఉగ్రవాదం ప్రోత్సహించే విధంగా ఉన్న కొన్ని వాక్యాలను ఆసరాగా చేసుకుని మటుకు ఉగ్రవాదం చేసేవారంతా ముస్లిములే!” అని చిలక పలుకులు పలుకుతూ ఉంటారు.

ముస్లిములు అంటే ఎవరు?

“ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికీ, వారి సంస్కరణకూ రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే (ముస్లిములే). మీరు మంచి చేయండి అని ఆజ్ఞాపిస్తారు. చెడు నుండి ఆపుతారు. ఆల్లాహ్ ను విశ్వసిస్తారు” – 3:110

పై ఖుర్ఆన్ వాక్యాన్ని బట్టి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికీ, వారి సంస్కరణకూ రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం – ముస్లిములు తప్ప ప్రపంచ ప్రజలను చంపేవారు కాదు! ఒకవేళ ఎవరైనా ముస్లిం పేర్లు తగిలించుకుని వారి నియామక ఉద్దేశానికి వ్యతిరేకంగా ప్రపంచ మానవులను చంపే పనిలో పడితే వారు ముస్లిములు ఎలా కాగలరు? ఉదాహరణకు: చైనా తాను తయారుచేసే కొన్ని డూప్లికేట్ ఎలక్రానిక్ వస్తువులకు “సోనీ” అన్న పేరు తగిలించినంత మాత్రానా అది ఒరిజినల్ (అసలైన) జపాన్ కు చెందిన “సోనీ” కంపెనీ వస్తువులుగా మనం ఎంచలేము కదా! ముస్లిం పేర్లు తగిలించుకుని ఉగ్రవాదం చేస్తున్న దుర్మాగులైన ఈ డూప్లికేట్ ముస్లిముల పరిస్థితీ అంతే!

ముందుగా “ఉగ్రవాదం చేస్తున్నది ముస్లిములే కదా! వంటి వాదన చేసేవారు విశ్లేషణ చేసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే…

# “యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ ఇంటెలిజన్స్ ఏజెన్సీ” ఇండియాలో ఉన్న ప్రధాన హిందూ సంస్థలైన “భజరంగ్ దళ్” “VHP (విశ్వహిందూ పరిషద్)” సంస్థలను “ఉగ్రవాద సంస్థలు”గా గుర్తించింది! కాబట్టి హిందువులంతా ఉగ్రవాదులు కారుగానీ, ఉగ్రవాదులంతా హిందువులే అంటే న్యాయంగా ఉంటుందా?

# గుజరాత్ మారణకాండలో దాదాపు రెండు వేలమంది ముస్లిములను హిందువులు అతిదారుణంగా చంపేశారన్నది అందరికీ తెలిసిందే! కాబట్టి హిందువులంతా ఉగ్రవాదులు కారుగానీ, ఉగ్రవాదులంతా హిందువులే అంటే న్యాయంగా ఉంటుందా?

# మక్కా మసీదులో బాంబు పేల్చింది హిందుత్వ ఉగ్రవాదులైన “స్వామీ ఆసిమానందా, దేవేంద్ర గుప్తా, లోకేశ్ శర్మ తదితరులు అని కోర్టు తేల్చింది. కాబట్టి హిందువులంతా ఉగ్రవాదులు కారుగానీ, ఉగ్రవాదులంతా హిందువులే అంటే న్యాయంగా ఉంటుందా?

# “గొరక్షక్ దళ్” చేసిన దాడుల నుండి, మొన్నామధ్య గుడిలో పెట్టి ఆసిఫాను సామూహిక అత్యాచారం చేసిన సంఘటనల వరకు హిందుత్వ వాదుల చేతుల్లో అనేకమంది చనిపోయారు! దీనినే “కాషాయ ఉగ్రవాదం (Saffron Terrorism)” అని అంటారు. కాబట్టి హిందువులంతా ఉగ్రవాదులు కారుగానీ, ఉగ్రవాదులంతా హిందువులే అంటే న్యాయంగా ఉంటుందా?

# పైగా ఈ దాడులన్నిటికీ కారణం “భగవద్గీతలో యుద్ధం చెయ్యమనే ఆజ్ఞలు ఉన్నాయి” కనుకనే “కాషాయ ఉగ్రవాదం” లేక “హిందుత్వ ఉగ్రవాదం” ఉనికిలోనికి వచ్చింది కాబట్టి హిందువులంతా ఉగ్రవాదులనో, ఉగ్రవాదులంతా హిందువులనో అనగలమా?

# అలాగే మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల్లో పాల్గొని కోట్లాది మందిని పొట్టనపెట్టుకున్నది 99% క్రైస్తవ దేశాలే! హీరోషిమా-నాగసాకి మారణ హోమం నుండి మొదలుకుని ఇరాక్, ఆఫ్గనిస్థాన్ల పై బాంబులు విసిరి కొన్ని లక్షల మంది అమాయక ప్రజలను చంపేసింది క్రైస్తవ దేశమైన అమెరికానే! చంపింది “క్రైస్తవ మతస్తులు!” కాబట్టి క్రైస్తవులంతా ఉగ్రవాదులు కారుగానీ, ఉగ్రవాదులంతా క్రైస్తవులే అంటే న్యాయంగా ఉంటుందా?

# పాలస్తీనా, గాజా, సిరియాలపై యూదులు సాగించిన మారణహోమంలో లక్షల మంది అమాయక ప్రజలు చనిపోయారు! కాబట్టి యూదులంతా ఉగ్రవాదులు కారుగానీ, ఉగ్రవాదులంతా యూదులే అంటే న్యాయంగా ఉంటుందా?

# పైగా ఈ దాడులన్నిటికీ కారణం “బైబిల్లో యుద్ధం చెయ్యమనే ఆజ్ఞలు కోకొల్లలుగా ఉన్నాయి” కనుకనే “క్రైస్తవ ఉగ్రవాదం” మరియు “యూద ఉగ్రవాదం” పేట్రేగిపోతుంది! కాబట్టి యూదులు-క్రైస్తవులంతా ఉగ్రవాదులు కారుగానీ, ఉగ్రవాదులంతా యూదులు మరియు క్రైస్తవులే అంటే న్యాయంగా ఉంటుందా?

# వేలకొద్దీ రోహింగ్యా ముస్లిములను దారుణంగా చంపటాన్ని ప్రపంచం మొత్తం చూసింది. కాబట్టి బుద్ధిస్టులంతా ఉగ్రవాదులు కారుగానీ, ఉగ్రవాదులంతా బుద్ధిస్టులే అంటే న్యాయంగా ఉంటుందా?

అసలు ట్విన్ టవర్స్ పై దాడులు చేసింది ముస్లిములే కాదని, దానికి పరోక్ష కారకుడు స్వయంగా జార్జ్ బుష్ అని, ఆరోజు ట్విన్ టవర్స్ లో పనిచేసే దాదాపు మూడువేల మంది యూదులు సెలవు మీద ఉన్నారని, చచ్చింది మటుకు క్రైస్తవులని అసలు వాస్తవాలు అమెరికా యూనివర్సిటీ ప్రొఫెసర్లు, సైంటిస్టులూ ఆధారాలతో సహా నిరూపించారు. ఇంతకు మించిన ఉగ్రవాదం ఇంకేముంటుంది? కానీ, ఈ దారుణానికి మీడియా పెట్టిన పేరు “ఇస్లామిక్ టెర్రరిజం”! తమకు శత్రు దేశమైన సోవియట్ రష్యాకు పోరాడే ఆఫ్ఘనిస్తానీయులకు ఆయుధాలను, డబ్బును సరఫరా చేస్తూ “అల్-ఖైదా”ను తయారు చేసిందే అమెరికా గూఢచారి సంస్థ CIA. తప్ప అది ముస్లిం ఉగ్రవాద సంస్థా కాదు! దానిని ముస్లిములూ స్థాపించలేదు. అసలు అల్-ఖైదా అన్న పేరుమీద ఇస్లామీ సైన్యం గానీ, టెర్రరిస్ట్ సంస్థ గానీ లేనే లేదు! అది కేవలం బుష్ ప్రభూత్వం తయారుచేసిన ఒక వ్యవస్థ మాత్రమే! 1979 ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ లో సోవియట్ రష్యాకు వ్యతిరేకంగా పోరాడే ఆఫ్ఘానీయులకు అమెరికా కొన్ని వందల డాలర్ల డబ్బును వెచ్చించి అక్కడ ఉన్న ముస్లిములను వాడుకుంది. అందులో ఒకడే ఒసామా బిన్ లాడెన్. ఈ విధంగా అమెరికా తయారుచేసిందే అల్-ఖైదా! ఈ విధంగా అల్-ఖైదా నుండి ఈ మధ్య తయారైన ISIS మరియు పాకిస్తాన్ లో తయారైన ఉగ్రవాదుల వరకు కేవలం ఉగ్రవాదాన్ని తయారుచేస్తుంది క్రైస్తవ దేశమైన అమెరికా, కానీ మత దురభిమానంతో ఇస్లాంను అవమానపరుస్తూ వస్తుంది. ఇది “క్రైస్తవ ఉగ్రవాదం” కాదంటారా?

ఇలాంటి విషయాలేమీ తెలుసుకోకుండా, చరిత్రకు సంబంధించిన జ్ఞానం, ఇస్లాం-ఖురాన్ ల సందేశం యొక్క లోతైన అవగాహన లేకుండానే అంతా తమకే తెలిసినట్లు కొందరు అతి తెలివైన అమాయకులు “ముస్లిములంతా ఉగ్రవాదులు కారు! కానీ ఉగ్రవాదులంతా ముస్లిములే!” వంటి చిలక పలుకులు పలకటం ఎంత అర్థరహితమో కదా! కాబట్టి మీడియా సృష్టించిన “ఇస్లామిక్ టెర్రరిజం” అనే తెలివితక్కువ అర్థరహితమైన పదాన్ని పట్టుకుని ఇస్లాంను, ముస్లిములను ఉగ్రవాదంతో ముడిపెట్టటం, ఇస్లాంను ప్రజలకు ఒక బూచిగా చూపి తమ మత రాజకీలకు వాడుకోవటం, ఇస్లాంను కించపరచాటానికి వాస్తవాలను వక్రీకరించటం వాస్తవానికి అత్యంత ఘోరమైన ఉగ్రవాదం అవుతుంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *