భార్యతో ఉత్తమ రీతిలో వ్యవహరించాలి

ఇస్లాం, తలిదండ్రుల నుండి బంధువులు, ఇరుగుపొరుగువారు, మిత్రులు, బాటసారుల వరకు ప్రతి ఒక్కరితో ఉదార బుద్ధితో వ్యవహరించమనటమే కాక, ఇంట్లో భార్యతో సైతం ఉత్తమ రీతిలో వ్యవహరించాలని ఆదేశిస్తుంది.

అసలు ఖురాన్ పురుషులకు తమ భార్యలతో వ్యవహరించే విషయంలో చెబుతున్నది ఏమిటంటే: “మీ భార్యలతో సద్భావంతో జీవితం గడపండి. ఒకవేళ మీకు వారు నచ్చకపోతే, బహుశా మీకు ఒక వస్తువు నచ్చకపోవచ్చు కానీ, అందులోనే దేవుడు ఎంతో మేలు పెట్టి ఉండవచ్చు” – ఖుర్ఆన్ 4:19

ఇదీ ఇస్లాం భార్యలతో వ్యవహరించమంటున్న ఉత్తమమైన వైఖరి. స్వయంగా ప్రవక్త ముహమ్మద్- “స్త్రీల పట్ల దయ కలిగి ఉండండి” (అల్-బుఖారి 3153) అని చెప్పటమే కాక… “నిశ్చయంగా స్త్రీలు, పురుషులు సమాన భాగాలు” (తిర్మిజి 113) అని మరొక చోట చెప్పటం జరిగింది.

మరీ ముఖ్యంగా ఖురాన్: “స్త్రీ పురుషులిరువురికీ సమ న్యాయం నిర్ణయించడం జరిగింది” – ఖుర్‌ఆన్‌-2: 178 అని చెబుతుంది. తప్పితే ఎక్కడా వారి విషయంలో ఎలాంటి వివక్షా చూపటం లేదు. ఈ విషయంలో ఖురాన్ చెబుతున్నదేమిటంటే- “పురుషులకు మహిళలపై ఉన్నటువంటి హక్కులే ధర్మం ప్రకారం మహిళలకు కూడా పురుషులపై వున్నాయి (2:228)” అన్నది.  

అలాగే వారే ఉత్తములు అని ప్రవక్త ముహమ్మద్ ప్రకటించటం జరిగింది. ఎవరా ఉత్తములు? అంటే: “మీ స్త్రీల విషయంలో ఉత్తమంగా వ్యవహరించేవారే మీలో ఉత్తములు” (సునన్ ఇబ్నె మజ 1978).

అంతేకాదు ప్రవక్త ముహమ్మద్  1400 సం.లకు పూర్వమే పురుషులతో పాటు స్త్రీలకు కూడా  సమాన హక్కుల కల్పించటం జరిగింది. ఈ విషయానికి పాశ్చాత్య చరిత్ర కారులే సాక్ష్యామిచ్చారు. “స్త్రీ హక్కులను సాధించిన గొప్ప విజేతగా ముహమ్మద్ తప్ప బహుశా ప్రపంచం ఎవరినీ చూడలేదు” – Pierre Crabites (1877-1943)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *