అశ్లీలం దరిదాపులకు కూడా పోకూడదు

ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలలో అత్యంత గమనార్హమైన విషయం ఏమిటంటే… ఇస్లాం కేవలం అశ్లీలపు పనులు చెయ్యకండి అని మాత్రమే చెప్పి ఊరుకోవటం లేదు. కానీ, అసలు అశ్లీల విషయాల దరిదాపులకు కూడా పోకండి అని చెబుతుంది, పైగా అవి బహిరంగమైనవైనా సరే లేదా గోప్యమైనవైనా సరే.

అలాగే ఖురాన్ లో మరొక చోట “వ్యభిచారం దరిదాపులకు కూడా పోకండి (17:32)” అని హెచ్చరించటం జరిగింది. “దరిదాపులకు కూడా పోకూడదు” అంటే అశ్లీల పనులకు, వ్యభిచారానికి పాల్పడటానికి ప్రేరేపించే విషయాల దరిదాపులకు కూడా పోకూడదన్నది ఈ వాక్యాల అంతరార్థం.  

ఏ సమాజంలోనైతే వెకిలితనం, హింస, అశ్లీలం వంటివి సామాన్య వినోదపు అంశాలుగా మారిపోతాయో అలాంటి సమాజం వినాశనానికి అతి దగ్గరలో  ఉన్నట్టే లెక్క. నేడు ప్రజల్లో వీటిని సర్వసామాన్యం చేసి సమాజాన్ని నాశనం చేసే బాధ్యతను సినిమాలు, సోషల్ మీడియా తీసుకున్నాయి.

కానీ పద్నాలుగు వందల ఏళ్ల క్రితమే ఖురాన్ “పురుషులకు తమ చూపులను కాపాడుకోండి అని (24:30) అలాగే స్త్రీలు సైతం తమ చూపులను కాపాడుకోవాలని (24:31), అంతేకాక, స్త్రీలు పూర్తి శరీరం కప్పబడేలా దుప్పట్టా వేసుకోవాలని (33:59) ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కానీ నేడు సినిమా, సోషల్ మీడియాల ద్వారా సమాజంలో నగ్నత్వం, అశ్లీల్లత సర్వసామాన్యమైపోయిన ఫలితంగా అణకువగా నడుచుకునే స్త్రీలు సైతం అత్యాచారాలకు, లైంగిక వేధింపులకు గురవుతున్నారు. “మాతృ దేవోభవ” అన్న దృక్పథాన్ని నేర్పే భారతదేశంలోనే NRCB డేటా ప్రకారం ప్రతీ ఆరు నిమిషాలకు ఒక రేప్ జరుగుతుందని ఒక నివేదికలో తెలిపింది. సమాజం ఇలాంటి దారుణమైన స్థితికి దిగజారటానికి కారణం అశ్లీలం, వ్యభిచారం అన్నవి మీడియా ద్వారా అతి సాధారణ అంశాలుగా మారిపోవటమే. అందుకే ఇస్లాం అశ్లీలం, వ్యభిచారాన్నీ ప్రేరేపించే విషయాల దరిదాపులకు సైతం పోకూడదని హెచ్చరించటం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *