చెడు ఆలోచనలతో జిహాద్ చెయ్యాలి

ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలలో మరొక ప్రధాన అంశం మనిషి నిరంతరమూ తన హృదయంలో మెదిలే చెడు ఆలోచనతో పోరాడటానికి తీవ్ర కృషి చేస్తూ ఉండాలన్నది. ఇదే వాస్తవానికి ఇస్లాం చెయ్యమంటున్న నిజమైన జిహాద్. 

కొందరు సోకాల్డ్ ముస్లిములు చేసే తీవ్రవాద కార్యకలాపాలకు మీడియా ఇస్లామిక్ జిహాద్ అన్న పేరు తగిలించటం వల్ల చాలా మంది జిహాద్ అంటే తీవ్రవాదం, టెర్రరిజం అని అపార్థం చేసుకునే వరకు వెళ్ళిపోయారు. ఇది ఒకరకంగా “జిహాద్” పదం యొక్క “దుర్వినియోగం (Misuse)” అని చెప్పాలి. నిజానికి “మనిషి చెడు తలంపులతో పోరాడటం, చెడు నిర్మూలనకు చేసే ప్రయత్నమే “ఇస్లామిక్ జిహాద్” అంటే.

పూర్తి ఖురాన్ లో “జిహాద్” అనే పదం కేవలం నాలుగు సార్లు కనపడుతుంది. ఆ నాలుగు సందర్భాల్లోనూ “తీవ్రమైన కృషి” “ప్రయత్నం” అణచివేతకు, అన్యాయానికి వ్యతిరేకంగా చేసే “ధర్మపోరాటం” అన్న అర్థాల్లోనే తప్పా ఎక్కడా కూడా ఈ పదం “ఉగ్రవాదం” లేదా “తీవ్రవాదం” అన్న అర్థాలలో వాడబడలేదు.  ఏ వ్యక్తి అయితే దైవం కొరకు తన హృదయంలో మెదిలే చెడులతో పోరాడతాడో అతడే వాస్తవంగా జిహాద్ చేసిన వాడు” [సహీహ్, ఇబ్నె హిబ్బన్ 486] అంటున్నారు ప్రవక్త ముహమ్మద్. ముఖ్యంగా ఖురాన్ చెడును “మారణాయుధాలతో తొలగించమనటం లేదు” కానీ… “నీవు చెడును శ్రేష్ఠమైన మంచి ద్వారా తొలగించు” (41:34) అని చెబుతుంది. ‘జిహాద్’ లక్ష్యం నిర్మాణం కొరకే తప్ప.. విచ్చిన్నానికి కాదు! ఓ విద్యార్థి తన సామర్థ్యాలను పెంపొందించుకోవటం కోసం శ్రమించటం జిహాద్.. కఠిన సమయాల్లో నవ్వగలగటం, కష్టాల్లో సహనంగా ఉండగలటం జిహాద్.. హృదయంలో మెదిలే చెడులతో పోరాడటం జిహాద్.. వృద్ధ తలిదండ్రులను అప్యాయతతో చూసుకోవటం జిహాద్.. ప్రజలను నిజాయితీతో పాలించటం జిహాద్.. చెడు రూపుమాపి శాంతిస్థాపనకు కృషి చెయ్యటం జిహాద్.. జాతి జనుల కోసం అవసరమైతే ఆత్మబలిదానం ఇవ్వటం జిహాద్… తప్పితే జిహాద్ లక్ష్యం హింసను ప్రేరేపించటం కాదు

One thought on “చెడు ఆలోచనలతో జిహాద్ చెయ్యాలి”
  1. చాలా బాగా రాసారు మీరు بارك الله فيك

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *