దైవేతరులను దూషించకూడదు

ప్రజలు వేడుకునే దైవేతరులను ఎట్టి పరిస్థితుల్లోనూ దూషించకూడదనేది ఇస్లాం ఆదేశం.

నిజానికి సమస్త విశ్వానికి సృష్టికర్త ఒక్కడే అయినప్పటికీ ప్రజలు సృష్టిలో అనేక వాటిని దైవాలుగా భావించి వేడుకుంటూ ఉంటారు. కల్పించుకున్న దైవాలను దూషిస్తే ప్రజలు నిజ సృష్టికర్తను దూశిస్తారని ఇస్లాం హెచ్చరిస్తుంది.

నేడు చాలా మందిలో ఉన్న ఒక అపోహ ఏమిటంటే… ఖురాన్ “అల్లాహ్ ను నమ్మని వారిని చంపేయమంటుంది” అన్నది. కానీ ఖురాన్, కనీసం ప్రజలు వేడుకుంటున్న దైవేతరులనే దూషించవద్దని ఆజ్ఞాపిస్తుంది.

అంతే కాదు ఒకవేళ ప్రజలకు నిజ దైవాన్ని గురించి చెప్పాల్సివస్తే… వారికి “వివేకంతో, చక్కని హితబోధతో, ఉత్తమోత్తమమైన రీతిలో అవగాహనపరచమని (16:125)” ఖురాన్ ఆదేశిస్తుంది. కాబట్టి ముఖ్యంగా విశ్వాసులు ప్రజలు దైవాలుగా భావించి ఆరాధించే పుణ్యపురుషులను గానీ, మహనీయులను గానీ, లేదా ఎవరినైనా దూషించకూడదు. వీలైతే ఆ మహనీయులు సైతం తమ తమ కాలాల్లో ప్రజలకు నిజ సృష్టికర్తను పరిచయం చెయ్యటానికి వచ్చిన రుషిశ్వరులన్న విషయాన్ని తెలియజేసి సృష్టికర్త ఒక్కడే అన్నది స్పష్టపరచాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *