యూదుల పట్ల ఆదిమ క్రైసవులకు ద్వేషం దేనికి..?

“నాయనా! తండ్రీ ఇశ్రాయేలు దేశమును ఖాపాడును గాక”…

“స్వదేశములో తిరిగి వారికి రాజ్యమును ప్రసాదించు గాక”…

“ఇశ్రాయేలు దేశముపై దేవుడు దయ చూపును గాక”…

ఆగండి… ఆగండి…

కాస్సేపు ఇక్కడ! మీరు చేసే ఈ రకమైన ప్రార్ధనలు ఆపండి!

…..

‘ఆదిమ క్రైస్తవులు’ అంటే ‘యేసు ఉండగా ఆయన ద్వారా తర్ఫీదు పొందిన నాటి ఆదిమ అపోస్తలులు, వారి అనుచరులు’ చర్చీల్లో ఇప్పటి క్రైస్తవుల మాదిరిగా యూదుల బాగు కోసం, వారి రాజ్యస్థాపన కోసం ఇలాంటి కన్నీటి ప్రార్ధనలు చేసి గుండెలు బాదుకునేవారు కాదు! ఈ విషయం మీకు తెలుశా..???

తమ నాయకుడిపై లేనిపోని అభాండాలు వేసి, రోమన్ గవర్నమెంట్ పై ఒత్తిడి తెచ్చి అన్యాయంగా సిలువ శిక్షకు గురిచేసి “హత్య” చేశారన్న ఆక్రోశంతో రగిలిపోయేవారు ఆనాటి క్రైస్తవులు.

యూదులు ఇశ్రాయేలులో చేస్తూ వచ్చిన హత్యలకు ప్రతీకారంతో వారిపట్ల బహిరంగంగానే ఆనాటి క్రైస్తవులు ఇస్తున్న కొన్ని స్టేట్మెంట్స్ ఈనాటికీ పరిశుద్ద బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. కాస్త, ఒకసారి ఓపిగ్గా చదవండి…

“మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపక యుండిరి? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపినవారిని చంపిరి. యేసును మీరు ఇప్పుడు హత్యచేసిన వారైతిరి” – అపోస్తలుల కార్యములు 7:51-53

గత ప్రవక్తలను హత్య చేస్తూ వారవటమే కాదు, చివరకు మీ వద్దకు వచ్చిన యేసును కూడా మీరు అన్యాయంగా “హత్య” చేశారు కదరా! అంటూ రగిలిపోయేవారు.

“ఆయనను యూదులు మ్రానున వ్రేలాడదీసి చంపితిరి” -అపోస్తలుల కార్యములు 10:39-40

“యూదులు జీవాధిపతిని చంపితిరి” – అపోస్తలుల కార్యములు 3:14

ఈ విధంగా ఆనాడు యూదుల్లో దుర్మార్గులు చేసిన క్రైమ్ ను పబ్లిగ్గానే ఎండగట్టేవారు. ఇక యూదుల క్రూరత్వాన్ని బయటపెడుతూ ఆదిమ క్రైస్తవులు ఇస్తున్న ఓపెన్ స్టేట్మెంట్ ఈ క్రింది చదవాల్సిందే!

“ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును, ప్రవక్తలను చంపి, మమ్మును హింసించి, అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాటలాడకుండా మమ్మును ఆటంకపరచుచు, దేవునికి ఇష్టులు కాని వారును మనుష్యులందరికీ విరోద్ధులై యున్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట యూదుల మీదికి వచ్చెను” – 1 థెస్సలోనికయులకు 2:15-16

ఈ విధంగా ఆనాటి ఆదిమ క్రైస్తవులు యూదుల క్రూరత్వాన్ని బహిరంగంగానే ఎండగట్టటంతో యూదుల్లో ఓ రకమైన భయం పట్టుకుంది. వీళ్లు ఇలాగే బోధిస్తూ తిరిగితే కొన్నాళ్లకు ప్రపంచ ప్రజల దృష్టిలో యేసును చంపిన హంతకులుగా మిగిలిపోతామన్న భయం పట్టుకుని యూదులు ఆనాటి క్రైస్తవులకు ఏ రకంగా వార్నింగ్ ఇస్తున్నారో చదవండి.

“మీరీ యేసు నామమును బట్టి బోధించకూడదని మీకు ఖండితముగా ఆజ్ఞాపించలేదా? ఇదిగో యెరుషలేమును మీ బోధతో నింపి యేసు హత్య మా మీదికి తేవలెనని ఉద్దేశిస్తున్నారా” – అపోస్తలుల కార్యములు 5:27,28

ఒకప్రక్క ఆదిమ క్రైస్తవులు పబ్లిక్ లో ఈ యూదులు “మా యేసును హత్య చేశారు, మా జీవాధిపతిని చంపేశారని” బహిరంగంగా చెబుతూ యూదుల్ని ఎదిరిస్తూ ఉండటం, మరోప్రక్క యూదులు అప్పటి క్రైస్తవులకు “యెరుషలేమును మీ బోధతో నింపి యేసు హత్య మా మీదికి తేవలెనని ఉద్దేశిస్తున్నారా” అని వార్నింగులు ఇవ్వటాన్ని బట్టి ఆనాటి క్రైస్తవులు ఏ స్థాయిలో యూదుల పట్ల నిరసన తెలియజేసేవారో, ఏ స్థాయిలో యూదుల పట్ల ద్వేషాన్ని కలిగి ఉండేవారో అర్థమవుతుంది.

ఇక్కడ యేసు ఆనాడు యూదులు విధించిన సిలువ శిక్షలో చనిపోయారా? లేదా? అన్నది పాయింట్ కాదు… కానీ, యూదులు అనేక మంది ప్రవక్తలను చంపుతూ రావటం అదే క్రమంలో యేసును కూడా హత్య చెయ్యటానికి పూనుకోవటంతో…

అప్పటి ఆదిమ క్రైస్తవులు యూదుల్ని “యేసు హంతకులు”గానే గుర్తించి వారిని ప్రతిఘటించేవారే తప్ప వారిని నెత్తిన పెట్టుకుని ఉరేగేవారు కాదు. తరువాత కాలాల్లో యూదులు తమపై ఉన్న “హత్యా” నేరాన్ని చాకచక్యంగా పౌలు పత్రికల ద్వారా యేసు మానవాళి కోసం తనకు తానుగా చేసుకున్న “ఆత్మహత్య”గా చిత్రీకరించటం జరిగింది.

దానికి యేసు తనకు తానుగా సిలువ ఎక్కి చేసుకున్న “ఇష్టపూర్వక బలియాగం” అనే పరిశుద్ధ రంగు పులమటం జరిగింది. దీనికి బైబిలే సాక్ష్యం.

చివరకు ఆనాటి యూదులు హత్యలు చేస్తూ రక్తం కార్చిన ఫలితంగా పరలోకంలో సైతం వారికి రక్తమే ఆహారంగా లభిస్తుందని ప్రకటన గ్రంథం సైతం ప్రకటిస్తుంది.

“పరిశుద్ధుల రక్తమును, ప్రవక్తల రక్తమును వారు (యూదులు) కార్చినందుకు తీర్పు తీర్చి, వారికి రక్తము త్రాగనిచ్చితివి” – ప్రకటన 16:4-6

అలాంటప్పుడు అలాంటి క్రీస్తు విరోధులైన యూదులకు సపోర్ట్ చెయ్యటం, వారి కోసం ప్రార్ధించటం అంటే వారు చేస్తూ వచ్చిన ప్రవక్తల హత్యలలో పాలు పంచుకోవటం అవ్వదా? ఈ విషయాన్ని ఈనాటి క్రైస్తవులు ఆలోచించుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *