హిందువులను కెనడా దేశం వదిలిపోమంటే….

ఎవరో చేసిన తప్పుకు ఓ అల్ప సంఖ్యాక వర్గం మొత్తాన్ని బాధ్యులుగా మార్చి పడేసి ఆ వర్గం మొత్తాన్ని మెజారిటీ స్థాయిలో ఉన్న వర్గానికి చెందినవారు.. దేశం విడిచి ఏ పాకిస్తానుకో పొమ్మని పదే పదే దెప్పిపొడుస్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో అలా అనేవారికే స్వయంగా అలాంటి పరిస్థితిని ఎదుర్కునే వరకు అర్థం కాదు.

ఇప్పుడు కెనడాలో అల్పసంఖ్యాకులుగా ఉన్న హిందువులను దేశం విడిచి మీ భారతదేశానికి పొమ్మంటుంటే అక్కడి హిందువులు “ఇతర మతాల వారు తమ తమ మతాలను స్వతంత్రంగా అనుసరించే హక్కు ఈ దేశంలో ఉన్నప్పుడు హిందువులుగా మాకా హక్కు ఈ దేశంలో ఎందుకుండకూడదు? మతాల మధ్య ద్వేషం ఉండకూడదని, మమ్మల్ని దేశం విడిచి పొమ్మనేకంటే మీరు ప్రభుత్వాన్ని మానవ హక్కులను కాపాడమని, మా స్వంత మతాన్ని రక్షించమని” అభ్యర్ధిస్తూ ట్వీట్లు పెడుతున్నారు.

వ్యక్తుల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య, దేశాల మధ్య సైతం సంబంధ బాంధవ్యాలను కాపాడుకుంటూ ఉన్నంత వరకే సమాజంలో శాంతి నెలకుని ఉంటుంది.

స్వంత వర్గం మెజారిటీ స్థాయిలో ఉన్నంత మాత్రానా అవకాశం ఉంది కదా అని “మీకు మా దేశంతో ఏంటి పని, మీరు ఈ దేశంలో ఎందుకున్నారు, మీరు వేరేదేశాలకు వెళ్లిపోవచ్చు కదా” లాంటి చిల్లర మాటలు చెబుతూ ఉన్మాదం ప్రదర్శించకూడదు. అలాంటి ఉన్మాదం ఎవరు ప్రదర్శించినా అది తప్పే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *