“ది కాశ్మీర్ ఫైల్స్” సినిమాకు “జాతి సమైక్యత” అవార్డు ఇవ్వటం.. “కిల్లర్ వీరప్పన్” సినిమాకు “నోబెల్ శాంతి పురస్కారం” ఇవ్వటం లాంటిదన్నమాట!
ఏ విషయంలో ది కాశ్మీర్ ఫైల్స్ “జాతి సమైక్యం” చేసింది? ముస్లిములకు వ్యతిరేకంగా హిందుత్వవాదాన్ని రెచ్చగొట్టి అతివాద హిందుత్వ మతోన్మాదులను సమైక్యం చెయ్యటం విషయంలోనా?
ముస్లిం సమాజం మొత్తాన్ని ప్రతికూలంగా చూపుతూ, వారిని హిందూ సమాజానికి బద్ద శత్రువులన్నట్టు చిత్రీకరించబడిన అబద్ధాల అల్లిక ఆ సినిమా.
ఆ సినిమా ఆడిన ధియేటర్లలో కొందర్ని ఉన్మాదులుగా మార్చి రెచ్చిపోయి బహిరంగంగానే ముస్లిములకు వ్యతిరేకంగా జనహనన నినాదాలిచ్చేంతగా ఉన్మాదాన్ని ప్రేరేపించిందా సినిమా.
సోషల్ మీడియాలో ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా దౌర్జన్యం చెయ్యల్సిందిగా రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టే ఉన్మాదులను తయారు చేసిందా సినిమా.
అల్పసంఖ్యాకులను శత్రువులుగా చూపుతూ మెజారిటీ వర్గ ప్రజల ఓట్లు సంపాదించటం అన్న పాత నాజీ సూత్రం ఆధారంగా ఎలక్షన్ ముడిసరుకుగా చిత్రీకరించబడిందా సినిమా.
దానికి “జాతి సమైక్యత” అవార్డు ఇవ్వటానికి మించిన కామెడీ ఇంకేముంటుంది? అసలా సినిమాకు ఆ అవార్డు ఇచ్చినవాడికి “ఉత్తమ కమెడీయన్” అవార్డు ఇవ్వాలి.
