అలాంటివి వందల్లో జరుగుతుంటాయి కామనే
ఆ మహిళల నగ్న ఊరేగింపు తాలూకు హేయమైన వీడియో చూసి మానవత్వం ఉన్న సున్నిత మనస్కులు చలించిపోతున్న తరుణంలో…
“అలాంటి సంఘటనలు ఇక్కడ వందల్లో జరుగుతుంటాయి. మాకవన్నీ కామనే అందుకే ఇంటర్నెట్ నిషేధించటం జరిగిందని”
స్వయంగా అక్కడి ముఖ్యమంత్రే నోరు జారి చెప్పటాన్ని బట్టి…
ఆ రాష్ట్రంలో క్రైస్తవ స్త్రీలపై అతివాద హిందుత్వ మెయిటీ వర్గీయులు అత్యాచారాలు, నగ్న ఊరేగింపుల్లాంటి ఘోరాలకు పాల్పడినప్పుడల్లా ఆ సంఘటనలు బయట ప్రపంచానికి తెలియకుండా ఉండటానికి వందల సార్లు ఇంటర్నెట్ ఆఫ్ చేసి పెట్టటం కూడా కామనే అన్న విషయం అర్థమవుతుంది.
అంటే ఈ ఒక్క సంఘటనకే చలించిపోయి కంగారు పడిపోవాల్సిన పనిలేదు ఇలాంటివి వందల్లో జరుగుతుంటాయి వందల సార్లు ఇంటర్నెట్ ఆఫ్ చెయ్యబడుతుంది అంటే ఆ సమాజంలో ఏ స్థాయిలో విశృంఖలత్వం, అనాగరికత పెరిగిపోయిందో అంచనా కట్టవచ్చు.
ఊహించుకోటానికి జుగుప్స కలిగించే అలాంటి ఘోరమైన నేరాలు అలవోకగా వందల సంఖ్యలో జరగటానికి అవకాశం కల్పిస్తుంది ఎవరు?
రోడ్డు మీద మహిళలను నగ్నంగా ఊరేగించుకుంటూ వెళ్లి సామూహిక అత్యాచారాలు చేస్తుంటే అక్కడి పోలీసు, ప్రభుత్వ వ్యవస్థలు ఏం చేస్తున్నట్టు? అలాంటి ఘోరమైన సంఘటనలు ఆపటానికి బదులు ఆ సంఘటనలు బయటకు పొక్కకుండా ఇంటర్నెట్ ఆపెయ్యటమా ఆ రాష్ట్రపు రక్షణ వ్యవస్థల, ప్రభూత్వ వ్యవస్థల పని?
పైగా ఇలాంటి నేపథ్యంలో సైతం కొందరి మతోన్మాద పైత్యం ఆగటం లేదు. ఆ మహిళల నగ్న ఊరేగింపుకు ప్రధాన కారకుడు ముస్లిం అని ఫేక్ ట్విట్లు పెడుతూ చివరకు ఆ సంఘటనకు కూడా హిందూ, ముస్లిం రంగు పులిమేసి శునకానందాన్ని పొందే పనిలో పడ్డారంటే దేశ ప్రజల మెదళ్లలో మతోన్మాదం, అజ్ఞానం ఏ స్థాయిలో ఎక్కించబడుతుందో అంచనా వెయ్యవచ్చు.
ఊహాజనిత కథలతో ‘కేరళ స్టోరీ’ల్లాంటి సినిమాలు తీయటం కాదు… వందల కొద్దీ మహిళల నగ్న ప్రదర్శనలు, అత్యాచారాలు చేయబడుతున్న ఆ రాష్ట్ర వాస్తవ సంఘటనలపై సినిమా తీసే ధైర్యం ఇప్పుడు ఏ ఒక్కడికైనా ఉందా?
