జాతిసమైక్యతకు అందరికీ సమాన చట్టాలు ఉండాలని వాదించే వారు తమ ఈ ఆలోచనను ఆరెస్సెస్ మాజీ సర్సంచాలక్ గురు గోల్వాల్కర్ ఒప్పుకుంటున్నారా? అన్నది గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
యూనిఫాం సివిల్ కోడ్ కు సంబంధించి స్వయంగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఆర్గనైజర్ పత్రికలో 23 ఆగష్టు 1972 లో ప్రచురితమయ్యింది. గురుగోల్వాల్కర్ చెప్పిన మాటలు సంక్షిప్తంగా ఇవి:
“జాతీయ సమైక్యత అనే స్పృహను పెంపొందించడానికి కామన్ సివిల్ కోడ్ అవసరమని నేను భావించడం లేదు. ఇలాంటి శాసనపరమైన సమానత్వానికి జాతీయ సమైక్యతతో ఎలాంటి సంబంధమూ లేదు. భారత దేశం ఎల్లప్పుడు వైవిధ్య భరిత దేశంగానే ఉంది. అయినప్పటికీ దీర్ఘకాలంగా మనం ఒక బలవత్తరమైన, సమైక్యజాతిగా నిలబడి ఉన్నాము. సామరస్యం (Harmony), మరియు సమానత్వం (Uniformity) రెండు వేరు వేరు అంశాలు.
జాతీయ సమైక్యత కోసం మనకు సామరస్యం అవసరం. అంతేకాని సమానత్వం కాదు. భారత సంవిధానంలో కామన్ సివిల్ కోడు అభిలషించే ఒక అధికరణ ఉందన్నమాట నిజమే. అయితే రాజ్యాంగంలో ఉన్నంత మాత్రాన యేదీ వాంఛనీయంగా మారిపోదు కదా.
జాతి సమైక్యతకు భారతదేశంలో ఉన్న అనేక మతాల మధ్య సామరస్యం అవసరం తప్పితే చట్టపరమైన సమానత్వం కాదు అన్నది గురుగోవాల్కర్ భావన కూడా
జాతి సమైక్యతకు అన్ని మతాలకు కలిపి ఒకే చట్టం ఉండాలి అనేవారి భావనను వ్యతిరేకిస్తున్న గురుగోవాల్కర్ మాటలకు నేటి కామన్ సివిల్ కోడ్ సమర్ధకులు విలువిస్తారా?
