ఆ భూభాగం యూదుల స్వంతమా..!?

యూదులు పాలస్తీనాను ఆక్రమించుకోవటం ఏంటి ఆ భూభాగం అసలు ఒకప్పుడు యూదులదే కదా! అన్నది చాలా మంది నుండి లేవనెత్తుతున్న ప్రశ్న. అంతేకాదు, క్రైస్తవులైతే మరీ యూదులు తిరిగి తమ రాజ్యం స్థాపించాలని కన్నీటి ప్రార్థనలు చెయ్యాటమే కాదు “యూదులు తమ స్వంత పవిత్ర భూభాగమైన పాలస్తీనా ప్రాంతాన్ని ఆక్రమించుకోవటమే కరెక్టని” వాదిస్తుంటారు. ఈ సందర్భంలో మనం లోతైన పరిశీలన చెయ్యాల్సింది…

నిజంగా ఆ పాలస్తీనా ప్రాంతం ఒకప్పుడు యూదుల స్వంత భూభాగమా? అన్నది.

ముందుగా అసలు ఎవరు “పాలస్తీనా ప్రాంతం ఒకప్పుడు యూదుల స్వంత భూభాగం” అని మాట్లాడినా దానికి ఆధారం ఏమిటి? అని అడిగినప్పుడు… “బైబిల్లో అలా రాసి ఉంది కదా!” అనే సమాధానమే చెబుతారు. దీనిని బట్టి పాలస్తీనా ప్రాంతం ఒకప్పుడు యూదుల స్వంత భూభాగమా? కాదా? వారు ఆ భూభాగం నుండి బయటకు తరిమివెయ్యబడటానికి అసలు కారకులు ఎవరు? అన్న ప్రశ్నకు అటు క్రైస్తవులకు, యూదులకు ప్రామాణిక గ్రంథమైన బైబిల్ రిఫరెన్స్ ద్వారానే గమనించాల్సి ఉంటుంది.

పాలస్తీనా ప్రాంతం ఒకప్పుడు యూదుల స్వంత భూభాగమా?

ఎంత మాత్రం కాదు! యూదులకు సైతం అది బైబిల్ ప్రకారం దేవుడైన యెహోవా ద్వారా ప్రసాదించబడిన భూభాగమే. అయితే ఆ భూభాగంలో సైతం అమాలేకీయులనే బలవంతులైన జాతి ప్రజలు నివసిస్తూ ఉండేవారు.

“ఇశ్రాయేలూ వినుము; నీకంటె గొప్ప బలముగల జనములను ఆకాశమంటు ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనుటకై నేడు నీవు యొర్దానును దాటబోవుచున్నావు (ద్వితియోపదేశకాండము 9:3)” అన్న వాక్యాన్ని ఆ ప్రాంతంలో నివశిస్తున్న అమాలేకీయుల తరిమివేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాల్సిందిగా యూదులకు ఆజ్ఞాపించటం జరిగిందని తెలుస్తుంది. అదే ద్వితియోపదేశకాండము 9 వ అధ్యాయంలోని మరో రెండు ముఖ్యమైన వాక్యాలు గమనించగలరు…

“ఆ ప్రజలు గొప్పవారు ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశ స్థులు. అనాకీయుల యెదుట ఎవరు నిలువగలరు అను మాట నీవు వింటివి గదా (9:1)..
నీ దేవుడైన యెహోవా నీ యెదుట నుండి వారిని తోలి వేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీన పరచుకొనునట్లుగా యెహోవా నా నీతినిబట్టి నన్ను ప్రవేశ పెట్టెనని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ యెదుట నుండి వారిని వెళ్లగొట్టుచున్నాడు (9:2)”

పై రెండు వాక్యాలను బట్టి పాలస్తీనా భూభాగాన్ని దేవుడైన యెహోవా యూదులకు ఇవ్వటానికి గల కారణం యూదులకు ఏదో ప్రత్యేకత ఉండటమో, లేక వారంటే ప్రత్యేక ప్రేమో కాదు. కానీ, అంతకు ముందు నుండీ ఆ భూభాగంలో నివసిస్తున్న అనాకీయుల చెడు ప్రవర్తనే కారణం అని తెలుస్తుంది.

యూదులకు ఆ భూభాగం శాశ్వత ప్రాతిపదిక మీద రాసి ఇచ్చేయటం జరిగిందా? లేక తాత్కాలికం (Temporary) గా ఇవ్వటం జరిగిందా?
ఈ ప్రశ్నకు- యూదులకు ఆ భూభాగం తాత్కాలికం (Temporary) ప్రాతిపదికపై మాత్రమే ఇవ్వటం జరిగిందన్నది బైబిల్ ఇస్తున్న సమాధానం. ఆశ్చర్యంగా ఉంటే ఈ క్రింది బైబిల్ పరిశుద్ధ వాక్యం చదువుకోగలరు.

“నీ యెదుటనుండకుండ యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవు డైన యెహోవా మాట మీరు వినకపోయినయెడల మీరును వారివలెనే నశించెదరు” – ద్వితియోపదేశకాండము 8:20

పై వాక్యాన్ని బట్టి యూదులకు పాలస్తీనా భూభాగాన్ని వారు దైవాజ్ఞల ప్రకారం మంచీ మానవత్వాలతో నడుకున్నంత వరకే ఇవ్వబడుతుంది, లేదంటే అంతకు ముందు తరిమివేయబడ్డ అమాలేకీయుల మాదిరిగానే నశిస్తారని చెప్పటం జరిగింది.

కానీ, యూదుల రక్త దాహం ఈనాటిది కాదు. “నీలోని ఇశ్రాయేలీయుల ప్రధానులందరూ తమ శక్తి కొలది నరహత్య చేయుదురు యెహెజ్కెలు 22:6)” అన్న వాక్యాన్ని బట్టి యూదులు సృష్టిస్తూ వచ్చిన రక్త చరిత్ర కొన్ని వందల సంవత్సరాలది.

చివరకు వారి చెడు ప్రవర్తన కారణంగానే పాలస్తీన భూభాగం నుండి వారు తరిమివేయబడ్డారు!

“ఈ పట్టణములో బహుగా మీరు హత్య జరిగించారు. మీ ద్వారా హత్య చేయబడిన వారితో వీధులు నిండి ఉన్నాయి. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా… “ఈ పట్టణము (పాలస్తీనా భూభాగం)లో నుండి మిమ్మును వెళ్లగొట్టుదును” – యెహెజ్కెలు 11:7

యూదుల్ని ఆ భూభాగం నుండి వెళ్లగొట్టింది ముస్లిములా?

“ఈ పట్టణము (పాలస్తీనా భూభాగం)లో నుండి మిమ్మును వెళ్లగొట్టుదును” అని చెబుతుంది ఎవరు? స్వయంగా యెహోవానే కారణం- యూదులు అనేక మందిని ప్రవక్తలను, మహనీయులను అలవోకగా హత్యలు చేస్తూ రావటం. దీని కారణంగానే వారు స్వయంగా దేవుడైన యెహోవా ద్వారా ఈ విధంగా శపించబడ్డారు.

“ఇశ్రాయేలు వారికి రాజ్యముండకుండా తీసివేతును” – హోషెయ 1:4

అంతేకాదు చివరిగా యూదుల సంస్కర్తగా పంపబడ్డ యేసును కూడా “మాయోపాయముల ద్వారా కుట్ర పన్ని చంపాలని యూద మత పెద్దలంతా ఆలోచించుకున్నారు (మత్తయి 26:4-5)”.

చివరకు యేసును చంపటానికి అనేక విఫలయత్నాలు చేసి యేసు నోట ద్వారా కూడా “దేవుని రాజ్యం మీ నుండి తొలగించబడును (మత్తయి 21:37-43)” అని శపించబడ్డారు.

ఆ విధంగా యూదుల్ని ఆ భూభాగం నుండి తరిమి వేసింది ఒకప్పుడు ఆ భూభాగాన్ని ప్రసాదించిన యెహోవానే! తప్పితే ముస్లిములు కాదుకదా! ఒకవేళ ఒకప్పుడు ఆ భూభాగంలో ఉన్న యూదుల్ని ముస్లిములు బలవంతంగా తోలేసి ఆక్రమించుకుని ఉంటే, ఈనాడు యూదులు తిరిగి తమ స్వంత భూభాగాన్ని ముస్లిముల నుండి తిరిగి తీసుకుంటున్నారు అందులో తప్పేముంది? అని అనుకోవచ్చు.

ఇక్కడ ఆ భూభాగం యూదులకు ఇచ్చింది స్వయంగా యెహోవా, అది కూడా వారు మంచి నడవడిక కలిగి ఉన్నంత వరకే అక్కడ నివసిస్తారన్న “షరతు”పై “తాత్కాలికం (Temporary)” గా మాత్రమే ఇవ్వటం జరిగింది! తప్ప శాశ్వతంగా వారికి ఆ భూభాగం రాసి ఇవ్వటం అన్నది జరగలేదని బైబిలే చెబుతుంది.

వాస్తవం ఇదైనప్పుడు క్రైస్తవులు ఇశ్రాయేలీయులు తిరిగి తమ స్వంత భూభాగాన్ని స్వాధీన పరచుకుంటారని, రాజ్యం స్థాపిస్తారని కన్నీటి ప్రార్ధనలు చెయ్యటంలో అర్థమే లేదు.

బైబిల్లో చెప్పబడినట్టే యేసు అనంతరం బాబిలోనియన్ల ద్వారా యూదులు నాశనం కాబడ్డారు, వారు శపించబడినట్టే ఆ భూభాగం నుండి బయటకు పంపబడ్డారు. ఆ తరువాత వారు అనేక దేశాల్లో చెదిరిపోయారు. హిట్లర్, అడాల్ఫ్ ఐష్ మన్ లాంటి నాజీ అధికారుల చేతుల్లో లక్షల సంఖ్యలో చంపబడ్డారు. చివరకు తలదాచుకోటానికి పాలస్తీనా భూభాగంలో అక్కడ నివశిస్తున్న అరబ్ ముస్లిముల చెంతకు చేరారు.

కొన్నాళ్లకు ఇది ఒకప్పుడు మా స్వంత దేశమని వాదించారు. ఇదే మత్తు అటు క్రైస్తవులకు కూడా ఎక్కించారు. క్రమంగా పాలస్తీనా భూభాగాల్ని అక్రమంగా లాక్కోవటమే కాక అడ్డొచ్చిన పాలస్తీనా ముస్లిములందర్నీ లక్షల్లో చంపుతూ వచ్చి, అమెరికా సహాయంతో 1948 కు ముందు ప్రపంచ పటంపై లేని ఇశ్రాయేల్ అనే దేశాన్ని నిర్మించుకోవటం మొదలెట్టారు.

ఇక పాలస్తీనాను ముస్లిములు బలవంతంగా దురాక్రమణ చెయ్యలేదు. క్రీ.శ 637 తరువాత యూరుషలెమ్ స్థానిక క్రైస్తవులే అప్పటికే ఉన్న బైజాంటిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హజ్రత్ ఉమర్ (రజి) వారి పాలన కోరుకున్నారు. బైజాంటిన్ ప్రభుత్వ ప్రతినిధి అయిన పాట్రియాక్ సోప్రోనియన్ మరియు హజ్రత్ ఉమర్ (రజి) మధ్య జరిగిన శాంతి ఒప్పందాల తరువాత పాలస్తీనా భూభాగంలో ముస్లిములు నివాసాలు ఏర్పర్చుకోవటం మొదలెట్టారు.

ఇప్పుడు చెప్పండి “ఆ ప్రాంతం అసలు ఒకప్పుడు యూదుల స్వంత భూభాగం కదా! తిరిగి పాలస్తీనా ముస్లిముల నుండి తీసుకోవటంలో తప్పేంటి?” అనటానికి ఎవరికైనా ఆస్కారం ఉందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *