ముస్లిముల వద్ద వస్తువులు కొనొద్దని…
ముస్లిముల వద్ద హలాల్ మాంసం కొనొద్దని…
ముస్లిం వ్యాపారులను నిషేధించాలని…
ఇన్ని చెప్పటంతో పాటు ముస్లిం దేశాల నుండి భారతదేశానికి తరలివస్తున్న హలాల్ డబ్బు మాకు వద్దని చెప్పాలి కదా?
ప్రతీ సంవత్సరం భారత దేశం నుండి ఎంతో మంది విదేశాలకు వెళ్లి సంపాదించటం ద్వారా 87 మిలియన్ల డాలర్ల డబ్బు భారతదేశానికి వస్తుంటే.. అందులో యాభై శాతం అంటే దాదాపు 44 మిలియన్ డాలర్ల డబ్బు ముస్లిం దేశాలైన యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, ఒమన్ నుండి భారతదేశానికి వస్తుంది.
ఇక ఇండోనేషియా, మలేషియా, యు.ఏ.ఈ, ఒమన్, కువైట్, సౌదీ, ఖతార్, బహ్రైన్ వగైరా ముస్లిం దేశాల్లో అక్షరాలా 96,80,000 మంది హిందువులున్నారు.
కాబట్టి ముస్లిముల వద్ద పండ్లు, వస్తువులు, మాంసాలు వగైరా కొనటం వల్ల మైల పడిపోయే ప్రమాదం ఉన్నప్పుడు.. అదే ముస్లిం దేశాల్లో సంపాదించుకుంటున్న దాదాపు 9 మిలియన్ల హిందువుల్ని భారతదేశానికి రప్పించేసి, ముస్లిం దేశాల నుండి భారతదేశానికి వస్తున్న మిలియన్ల కొద్దీ డబ్బును, ఇంకా ముస్లిం దేశాల నుండి కొంటున్న పెట్రోల్ ను కూడా నిషేధించేసుకుంటే అప్పుడు మరింత పరమ పవిత్రంగా ఉండొచ్చు కదా
నాకు తెలిసొచ్చిన విషయమేమిటంటే మతోన్మాదానికి పనికిమాలిన ఎమోషన్సే తప్ప లాజిక్కులు పని చెయ్యవన్నది.
