“హిట్లర్” సక్సస్ ఫుల్ స్ట్రాటజీ

విద్యా, వైజ్ఞానిక, ఆర్థిక, శాస్త్రీయ రంగాలను అభివృద్ధి పథంలో నడుపుతూ దేశాన్ని సుసంపన్న దేశంగా తీర్చిదిద్దటం చేతకానప్పుడు.. ఆ దేశంలో మత విధ్వేష వేర్పాటువాద రాజకీయాల్ని నడుపుతూ ఆ దేశ ప్రజల మెదళ్లలో మత ఉన్మాద పైత్యాన్ని నింపేయాలి.

మెజారిటీ, మైనారిటీ వర్గ ప్రజల మధ్య ప్రణాళికాబద్దంగా ధ్వేషాన్ని పెంచుకుంటూ రావాలి. మెజారిటీ వర్గ ప్రజల ఓట్లు సంపాదించటానికి వారి దృష్టిలో ఓ కల్పిత శత్రువును సృష్టించాలి! వారు మైనారిటీలే అన్న పరోక్ష సంకేతాలిస్తూ.. “వారి వల్ల మీరు ప్రమాదంలో ఉన్నారు” కాబట్టి నన్ను నా పార్టీనీ అంటిపెట్టుకునుంటే కానీ మీరు బతికి బట్టకట్టలేరన్న ఓ “కల్పిత భయాన్ని” సృష్టించి సైకలజికల్ గా వారి మైండ్ ను ట్యూన్ చేసుకుంటూ రావాలి. చివరకు వారిని హింసించటం, చంపటం కూడా పాపం కాదన్నట్టుగా అనాగరికులుగా మార్చిపరేయ్యాలి.

ఆ మెజారిటీ వర్గంలో వ్యక్తులు దిగజారిపోతున్న ఆర్ధిక వ్యవస్థ మీద, గతి తప్పుతున్న సామాజిక వ్యవస్థల మీద, పెరిగిపోతున్న నిరుద్యోగం మీద, నిత్యావసర వస్తువుల ధరల మీద ప్రశ్నించకుండా, లాజిగ్గా ఆలోచన చెయ్యకుండా నిత్యం ఇతర మైనారిటీ వర్గాల పట్ల పగా ప్రతీకారాలతో రగిలిపోయే ఉన్మాదుల్లా, అర్థంపర్థం లేకుండా మాట్లాడుతూ ఎందుకూ పనికిరాని పక్కా ఐటం గాళ్ల మాదిరిగా తయారు చేసి పరేయ్యాలి.

మా బతుకులు సంకనాకిపోయి రోడ్డున పడిపోయినా పర్లేదు మా నాయకుడు అధికారంలో ఉంటే మాకంతేచాలన్నట్లుగా ప్రజల మెదళ్లను బ్రెయిన్ వాష్ చేసి పరెయ్యాలి.

దాని కోసం మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే సినిమాలూ, టీవీ ప్రోగ్రాములు డిజైన్ చేస్తూ మీడియా మాధ్యమాల ద్వారా ప్రజల్లో ధ్వేషాన్ని నింపుతూ వారి మెదళ్లు మొద్దుబారిపోయేలా చేసేయ్యాలి.

ఇదే ఒకప్పుడు “హిట్లర్” సక్సస్ ఫుల్ గా అమలు చేసిన పోలిటికల్ స్ట్రాటజీ అన్నమాట!

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *