ముందు మనువాద సంఘాలన్నీ కలిసి కట్టుగా చెయ్యాల్సినవి…

దేవాలయాల చుట్టూ ముస్లిములను వ్యాపారాలు చెయ్యనివ్వకపోటంతో పాటు అంతకంటే ముందు మనువాద సంఘాలన్నీ కలిసి కట్టుగా మరి కొన్ని మంచి పనులు చెయ్యాలి. అవేమిటంటే…

సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, యెమెన్, బెహ్రైన్, దుబాయ్ దేశాల్లో ఉంటూ పని చేసుకుని సంవత్సరానికి బిలియన్ల కొద్దీ డబ్బును ఇండియాకు పంపుతున్న మన లక్షలాది హిందూ బంధువులందర్నీ ఉద్యోగాలూ, పనులు మాన్పించేసి ఇండియాకు తిరిగి రప్పించేయాలి.

దేశం మొత్తం మీద మసీదుల చుట్టూ, మసీదు షాపింగ్ కాంప్లెక్సుల్లో వ్యాపారాలు చేసుకుంటున్న లక్షల కొద్దీ మన హిందూ బంధువులందర్నీ షాపులు ఖాళీ చేయించేసి గుళ్ల చుట్టూ వ్యాపారాలు చేసుకోమని చెప్పాలి.

అలాగే ఇండియాలో విప్రో, సిప్లా, వొకార్డ్ లాంటి కంపెనీలే కాక, ముస్లిముల ద్వారా నడుపబడుతున్న అనేక సాఫ్ట్ వేర్, ఎక్స్పోర్ట్ కంపెనీలు, ఇండస్ట్రీలలో ఉద్యోగాలు చేసుకుంటున్న మన హిందూ బంధువులందర్నీ జాబులకు రిజైనింగ్ లెటర్లు ఇప్పించేసి బయటకు రప్పించేయాలి.

అలాగే మా షాపులకు ముస్లిం కస్టమర్లు రాకూడదంటూ బోర్డులు తగిలించేసి, వచ్చే ప్రతీ కస్టమరూ మన హిందూ బంధువా? కాదా? ఒకవేళ హిందూ బంధువైతే అతని కులమేమిటో నిర్ధారించుకోటానికి వాల్ల ఆధార్ కార్డు కూడా తెచ్చుకోమనాలి.

ఇంకా వీలైతే ఇండియాకు ముస్లిం దేశాల నుండి వచ్చే ఆయిల్ దిగుమతులను కూడా నిషేధించేసి అవసరమైతే మేమంతా ఎడ్లబళ్ల మీదో లేక గుర్రాలు, గాడిదల మీదో ప్రయాణం చేస్తాం తప్ప ముస్లిం దేశాల నుండి వచ్చే ఆయిల్ దిగుమతులను మా బళ్లల్లో కొట్టించుకోమని చట్టం తెమ్మని నినదించాలి.

ఇలాంటి గొప్ప పనులు చెయ్యటం వల్ల ఒక్క దేవాలయాల చుట్టూ మాత్రమే కాదు, అసలు ఏ విధంగానూ ముస్లిం అన్న వాడి నీడ కూడా మన మీద పడకుండా, అతని మీద ఆధారపడకుండా హ్యాపీగా బతికేయవచ్చు.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *