కాశ్మీరీ పండిట్లు లోయ వదిలి వెళ్లే సమయంలో కాశ్మీర్ రాష్ట్రపతి పాలనలో ఉంది. ఆ సమయంలో కాశ్మీర్ గవర్నర్ గా జగ్మోహన్ మల్హోత్రా, కేంద్రంలో బీజేపీ సపోర్ట్ కలిగి ఉన్న వీ.పి సింగ్ పరిపాలన కొనసాగుతుంది.
నిజంగా కాశ్మీరీ పండిట్ల పట్ల అంత ప్రేమే ఉంటే ఆనాడు మిలిటెంట్ల నుండి కాశ్మీరీ పండిట్ల ప్రాణాలకు ముప్పు ఉందన్న విషయం తెలిసినప్పుడు వీ.పి సింగ్ ప్రభుత్వం సైనిక బలగాలు ఉన్నప్పటికీ వారికి రక్షణ ఎందుకు కల్పించలేకపోయింది?
కేవలం మిలిటెంట్ల బెదిరింపులకు భయపడిపోయి కాశ్మీర్ పండిట్లను సమయానికి సంరక్షించలేకపోగా, పైగా కాశ్మీరీ పండిట్లను అక్కడి నుండి వెళ్లిపోవటానికే జగ్మోహన్ మల్హోత్రా ఎందుకు ప్రోత్సహించాడు? దాని వెనుక కుట్రేమిటి?
అప్పటి గవర్నర్ జగమోహన్ సైనిక బలగాలతో మిమ్మల్ని సంరక్షిస్తామని కాశ్మీర్ పండిట్లకు భరోసా ఇవ్వటం మానేసి.. రివర్స్ లో “మీకు సెక్యూరిటీ కావాలంటే ఇళ్లు వదిలిపెట్టి రెఫ్యూజీ క్యాపుల్లోకి రండి అక్కడే మీకు సెక్యూరిటీ దొరుకుతుంది” అని రాత్రికిరాత్రి బస్సులు ఏర్పాటు చేసి మరీ ఎందుకు బయటకు పంపేశాడు?
కాశ్మీరీ పండిట్లను లోయ నుండి వెళ్లగొట్టటమే ముస్లిముల లక్ష్యమైతే మిలిటెంట్ల చేతిలో దాదాపు 1500 మంది ముస్లిములు చనిపోగా కేవలం 89 మంది కాశ్మీరీ పండిట్లు మాత్రమే ఎందుకు ప్రాణాలు కోల్పోయారు?
సరిగ్గా కాశ్మీరీ పండిట్లు జనవరి 20 న కాశ్మీర్ విడిచిపెట్టి వెళ్లిన రెండవరోజే జనవరి 21 1990న ‘గావ్కాడల్ ఊచకోత’ జరిగింది. CRPF జవాన్లు కాల్పులు జరిపి 50 మంది ముస్లిములను చంపేయటం జరిగింది. దాని గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరు?
నేడు ఆ 89 మంది కాశ్మీరీ బ్రాహ్మణులు చనిపోయినందుకే కాశ్మీర్ ఫైల్స్ సినిమా తెరకెక్కిస్తే మరి అదే మిలిటెంట్ల దాడిలో ప్రాణాలు కోల్పోయిన 1500 మంది ముస్లిముల గురించిన ప్రస్తావన ఎవరూ ఎందుకు చెయ్యటం లేదు?
మీరు కొన్నాళ్లాగితే పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి మిమ్మల్ని రప్పిస్తానని అక్కడి నుండి కాశ్మీరీ బ్రాహ్మణులను లోయ నుండి పంపేసిన తరువాత ఈనాటికీ బీజేపీ వారికి పునరావాసం ఎందుకు కల్పించలేకపోయింది?
కాశ్మీరీ పండిట్లను, ముస్లిములను కాపాడటంలో నాటి ప్రభుత్వం అట్టర్ ఫేయిల్యూర్ అయిపోయిన కారణంగా కాశ్మీరీ పండిట్ల కంటే పది రెట్లు ముస్లిములు చనిపోయారు. దాన్ని కప్పిపుచ్చుకోటానికి నేడు రివర్సులో లక్షల కొద్దీ కాశ్మీరీ పండిట్లను అక్కడి స్థానిక సామాన్య ముస్లిములు చంపేశారని, లోయ నుండి తరిమేశారని ప్రచారాలు చెయ్యటం, సినిమాలు తియ్యటం, హిందూ-ముస్లిముల మధ్య విద్వేషాలు రగిలించటం, పైగా ఆ సినిమాను చూడమని దాన్ని కేంద్ర అధికార మంత్రులు ప్రమోట్ చెయ్యటం దారుణం కాదా?
దీనిని బట్టి కాశ్మీరీ పండిట్లు లోయ విడిచిపెట్టి వెళ్లిపోవటానికి బాధ్యులు ముస్లిములు ఏవిధంగా కాగలరు? అదే నిజమైతే కాశ్మీరీ పండిట్లు తాము స్వయంగా రాసిన ఉత్తరంలో…
“కాశ్మీర్ వదిలి పెట్టి వెళ్లిపోవటం అన్నది బీజేపీ, ఆర్.ఎస్.ఎస్, శివసేనల యొక్క పోలిటికల్ డ్రామా” అని, “ముస్లింలను ఊచకోత కోయడానికి కాశ్మీరీ పండిట్లను లోయ నుండి వలస వెళ్లేలా ప్రణాళిక రూపొందించబడ్డాయని” ఎందుకు పేర్కొన్నారు?
