“అవును నేను శ్రద్ధావాల్కర్ ను చంపటమే కాక మరో 20 మంది హిందూ అమ్మాయిలను కూడా ప్రేమలో పడేశాను. ఆమెను చంపినందుకు నేను బాధపడటం లేదు నేను స్వర్గంలో వెళ్లినప్పుడు హీరోగా గుర్తించబడి జన్నత్ లో హూర్లను పొందుతాను” అంటూ అఫ్తాబ్ పునావాలా పాలిగ్రాఫ్ పరీక్షలో ఒప్పుకున్నాడని ఫస్ట్ పోస్ట్, దైనిక్ భాస్కర్ లలో న్యూస్ వెలువడినప్పటి నుండి సోషల్ మీడియాలో ఈ మర్డర్ కేస్ మరో మలుపు తీసుకుంది.
ఈ న్యూస్ ఇస్లామోఫోబులకు సోషల్ మీడియాలో కుప్పిగంతులెయ్యటానికి ఆకలి మీదున్న కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టైంది. ఇప్పటి వరకూ ఆ హత్యానేరానికి హిందూ vs ముస్లిం రంగును ఆపాదించేయటం ఒక ఎత్తైతే, ఇప్పుడు క్రొత్తగా అతను చేసిన హత్య వెనుక లక్ష్యం ‘లవ్ జిహాద్’ అని, అతను ఇంకో 20 మంది హిందూ అమ్మాయిలను కూడా ట్రాప్ లో పడేశాడని ఇదంతా అతను స్వర్గలోకపు కన్యలను పొందటానికి చేశాడని విపరీతమైన ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది.
ఆ హంతకుడైన ఆఫ్తాబ్ పునవాలాను అడ్డం పెట్టుకుని మతాన్ని మధ్యలో లాగి ఇస్లాంపై చాన్నాళ్ల నుండి తమ కడుపుల్లో దాచుకున్న కుళ్లంతటినీ కక్కేయటానికి ఇప్పుడు చాలా మందికి చక్కటి అవకాశం లభించింది.
ఫ్యాక్ట్ చెక్ ///
“ఆఫ్తాబ్ పునవాలా శ్రద్ధావాల్కర్ ను చంపటమే కాక మరో 20 మంది హిందూ అమ్మాయిలను కూడా ప్రేమలో పడేశాడని, ఆమెను చంపినందుకు అతను బాధపడటం లేద”న్నట్టు ఓ గాలి వార్త వెలువడిన తరువాత ఫ్యాక్ట్ చెక్ టీం ఫోరెన్సిక్ సైకాలజిస్టులతో మాట్లాడటం జరిగింది.
దాంట్లో వారు చెప్పిన ఆశక్తికర విషయాలేమిటంటే- ‘పాలిగ్రాఫ్ టెస్ట్’లో ఒక వ్యక్తి నేరాన్ని ఒప్పించటానికి ఎటువంటి అవకాశం ఉండదని, పాలిగ్రాఫ్ టెస్ట్ లో నేరస్తుడిని కొన్ని సెన్సార్స్ తగిలించి కొన్ని ప్రశ్నలు అడగటం జరుగుతుందని, ఆ ప్రశ్నలకు గానూ అతనికి కేవలం “Yes/No” అనే సమాధానం చెప్పేంత సమయమే ఇవ్వబడుతుంది తప్ప అతను నేరాన్ని ఎందుకు చేశాడు దాని వెనుక కారణాలేమిటి? వగైరా స్టోరీలు వినిపించేంత సమయం ఇవ్వబడదని చెప్పటం జరిగింది.
వివరంగా చెప్పాలంటే ‘పాలిగ్రాఫ్ టెస్ట్’ అనేది నేరస్తుడికి ఒక యంత్రం ద్వారా కొన్ని సెన్సార్లు తగిలించి ప్రశ్నలు అడగటం జరుగుతుంది. దీనినే “లై-డిటెక్షన్ టెస్ట్” అని కూడా అంటారు. ఇది కేవలం నేరస్తుడు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలిస్తున్నాడా? అబద్ధాలు చెబుతున్నాడా? అతని మానసిక స్పందనలు ఎలా ఉన్నాయి వగైరా విషయాలను పాలిగ్రాఫ్ యంత్రం ‘స్ట్రిప్’ ద్వారా కాగితంపై గ్రాఫ్ రూపంలో సమాచారం అందించటం జరుగుతుంది. అంతే తప్ప నేరస్తుడు కూర్చొని స్టోరీలు వినిపించటానికి అక్కడ ఎలాంటి అవకాశం ఉండదు!
నార్కో-అనాలసిస్ టెస్ట్ వేరు. అందులో నేరస్తుడికి సోడియం పెంటోథాల్ ఇంజక్షన్ ఇచ్చి మత్తులో ప్రశ్నిస్తూ మాట్లాడించి నిజం రాబట్టటం జరుగుతుంది. అయితే పోలీస్ కస్టడీలో ఆఫ్తాబ్ పునావాలాపై నిర్వహించిన రెండు టెస్టుల్లోనూ అతను ఆ అమ్మాయిని చంపినట్టు ఆమెను ముక్కలు చేసినట్టు ఒప్పుకున్నట్టు పోలీస్ అఫిషియల్స్ చెప్పిన విషయాన్ని ఫస్ట్ లుక్ విడుదల చేసిన నివేదికలో చూడవచ్చు.
తప్పితే ఈ రిపోర్ట్ లో ఆఫ్తాబ్ పునావాలా ‘లవ్ జిహాద్’ కోసం ఆ అమ్మాయిని చంపాడని గాని, ఇంకా 20 మంది హిందూ అమ్మాయిలను ప్రేమలో పడేశాడని గానీ చెప్పినట్టు ఎక్కడా పేర్కొనలేదు.
కానీ, “పాలిగ్రాఫ్ టెస్ట్” తాలూకు కనీస అవగాహన లేకుండా.. ఆఫ్తాబ్ పునావాలా శ్రద్ధావాల్కర్ ను చంపటమే కాక, మరో 20 మంది హిందూ అమ్మాయిలను కూడా ప్రేమలో పడేశాడని, దానికి అతను బాధపడక స్వర్గంలో కన్యల్ని పొందటానికే అదంతా చేశాడని పాలిగ్రాఫ్ టెస్ట్ లో కూర్చొని స్టోరీలు వినిపించినట్టు ఫస్ట్ పోస్ట్, దైనిక్ భాస్కర్ న్యూస్ పోర్టల్స్ ఇలాంటి అబద్ధాలను ప్రచారంలోకి తీసుకురావటాన్ని బట్టి కొందరు జర్నలిస్టులు ఏ స్థాయిలో దిగజారి పోయి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
పైగా ఫ్యాక్ట్ చెక్ టీం అందించిన రిపోర్ట్స్ ప్రకారం ఆఫ్తాబ్ కు మతపరమైన అంశాలపై పెద్ద ఆశక్తి లేదన్న విషయం తెలుస్తుంది. అలాంటప్పుడు మీడియాలో అతను చేసిన హత్యకు ‘లవ్ జిహాద్’ రంగు పులుముతున్న వారి మెదళ్లు మలంతో నిండి ఉన్నాయని చెప్పటంలో సందేహమే లేదు. ఇలాంటి అబద్ధాలను ప్రచారంలో తీసుకురావటం కేవలం ఎలక్షన్ స్టంటా? లేక దీని వెనుక ఏదైనా ఎజండా ఉందా అన్నదే తెలియాల్సి ఉంది.
పరాయి స్త్రీలను కనీసం కన్నెత్తి కూడా చెడు దృష్టితో చూడటాన్ని నిషేధించే గొప్ప ధర్మమైన ఇస్లాంను కేవలం ఒక ముస్లిం పేరు పెట్టుకున్నంత మాత్రానా ఒక ఉన్మాదికి ఆపాదించి, పైగా వాడి పేరును బట్టి మొత్తం ముస్లిం సమాజాన్ని విమర్శించటానికి నోటిని మల ద్వారంగా మార్చుకుని తమ మాటలతో దుర్గంధాన్ని వెదజల్లుతున్న కొందరు మూర్ఖులను సోషల్ మీడియాలో చూస్తుంటే దేశంలో ఈ ఇరవయ్యవ శతాబ్దపు ఆధునిక ఆటవికుల సైన్యం ఎంత బలంగా తయారవుతుందో అంచనా కట్టవచ్చు.
ఆ హత్యా నేరం చుట్టూ అలుముకుంటున్న అబద్ధాలు /-
