చరిత్రలో యుద్ధాలన్నిటికీ “మతమే” కారణమా? /-

“మతమే మారణహోమాలన్నిటికీ కారణం” “చరిత్రలో జరిగిన యుద్ధాలన్నీ మతం పేరు మీదే జరిగాయి” అంటూ బలంగా బల్ల గుద్దేసి మరీ ఎలా పడితే వాదించేసే చాలా మంది నాస్తికులు చెప్పే ఈ మాటలు కేవలం వారికి మతం మీద మొహం మొత్తేసి దాని మీద ఏవగింపు కొద్దీ చెప్పే మాటలే తప్ప చరిత్ర తాలూకు అవగాహనతో ఆధారసహితంగా చెప్పే మాటలు కావన్నది చరిత్రను పరిశీలిస్తే అర్థమయ్యే విషయం.

అయినప్పటికీ “అబబ్బే మేము చెప్పేదే ఫైనల్ అన్నీ మాకు తెలుసు” అని వాదించేవారు చరిత్రలో జరిగిన యుద్ధాలు, వాటి కారణాలను వివరిస్తూ రాయబడిన “ఎన్సైక్లోపీడియా ఆఫ్ వార్స్ (Encyclopedia of wars)” అనే పుస్తకం చదవాలి. దాని ప్రకారం చరిత్రలో (8000 BCE నుండి 2003 ఇరాఖ్ యుద్ధం వరకు) మొత్తం 1763 యుద్ధాలు జరగగా, వాటిలో మతం కారణంగా జరిగిన యుద్ధాలు 123 మాత్రమే! మిగతావన్నీ అధికారం, రాజకీయ, ఆర్థిక లబ్ది కోసం జరిగిన యుద్ధాలే! అంటే చరిత్రలో జరిగిన మొత్తం యుద్ధాలల్లో మతం కారణంగా జరిగినవి కేవలం 6.89% మాత్రమే. తప్పితే నాస్తికులు ఊహించుకుంటున్నట్లు నూటికి నూరు శాతం మతమే అన్ని యుద్ధాలకూ కారణం కాదు.

మూడు వాల్యూమ్స్ లో దొరికే ఈ పుస్తకం చరిత్రలో జరిగిన యుద్ధాలు, తిరుగుబాట్ల యొక్క ప్రధాన కారణాలను, అప్పటి సామాజిక, రాజకీయ నేపథ్యాలను సైతం సవివరంగా మనముందుంచుతుంది.

ఈ పుస్తకంతో పాటు – “ద గ్రేట్ బిగ్ బుక్ ఆఫ్ హారిబుల్ థింగ్స్: ది ద డెఫినిటివ్ క్రానికల్ ఆఫ్ 100 వరస్ట్ అట్రాసిటీస్ (The Great Big Book of Horrible Things: The Definitive Chronicle of History’s 100 Worst Atrocities)” అనే మరొక ప్రముఖ పుస్తకం- చరిత్రలో జరిగిన 100 దారుణమైన మారణ హోమాల్లో 11 మాత్రమే మతం కారణంగా జరిగాయని తేల్చి చెప్పటం జరిగింది.

అంతేకాకుండా చరిత్రలో జరిగిన సకల మారణహోమాలన్నీ మతం పేరుమీదనే జరిగాయని వాదించే నాస్తికులకు సైతం అవగాహన లేని విషయం ఒక్క 20 వ శతాబ్దంలో జరిగిన జనహననాల్లో 160 మిలియన్ల మంది చంపబడితే అందులో దాదాపు 100 మిలియన్ల మంది చంపడింది కమూనిస్ట్ రాజ్యాలైన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ రష్యా మరియు చైనాల్లో జరిగిన జనహననాల్లోనే.

నాస్తిక దేశాల్లో జరిగిన ఈ దౌర్జన్యాలకు కారకులు ఎవరో మత ఉన్మాదులు కారు స్టాలిన్, లెనిన్, మావో, పోల్ పాట్ వగైరా నాస్తిక లీడర్లే. ఈ విషయం తెలియాలంటే చదవాల్సిన పుస్తకం- “ద బ్లాక్ బుక్ ఆఫ్ కమ్యూనిజం”.

చరిత్రలో అతిపెద్ద జనహననాలు సాగించిన హిట్లర్, సోవియట్ నియంత జోసెఫ్ స్టాలిన్ల కంటే ‘మావో’ అధిగమించాడు. 1958 – 62 సం.ల మధ్య మావో జెడాంగ్ ప్రవేశ పెట్టిన “గ్రేట్ లీప్ ఫార్వర్డ్ పాలసీ” కారణంగా చైనాలో 45 మిలియన్ల మంది చంపబడ్డారన్న విషయం ఎంత మందికి తెలుసు? ఇది చరిత్రలో నమోదైన మరియు మరుగుపరచబడిన అతిపెద్ద జనహననం. ఇది గత వందేళ్లలో సాగిన “కమ్యూనిస్ట్ టెర్రరిజం” అనటం అతిశయోక్తి కాదు.

కాబట్టి చరిత్రలో జరిగిన అనేక యుద్ధాల్లో అతి కొద్ది శాతం యుద్ధాలు మతం పేరు మీద జరిగాయని చరిత్ర చెబుతున్నప్పటికీ, చరిత్రలో జరిగిన మొత్తం యుద్ధాలన్నిటికీ కారణం మతమే అని, మతమే మారణ హోమాలన్నిటికీ మూలమని మత వ్యవస్థలో కొందరు దుర్మార్గులను, దౌర్జన్యపరులను బట్టి వాదించటం మూర్ఖత్వం అవుతుంది.

ప్రతీ మత వ్యవస్థలో మంచీ మానవత్వం కలిగి ఉండే వ్యక్తులతో పాటు ఉండే కొందరు దుష్టులు, దుర్మార్గులను బట్టి ఆ మొత్తం మత వ్యవస్థను తప్పు పట్టటం తప్పులేదనుకుంటే…
ఉదాహరణకు “అహింసా మార్గాన్ని ఒక్క బుద్ధిజం తప్ప ఏ మతమూ బోధించదు” అంటూ కొందరు నాస్తికులు తీర్మానం చేస్తుంటారు. మయన్మార్ లో బౌద్ధులు వేల మంది రోహింగ్యాలను దారుణంగా చంపటం టెర్రరిజం కాదా? మయన్మార్ లో ముస్లిములకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే “ఆశిన్ విరాటు”ను టైమ్ మేగజైన్ “ఫేస్ ఆఫ్ బుద్దిస్ట్ టెర్రర్” అని పేర్కొంది. ఇతన్ని “బుద్దిస్ట్ బిన్ లాడెన్” అని కూడా అంటారు. ఇలాంటి కొందరు మూర్ఖులను బట్టి బుద్ధిజం ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని చెప్పవచ్చా? ఇలాంటి మూర్ఖులు ప్రతీ మతవ్యవస్థ లోనూ కొందరుంటారు.

కాబట్టి మొత్తానికి చరిత్రలో జరిగిన యుద్ధాలన్నిటికీ కారణం మతమే అన్న నాస్తికుల బలమైన వాదన తునాతునకలైపోయింది.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *