టెర్రరిస్ట్ దాడుల్లో బాధితులు అధికశాతం ముస్లిములే…

“ముస్లిములందరూ టెర్రరిస్టులు కారు కానీ, టెర్రరిస్టులందరూ ముస్లిములే” అన్నది ఇస్లాం విమర్శకుల ఊతపదం.

దీనికి భిన్నంగా వారు తెలుసుకోవలసింది “టెర్రరిస్టులందరూ ముస్లిములు కారు, అలాగే టెర్రరిజం బాధితులు అధిక శాతం మంది ముస్లిములే” అన్నది.

********

“National Consortium for the Study of Terrorism and Responses to Terrorism (START)“. ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజం, టెర్రరిస్టు సంఘటనలపై పరిశోధన చేసే సంస్థ. ఇదేదో ముస్లిములు నడిపే సంస్థ అనుకుంటారేమో! ఇది యునైటెడ్ స్టేట్స్ లో ‘యూనివర్సిటీ ఆఫ్ మేరీ ల్యాండ్’లో ప్రపంచంలోని 1970 నుండి జరిగిన దాదాపు 125000 తీవ్రవాద సంఘటనల తాలూకు అత్యంత సమగ్రమైన డేటా బేస్ ను సేకరించి తీవ్రవాదంపై పరిశోధన చేస్తున్న సంస్థ. దీని వెబ్ సైట్ ను కూడా చూడవచ్చు.

“తీవ్రవాదం చేసేదే ముస్లిములు, బాధితులంతా ముస్లిమేతరులు” అంటూ ఇస్లామోఫోబుల చేసే దిగజారుడు విమర్శలకు పూర్తి భిన్నంగా ఈ సంస్థ అంతర్జాతీయంగా జరిగిన తీవ్రవాద సంఘటనలు వాటిలో బాధితులు, చనిపోయినవారు ఎవరన్నది పరిశోధించి తయారు చేసిన నివేదిక ప్రకారం- “ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఉగ్రవాద దాడుల్లో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో జరిగిన టెర్రరిస్ట్ ఎటాక్స్ లో బాధితులు అధికశాతం ముస్లిములే” అన్నది.

ముస్లిములందరూ తీవ్రవాదులే అన్నట్టు విమర్శించేవారికి ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విలియం బ్రానిఫ్ మరియు అతని టీం పరిశోధించి తయారుచేసిన నివేదిక ఆశ్చర్యానికి గురిచెయ్యవచ్చు.

********

“The French Terror Victims Association (AFVT)” అన్నది ఫ్రెంచ్ కు చెందిన ఉగ్రవాద దాడుల బాధితులను ఆదుకునే సంస్థ. ఈ సంస్థ అధ్యక్షుడు సెయింట్ మార్క్ స్పష్టంగా “ప్రపంచవ్యాప్తంగా 80% మంది తీవ్రవాద బాధితులు ముస్లిములేనని” తేల్చి చెప్పిటం జరిగింది.

“ఇస్లాం టెర్రరిజం ప్రేరేపిస్తుంది, ముస్లిములంతా తీవ్రవాదులే” అంటూ నోటికొచ్చినట్టు ఎలా పడితే అలా మాట్లాడే కొందరు ఇస్లాం ధ్వేషకులు ఈ నివేదికల్ని కాస్త గమనించాలి.

“అయితే అల్ఖైదా, ISIS, హర్కతుల్ ముజాహిదీన్ వగైరా తీవ్రవాద సంస్థల్లో గెడ్డం, టోపీలు పెట్టుకుని, అరబిక్ పేర్లు పెట్టుకుని టెర్రరిజం చేస్తున్న వారంతా ముస్లిములు కారా? అంటూ ఈ సందర్భంలో కొందరు ప్రశ్నించవచ్చు.

ఇలా ప్రశ్నించేవారు అనేక తీవ్రవాద సంస్థలు చేసిన ఉగ్రవాద దాడుల్లో బాధితులు కూడా 80% మంది ముస్లిములే అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. ‘జిహాద్’ పేరుతో ఈ మూర్ఖులు చేసే ఉన్మాదానికీ, వాస్తవ ‘ఇస్లామిక్ జిహాద్’కూ ఏ మాత్రం సంబంధం లేదని తెలుసుకోవాలి. వీరి లక్ష్యం ప్రజల్లో ఇస్లాం తాలూకు ఉన్నత బోధల్ని సర్వసామాన్యం చెయ్యటం కాదని అలా చెయ్యాలన్న లక్ష్యమే వారికుంటే వారు ఆయా తీవ్రవాద సంస్థల్లోనే ఉండేవారు కారన్న విషయాన్ని కూడా గమనించాలి.

కాబట్టి… “మతోన్మాదానికి మతం ఉండదు, దాని ద్వారా బాధించబడేవారు కూడా ఏదో ఓ ప్రత్యేక మతానికి చెందినవారై ఉండరు”

********

అన్నిటికంటే ముఖ్యంగా- ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంను ఏదో ఒక చిన్న మతవర్గం కాదు కానీ.. 1.9 బిలియన్ల మంది ముస్లిములు అనుసరిస్తున్నారన్న విషయాన్ని “ముస్లిములందరూ ఉగ్రవాదులే” అంటూ దిగజారుడు విమర్శలు చేసే ఇస్లాం విమర్శకులు మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవాలి.

ప్రపంచంలో మూడొంతుల్లో ఒక భాగమైన అతిపెద్ద ముస్లిం సమాజంలో ఈ టెర్రరిస్టు గ్రూపుల్లో ఉండే నామమాత్ర ముస్లిముల సంఖ్య 0.1% కూడా ఉండదు. అలాంటప్పుడు ఈ కొంతమంది ఉన్మాదులను మిగతా 99.9 శాతం మంది ముస్లిములను ఒకే గాటన కట్టేసి “ముస్లిములందరూ ఉగ్రవాదులే” అని విమర్శలు తీర్మానించటం అసలు ఏ రకమైన ఉన్మాదం?

ఈ ప్రశ్నకు కూడా ఎంతో చాకచక్యంగా ఇస్లామోఫోబియా పైత్యం తలకెక్కిన ధ్వేషకులు- “ముస్లిం సమాజంలో ఉన్న ఆ మంచోళ్లైన 99.9 శాతం ముస్లిములంతా ఇస్లాంకు దూరంగా ఉండటం వల్ల వారిలో మతోన్మాద భావాలు లేవు ఒకవేళ వారంతా ఇస్లాంకు దగ్గరై ఉంటే వారుకూడా తీవ్రవాద భావాలే కలిగి ఉండేవారని” పిసరంత ఇస్లాం జ్ఞానం లేనప్పటికీ మొత్తానికి ఇస్లాంను ఏదోలా విమర్శించటానికి కొత్త దారులు వెదుకుతుంటారు.

దీనికి పూర్తి వ్యతిరేకంగా టెర్రరిస్టు గ్రూపుల్లో ముస్లిం పేర్లు పెట్టుకున్న 0.1% నామమాత్ర ముస్లిములు ఇస్లాం తాలూకు వాస్తవ జ్ఞానం లేకుండా అమెరికా, ఇస్రాయీల్ తొత్తులుగా ఉంటూ స్వార్థప్రయోజనాల నిమిత్తం పనిచేసే మూర్ఖులు, ఉన్మాదులని.. వారు చేసేదంతా ఖురాన్ ఆదేశాలకు పూర్తి వ్యతిరేకమన్న విషయాన్ని ఏ కాస్త టైమ్ తీసి ఖురాన్ ను, ప్రవక్త ముహమ్మద్ (స) చరిత్రను, బోధనల్నీ స్టడీ చేసేవారికైనా సులువుగా అర్థమయ్యే విషయం.

అలా ఇస్లాంను లోతైన పరిశీలన చేసిన ఎంతో మంది ఇస్లాం ధ్వేషకులు సైతం ఇస్లాం స్వీకరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈనాడు ఆ విధంగా ఇస్లాంను లోతైన పరిశీలన చేస్తున్న కారణంగానే ప్రపంచంలో అత్యధికంగా ఇస్లాం అనేకులచే అంగీకరించబడుతుంది. ఇదే ఇస్లాం ధ్వేషకుల కడుపు మంటను మరింత పెంచుతుంది.

కాబట్టి ప్రపంచ ముస్లిం జనాభాలో 0.1% ఉండే కొందరు మూర్ఖులను బట్టి ఇస్లాం ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని విమర్శించే ముందు మిగతా 99.9 % మంది ముస్లిముల్లో ఉత్తములు, మంచివారు ఉన్నారని తెలుసుకోవాలి.

ఇస్లాం వల్ల ముస్లిమేతరులకు ప్రమాదమని నోరు జారే ముందు అదే ఇస్లాంను అనుసరించిన వేలకొద్దీ ముస్లిములు ఇస్లాం ఇచ్చిన స్పూర్తితోనే భారత స్వాతంత్రోధ్యమంలో జాతికోసం ప్రాణాలు అర్పించేశారని గుర్తుపెట్టుకోవాలి.

సిరియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటి కొన్ని దేశాల్ని వాటిలో రాజకీయంగా జరిగే గొడవల్ని పట్టుకుని ‘ఇస్లాం టెర్రరిజాన్ని’ ప్రోత్సహిస్తుందని చెప్పే ముందు ప్రపంచంలో ఇంకా 50 ఇస్లామిక్ దేశాలు ఎంతో ప్రశాంతంగా సందర్శనా స్థలాలుగా కూడా ఉన్నాయని ఆయా దేశాల్లో క్రైమ్ రేట్ సైతం ఎంతో తక్కువగా ఉందన్న విషయాన్ని గమనించాలి.

ఏ మతవర్గంలో నైనా అందరూ మంచివారూ ఉండరు అందరూ చెడ్డవారూ ఉండరు ఆ కొద్ది మంది చెడ్డవారిని బట్టి మొత్తం మతవర్గాన్ని విమర్శించటం ఘోరమైన మూర్ఖత్వం అన్న విషయాన్ని మరిచిపోకుండా ఉండాలి.


Links:

https://wwrn.org/articles/47023/

https://abcnews.go.com/…/muslims-absolutely…/story…

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *