ఇప్పటివరకూ ఖగోళ శాస్త్రజ్ఞులు కనిపెట్టిన శక్తివంతమైన ఆధునిక టెలీస్కోపుల ద్వారా వారి ప్రయోగాల ద్వారా విశ్వంలో ఏవైతే నక్షత్రాలూ, గ్రహాలూ, గెలాక్సీలూ కనిపెట్టబడ్డాయో అదంతా మొత్తం విశ్వ వ్యవస్థలో కేవలం 4 శాతం మాత్రమే అని, 96 శాతం విశ్వం ఇంకా కనిపెట్టబడక రహాస్యంగా మిగిలి ఉందన్న విషయం ఎంత మందికి తెలుసు?
అవును ఇది నిజం! ఇప్పటి వరకూ ఆధునిక సైంటిస్టుల ద్వారా మొత్తం విశ్వ వ్యవస్థలో కనిపెట్టబడిన, గుర్తించబడిన విశ్వం కేవలం 4 శాతం మాత్రమే!! మిగతా 96 శాతం విశ్వవ్యవస్థ ఏ మానవుని గ్రహణ పరిధికిలోనికి ఇంతవరకూ రాని ఓ అంతుచిక్కని రహాస్యం.
ఆ మిగతా 96 శాతం విశ్వం ఇంకా ఎంత ఉంది? దాని పరిధి ఎంత? అది ఏ యే పదార్థాలతో తయారైంది? దాని స్థితి ఏమిటి? దానిపై పనిచేసే సూత్రాలేమిటి? అన్నది ఆధునిక సైంటిస్టులకు సైతం అంతు చిక్కని మిస్టరీగా మిగిలిపోయింది.
అందుకే ఆధునిక సైంటిస్టుల గ్రహణ పరిధిలోకి రాని, ఇంకా కనిపెట్టబడలేని ఆ మిగతా 96 శాతం విశ్వాన్ని ‘డార్క్ మేటర్’ మరియు ‘డార్క్ ఎనర్జీ’గా పేర్కొనటం జరిగింది. ఆ మిగతా 96 శాతం విశ్వం తెలుసుకోవటానికి ఇంకా ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు పడుతుందో కూడా సైన్స్ ఇదమిత్థంగా చెప్పే స్థితిలో లేదు.
ఆ మిగతా 96 శాతం విశ్వ వ్యవస్థలో ఇంకా ఎన్ని కోట్ల గెలాక్సీలూ, మెగా గెలాక్సీలూ ఉన్నాయి.. వాటిలో ఇంకా ఎన్ని కోటాను కోట్ల నక్షత్రాలున్నాయి.. ఎన్ని కోట్ల గ్రహాలు ఉన్నాయి.. వాటిలో ఈ భూమిని పోలిన గ్రహాలు ఇంకా ఎన్ని ఉన్నాయి.. ఆ 96 శాతం విశ్వ వ్యవస్థపై పనిచేస్తున్న సూత్రాలేమిటి అన్న ప్రశ్నలకు సైన్స్ ముంగిటే సమాధానాలు లేవు.
ఇది మనిషి జ్ఞాన పరిధి ఎంత చిన్నదో అతను ఎంత బలహీనుడో ఎత్తి చూపే ఓ గొప్ప ఉదాహరణ. అయినప్పటికీ ఇంత స్వల్పమైన జ్ఞాన పరిధి కలిగిన మనుషుల్లో నాస్తికులనబడే కొందరు విచిత్ర జీవులు ఈ విశ్వ వ్యవస్థ వెనుక ఏ శక్తీ పనిచెయ్యటం లేదని, దానిపై ఏ సూత్రాలూ పనిచెయ్యటం లేదని, అదంతా హుళుక్కే అని గమ్మత్తైన స్వంత తీర్మానాలు చేసేస్తుంటారు నిస్సిగ్గుగా.
ఇంతవరకూ విశ్వవ్యవస్థే సన్స్ కు ఓ అంతు చిక్కని మిస్టరీ అయినప్పుడు “దాని వెనుక ఏ శక్తీ పని చెయ్యటం లేద”ని ఏ ప్రయోగ ఆధారం లేకుండానే, జ్ఞానం లేకుండానే తీర్మానించటం ఎంత ఘోరమైన అజ్ఞానమో కదా.
ఈ విశ్వ వ్యవస్థను కనిపెట్టే కొద్దీ దానిలోని ఆశ్చర్యకరమైన రహాస్యాలతో పాటు దానిని అంత అద్భుతంగా రూపొందించి, పటిష్టంగా అదుపు చేస్తున్న ఆ సృష్టికర్త యొక్క మహత్తు, గొప్పతనం కూడా బయటపడుతూనే ఉంటుంది. కాబట్టి మనిషి నిరంతరం భూమీ ఆకాశాలను గురించి పరిశీలన చేస్తూ ఉండాలి. ఇదే విషయాన్ని ఖురాన్ ఈ క్రింది విధంగా తెలుపుతుంది.
“భూమీ ఆకాశాల నిర్మాణం గురించి ఆలోచన చేసే వివేకవంతులకు ఎన్నో సూచనాలు ఉన్నాయి” – ఖురాన్ 3:190
Topic Link:
https://www.space.com/11642-dark-matter-dark-energy-4…
విశ్వం – 96 శాతం ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీ /-
