ఘన, ద్రవ, వాయువు అనే మూడు రకాల పదార్థాలతో నిర్మితమైన ఈ సమస్త సృష్టిలో మనిషి ప్రత్యక్షంగా చూడగలిగేవి కొన్ని ఉంటే అతను ప్రత్యక్షంగా చూడలేని “అదృశ్య” ప్రాకృతిక పదార్థాలు కూడా కొన్ని ఉన్నాయి.

అతను కొన్ని ప్రయోగాలు చేసి వాటి స్థితిని తెలుసుకోవటం తప్ప వాటిని ప్రత్యక్షంగా చూడటం మనిషి తరం కాదు. అలాగే సృష్టికర్త అయిన దేవుడు మనిషి కళ్లకు ప్రత్యక్షంగా కనపడడు. అయితే ఈ భూమిపై ఒక్క మనిషికి మాత్రమే కనపడే పదార్థాల ఆధారంగా ప్రయోగము, పరిశీలన చేసి కనపడని వాటిని గురించి అర్థం చేసుకునే ప్రత్యేక జ్ఞానాన్ని ప్రసాదించటం జరిగింది.

అందుకే అత్యద్భుతమైన విశ్వకర్మాగారం అతని ముందు ఉంచటం జరిగింది. అందులో గంభీరమైన క్రమశిక్షణ, క్రమబద్ధత, సమతూల్యత కనపడున్నాయి. ఎన్నో అద్భుతమైన విషయాలు మానవ దేహ నిర్మాణంలోనూ కనపడతాయి. అతని చుట్టూ ఉన్న ప్రకృతిలో ప్రపంచంలోనూ ఎన్నో అద్భుతాలు కనపడతాయి.

అవన్నీ అతని ముందు ఎందుకు పెట్టబడ్డాయంటే.. మనిషి తన అదుపులో లేని ఈ సమస్త సృష్టిని చూసి ఆలోచన చేసి దానిని ఎంతో క్రమశిక్షణతో అదుపుచేస్తున్న సృష్టికర్తను గుర్తించటానికి.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *