కెనడాలోని టొరంటో విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ మరియు ప్రముఖ పిండోత్పత్తి శాస్త్రవేత్త అయిన ప్రొఫెసర్ ఎల్. కీత్ మూర్ స్త్రీ గర్భంలో పిండం “మూడు దశల్లో” మరియు “మూడు చీకటి తెరల్లో” రూపుదిద్దుకుంటుందని నిర్ధారించటం జరిగింది.
ముఖ్యంగా గమనించాల్సింది 17 వ శతాబ్దంలో మొట్టమొదటి మైక్రో బయాలజిస్ట్ అయిన ‘లీవెన్ హుక్’ సూక్ష్మదర్శిని (Microscope) ని కనుగొన్న తరువాతే గర్భంలో పిండం యొక్క దశలను గురించి తెలుసుకోవటం జరిగింది. అయినప్పటికీ ప్రత్యుత్పత్తి వీర్య కణము (spermatozoon) ద్వారా అండం (Ovum) ఎలా ఫలదీకరణ చెంది మానవ పిండం ఏర్పడుతుంది మరియు దాని దశలను గురించి 1940 సం. తరువాతే ఆధునిక పిండోత్పత్తి శాస్త్రం కనిపెట్టగలిగింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నేడు ఆధునిక పిండోత్పత్తి శాస్త్రం పిండ దశలను గురించి ఏదైతే చెబుతుందో.. 1400 సం.ల క్రితమే ఖురాన్ ప్రకటించింది.
“ఆయన మీ తల్లుల గర్భాలలో ‘మూడేసి చీకటి తెరల’లో మీకు ఒక రూపం తరువాత మరొక రూపాన్ని ఇస్తూ పోతున్నాడు” – 39:6
“He makes you, in the wombs of your mothers, in stages one after another IN THREE VEILS OF DARKNESS” – 39:6
ఖురాన్ పై వాక్యంలో ప్రస్తావిస్తున్న “మూడు చీకటి తెరలు” అంటే-
1. Anterior abdominal wall (ఉదరకోశ గోడ)
2. The uterine wall (గర్భాశయ గోడ)
3. Amnio-chorionic membrane (అమినో క్రోనిక్ పొర).
ఈ విధంగా గర్భంలో పిండం మూడు చీకటి తెరల్లో రూపుదిద్దుకుంటుందని ‘ఆధునిక పిండోత్పత్తి శాస్త్రం (Modern Embryology Science)’ చెబుతున్న విషయాన్ని ఖురాన్ ఏనాడో ప్రకటించటం గమనార్హం.
అలాగే ‘ఫలదీకరణం’ (Fertilization) అంటే స్త్రీ గర్భంలో పిండం రూపుదాల్చటం అనే ప్రారంభ ప్రక్రియ నుండి మొదలుకుని గర్భంలో పిండం ముఖ్యంగా “మూడు దశలు (Three Stages)” దాటుకుంటూ పెరుగుతుందని ఆధునిక పిండోత్పత్తి శాస్త్ర మూల గ్రంథమైన “Basic Human Embryology” ఈ క్రింది విధంగా చెబుతుంది.
“గర్భంలో శిశువు ముఖ్యంగా మూడు దశలను దాటుకుంటూ పెరుగుతుంది అన్నది. అవి “Pre-embryonic” ఈ దశ మొదటి రెండున్నర వారాలు కొనసాగుతుంది. “Embryonic” ఈ దశ ఎనిమిదవ వారం వరకు కొనసాగుతుంది. “Fetal” ఈ దశ ఎనిమిదవ వారం నుండి పుట్టే వరకు కొనసాగుతుంది” – (P. Williams, Basic Human Embryology, 3rd ed., 1984 p.64).
………..
కొసమెరుపు ఏమిటంటే.. ప్రొఫెసర్ ఎల్. కీత్ మూర్ గర్భంలో పిండ దశలను గురించి ఖురాన్ చెబుతున్న సమాచారాన్ని వివరిస్తూ “A SCIENTIST’S INTERPRETATION OF REFERENCES TO EMBRYOLOGY IN THE QUR’AN” అనే జర్నల్ ల్లో ఒక ఆర్టికల్ రాయటం జరిగింది. దాని తెలుగు అనువాదాన్ని ఈ క్రింది చదువగలరు.
“తరువాత అతనిని ఒక సురక్షితమైన స్థానంలో పడే ఒక వీర్య
బిందువు (Nutfa) గా మార్చాము” – ఖురాన్ 23:13
అన్న ఈ వాక్య భాగం స్త్రీ గర్భాశయంలోని “పురుష వీర్యకణం” స్త్రీ “అండం” (Ovum) తో కలిసి బీజం (zygote) ఏర్పడే స్థితిని వివరిస్తుంది.
“ఆ తరువాత ఆ ఇంద్రియ బిందువును రక్తపు ముద్ద ఆకారాన్ని ఇచ్చాము” – ఖురాన్ 23:14
ఎప్పుడైతే ‘అండం (Ovum)’ ఫలదీకరణం (Fertilization) చెందుతుందో అది “ఫేలోప్పియన్ ట్యూబ్” ద్వారా స్త్రీ గర్భం (uterus) కు చేరుకుని ఒక గడ్డకట్టిన రక్తపు ముద్ద ఆకారంలో రూపాంతరం చెందుతుంది. ఇదే విషయాన్ని ఖురాన్ “ఆ తరువాత ఈ బిందువుకు ముద్ద ఆకారాన్ని ఇచ్చాము” అని పేర్కొంటుంది.
ఇదే విషయం ఖురాన్ లో మరోకచోట- “మేము మిమ్మల్ని వీర్యపు బొట్టుతో ఆ పైన రక్తపు గడ్డతో సృష్టించామని” – 22:5 వివరిస్తుంది.
ఇక 23:14 వ వాక్యం అరబీ మూలంలో “ముద్ద ఆకారం” అన్న చోట “Alaqah” అని చూడగలం. ఈ పదానికి మూడు అర్థాలు ఉన్నాయి 1. జలగ 2. వ్రేలడే వస్తువు 3. రక్తపు గడ్డ. గమనార్హమైన విషయం ఏమిటంటే గర్భంలో పిండం ప్రారంభ దశలో అంటే 15 వ రోజు నుండి 24 వ రోజు వరకు ఒక “జలగ” ఆకారంలోనే ఉంటుంది.
“ఆ పైన ఆ ముద్దను కండగా చేశాము” – ఖురాన్ 23:14
పై వాక్య భాగం పిండం యొక్క రెండవ దశను వివరిస్తుంది. ఈ వాక్యం అరబీ మూలంలో “కండ” అనే పదం “Mudghah” అని చూడగలం. అంటే “నమలబడిన ఒక పదార్థం వంటిది” అని అర్థం. వివరంగా చెప్పాలంటే జలగ ఆకారం నుండి పిండం ఒక నమలబడిన మాంసం ముద్ద ఆకారంలో మారుతుంది అని అర్థం.
“తరువాత ఆ మాంసపు కండను ఎముకలుగా చేశాము” – ఖురాన్ 23:14
“తరువాత ఆ మాంసపు కండను ఎముకలుగా చేశాము” అంటే- గర్భంలో పిండం “ఒక మాంసపు ముద్ద” ఆకారం (Mudghah) స్థితిలో 6 వారాల వరకు మాత్రమే ఉంటుంది, ఆ తరువాత నుండే ఎముకల నిర్మాణం ప్రారంభం అవుతుంది! ఇది మాంసపు కండ నుండి ఎముకలు ఏర్పడే దశ. ఎముకల నిర్మాణం ప్రారంభమైన తరువాత నుండి అంటే దాదాపు 8 లేదా 9 వారాల నుండి ఖచ్చితమైన కండరాల అభివృద్ధి మొదలై శరీర నిర్మాణం పూర్తిగా రూపుదిద్దుకుంటుంది.
ఈ విధంగా ఈనాటి ఆధునిక పిండోత్పత్తి శాస్త్రం (Modern Embryology science) గర్భంలో పిండం మూడ దశల్లో మూడేసి చీకటి తెరల్లో రూపుదిద్దుకుంటుందని ఏదైతే ఆవిష్కరించిందో దానిని ఖురాన్ ఎంతో సవివరంగా 1400 సం. కు ముందే ఎలా ప్రకటించగలిగింది? అన్నదే ఆలోచనాపరులు దీర్ఘంగా ఆలోచించాల్సిన ప్రశ్న.
Md Nooruddin
