పిండ నిర్మాణ దశలు – ఏనాడో పేర్కొన్న ఖురాన్ – ఆధునిక సైన్స్ ధృవీకరణ

1604 సం. లో ఫాక్సికస్ అనే శాస్త్రవేత్త పిండం యొక్క కొన్ని అద్భుతమైన చిత్రాలను మొట్టమొదట ఆవిష్కరించాడు. ఆ తరువాత 1672 సం.లో ఆధునిక పిండోత్పత్తి శాస్త్ర పితామహుడిగా పరిగణించబడ్డ ‘మాల్ఫిగి’ పిండోత్పత్తి దశల (Embryonic stages) కు సంబంధించిన మరికొన్ని ఆధునిక చిత్రాలను ఆవిష్కరించాడు. ఆ తరువాత 1694 లో ‘హర్త్టోకేర్’ అనే శాస్త్రవేత్త మరికాస్త ముందుకెళ్లి మానవ స్పెర్మటోజూన్ (ప్రత్యుత్పత్తి వీర్యకణం) లేదా ‘అండం (ovum)’ ద్వారా మానవ దేహానిర్మాణం ఏర్పడుతుందన్న క్రొత్త విషయాన్ని ఆవిష్కరించాడు. ఆ తరువాత 1775 సం.లో ‘స్పల్లన్జాని’ అనే శాస్త్రవేత్త పిండాభివృద్ధికి ‘అండము (ovum)’ మరియు వీర్యం (Sperm) యొక్క అవశ్యకతను వివరించినప్పుడు ఈ వివాదం కొంత వరకు ముగిసింది. మొత్తానికి 17 వ శతాబ్దంలో మొట్టమొదటి మైక్రో బయాలజిస్ట్ అయిన ‘లియువెన్హోక్’ సూక్ష్మదర్శిని (Microscope) ని కనుగొన్న తరువాతే ఆధునిక పిండోత్పత్తి శాస్త్రం (Embryological science) అభివృద్ధి దశ ప్రారంభం అయిందని చెప్పవచ్చు.

ఆ తరువాత ప్రత్యుత్పత్తి వీర్య కణము (spermatozoon) ద్వారా అండం ఎలా ఫలదీకరణ చెందుతుంది అన్న అంశానికి సంబంధించి 1940 సం. తరువాతే ఆధునిక పిండోత్పత్తి శాస్త్రం ద్వారా క్రొత్త క్రొత్త ఆవిష్కరణలు జరిగాయి.

******

పిండ నిర్మాణ దశలను ఖురాన్ ఏనాడో పేర్కొనటం జరిగింది:

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఖురాన్ లో స్త్రీ గర్భంలో పిండోత్పత్తి… పిండ నిర్మాణ దశలను గురించి ఏదైతే చెప్పబడిందో… అది ఈనాటి పిండోత్పత్తి శాస్త్రజ్ఞులు (Embryological Scientists) కనిపెట్టిన ఆధునిక ఆవిష్కరణలకు నూటికి నూరుశాతం సరిపోవటం అన్నది! ఈనాటి ‘ఆధునిక పిండోత్పత్తి శాస్త్రం (Modern Embryology Science)’ చెబుతున్న విషయం ఏమిటంటే – గర్భంలో మానవ దేహ నిర్మాణం వివిధ ప్రత్యేక దశల్లో జరుగుతుందన్నది. దానినే ఖురాన్ ఈ క్రింది విధంగా వివరిస్తుంది.

“వాస్తావానికి ఆయన మిమ్మల్ని వివిధ దశల్లో సృష్టించాడు” – 71:14

గర్భంలో శిశువు వివిధ దశల్లో అభివృద్ధి చెందుతుందని పై ఖురాన్ వాక్యం ద్వారా తెలుస్తుంది. మానవ పునరుత్పత్తి అన్నది స్త్రీ,పురుష లైంగిక సంపర్కంతో ప్రారంభం అవుతుంది. పురుషుడు ఒకసారి విడిచే వీర్యంలో 350,000,000 ల ప్రత్యుత్పత్తి వీర్యకణాలు (spermatozoa) ఉంటాయి. వాస్తవానికి వివిధ గ్రంధుల (SEMINAL VESICLES, PROSTATE GLAND, COWPERS GLANDS) నుండి ఉత్పత్తి అయ్యే అనేక రకాల పదార్థాలతో కలిసిన ద్రవం “Seminal Fluid (సెమినల్ ఫ్లూయిడ్)” మరియు “వీర్యకణాల” (Sperm cells)” “మిశ్రమ ద్రవపదార్థమే (a mixture sperm-drop)- “వీర్యం” అన్నది తెలుసుకోవాల్సిన విషయం. ఈ మిశ్రమ వీర్య బిందువుతోనే మనిషి పుట్టించబడతాడన్న విషయాన్ని ఖురాన్ ఏనాడో తెలిపింది.

“మేము మానవుణ్ణి “ఒక మిశ్రమ వీర్య బిందువు (a mixture sperm-drop)” తో సృష్టించాము” – 76:2
వాస్తవానికి ఆధునిక జీవశాస్త్రం (Modern Biology) చెప్పేది ఏమిటంటే స్త్రీ అండాశయం (ovaries) నుండి విడుదల అయ్యే ‘అండం’ ఫలదీకరణం చెందటానికి (లేదా గర్భం దాల్చటానికి) 350,000,000 పురుష వీర్యకణాలలో కేవలం ఒక్క ‘వీర్యకణం’ (స్పెర్మటోజూన్/spermatozoon) సరిపోతుందన్నది. ఈ విషయాన్ని ఖురాన్ ఈ క్రింది విధంగా ముందే ప్రస్తావించిందన్నది గమనార్హం.

“ఆయన మానవుణ్ణి స్వల్పమైన వీర్యబిందువు (a sperm) తో సృష్టించాడు” – 16:4

“అతడు (తల్లి గర్భంలో) స్ఖలించబడిన ఒక వీర్య బిందువు (a sperm) కాడా? – 75:36

పై వాక్యాలను అరబ్బీ మూలంలో గమనిస్తే వాటిలో “నుత్ఫత్ / Nutfat” అన్న పదానికి “అతి స్వల్పమైన వీర్యబిందువు (a minute quantity of semen)” అని అర్థం. అంటే వీర్యంలో అతిస్వల్పమైన భాగం లేదా ఒక కణం అని చెప్పవచ్చు. వాస్తవానికి స్త్రీ, పురుషుల కలయికలో పురుషుడు వీర్యం స్ఖలించినప్పుడు ఆ వీర్యం మొట్టమొదట “సెర్విక్స్” (cervix) నుండి గర్భాశయం “Uterus / యుటరస్” ద్వారా ప్రయాణించి “ఫేలోపియన్ ట్యాబ్” (Fallopian tube) కి చేరుకుంటుంది. ప్రతీ స్త్రీకి గర్భాశయం ఇరుప్రక్కలా రెండు అండాశయాలు (ovaries) ఉంటాయి. వాటి ద్వారానే దాదాపు ప్రతీ 28 రోజులకు ఒకసారి అండం (Ovum) అనేది విడుదల అయి “ఫేలోపియన్ ట్యాబ్” లో చేరుకుంటుంది. ఈ అండం పురుష వీర్య కణం తో కలిసినప్పుడే ‘ఫలదీకరణం’ (Fertilization) అంటే పిండం రూపుదాల్చటం అనేది ప్రారంభం అవుతుంది.

******

గర్భంలో శిశువు యొక్క “మూడు చీకటి దశల”ను గూర్చి నేటి ఆధునిక పిండోత్పత్తి శాస్త్రం ఏమని చెబుతుంది?

‘ఫలదీకరణం’ (Fertilization) అంటే స్త్రీ గర్భంలో పిండం రూపుదాల్చటం అనే ప్రారంభ ప్రక్రియ నుండి మొదలుకుని గర్భంలో పిండం ముఖ్యంగా మూడు దశలు దాటుకుంటూ పెరుగుతుందని ఆధునిక పిండోత్పత్తి శాస్త్ర మూల గ్రంథమైన “Basic Human Embryology” ఈ క్రింది విధంగా చెబుతుంది.

“The Life in the Uterus has THREE STAGES: Pre-embryonic; – First two and half weeks, Embryonic;- Until the end of the eight week, and Fetal;- from the eight week to labor” – (P. Williams, Basic Human Embryology, 3rd ed., 1984 p.64)

దీని అర్థం- గర్భంలో శిశువు ముఖ్యంగా మూడు దశలను దాటుకుంటూ పెరుగుతుంది అన్నది. అవి “Pre-embryonic” ఈ దశ మొదటి రెండున్నర వారాలు కొనసాగుతుంది. “Embryonic” ఈ దశ ఎనిమిదవ వారం వరకు కొనసాగుతుంది. “Fetal” ఈ దశ ఎనిమిదవ వారం నుండి పుట్టే వరకు కొనసాగుతుంది.

******

గర్భంలో పిండం మూడేసి చీకటి తెరల్లో రూపుదిద్దుకుంటుంది – ఖురాన్ ఈ విషయాన్ని ఏనాడో ప్రకటించింది:

“ఆయన మీ తల్లుల గర్భాలలో మూడేసి చీకటి తెరలలో మీకు ఒక రూపం తరువాత మరొక రూపాన్ని ఇస్తూ పోతున్నాడు” – 39:6

“He makes you, in the wombs of your mothers, in stages one after another in three veils of darkness” – 39:6

ఖురాన్ పై వాక్యంలో ప్రస్తావిస్తున్న మూడు చీకటి తెరలు అంటే 1. Anterior abdominal wall (ఉదరకోశ గోడ) 2. the uterine wall (గర్భాశయ గోడ) 3. Amnio-chorionic membrane (అమినో క్రోనిక్ పొర). ఈ విధంగా గర్భంలో పిండం మూడు చీకటి తెరల్లో రూపుదిద్దుకుంటుందని ‘ఆధునిక పిండోత్పత్తి శాస్త్రం (Modern Embryology Science)’ చెబుతున్న విషయాన్ని ఖురాన్ ఏనాడో ప్రకటించటం గమనార్హం.

ఖురాన్ పేర్కొంటున్న దశలవారీ పిండ నిర్మాణం:

స్త్రీ గర్భంలో పిండ నిర్మాణం ఒకదాని తరువాత మరొకటి దశలవారీగా జరిగే ప్రక్రియను గురించి ఖురాన్ ఎంత స్పష్టంగా వివరిస్తుందో ఒకసారి ఈ క్రింది గమనించగలరు.

“మేము మానవుణ్ణి మట్టి యొక్క సారం నుండి సృష్టించాము; తరువాత అతనిని ఒక సురక్షితమైన స్థానంలో పడే ఒక వీర్య బిందువుగా మార్చాము, / ఆ తరువాత ఈ బిందువుకు ముద్ద ఆకారాన్ని ఇచ్చాము, / ఆ పైన ఆ ముద్దను కండగా చేశాము, / తరువాత ఆ మాంసపు కండను ఎముకలుగా చేశాము, / ఆ తరువాత ఎముకలకు మాంసాన్ని తోడిగాము, / ఆ పైన దానిని భిన్నమైన సృష్టిగా చేసి నిలబెట్టాము. కనుక అల్లాహ్ ఎంతో శుభప్రదుడు” – 23: 12-14

గర్భంలో పిండ నిర్మాణ దశలను గురించి ఖురాన్ ఏదైతే పేర్కొంటుందో అది ప్రస్తుత ఆధునిక మెడికల్ సైన్స్ కు సరిపోతుందా? లేక వ్యతిరేకంగా ఉందా? అన్నది కాస్త వివరంగా పరిశీలిద్దాం.

1. “తరువాత అతనిని ఒక సురక్షితమైన స్థానంలో పడే ఒక వీర్య బిందువు (Nutfa) గా మార్చాము” అన్న వాక్య భాగం స్త్రీ గర్భాశయంలోని పురుష వీర్యకణం స్త్రీ అండం (Ovum) తో కలిసి బీజం (zygote) ఏర్పడే స్థితిని వివరిస్తుంది.

2. “ఆ తరువాత ఈ బిందువుకు ముద్ద ఆకారాన్ని ఇచ్చాము” అన్న వాక్యభాగాన్ని గమనిస్తే ఎప్పుడైతే అండం ఫలదీకరణం (Fertilization) చెందుతుందో అది ‘ఫేలోప్పియన్ ట్యూబ్’ ద్వారా స్త్రీ గర్భం (uterus) కు చేరుకుని ఒక గడ్డకట్టిన రక్తపు ముద్ద ఆకారంలో రూపాంతరం చెందుతుంది. ఇదే విషయాన్ని ఖురాన్ “ఆ తరువాత ఈ బిందువుకు ముద్ద ఆకారాన్ని ఇచ్చాము” అని పేర్కొంటుంది.

ఇదే విషయం ఖురాన్ లో మరోకచోట- “మేము మిమ్మల్ని వీర్యపు బొట్టుతో ఆ పైన రక్తపు గడ్డతో సృష్టించామని” – 22:5 చెబుతుంది. స్త్రీ గర్భంలో ఈ దశ- పిండం రూపుదాల్చుకున్న 15 వ రోజు నుండి 24 వ రోజు వరకు సాగుతుంది. ఆ తరువాత పిండం ఒక “జలగ” ఆకారంలో రూపాంతరం చెందుతుంది. ఇక ఈ వాక్యం అరబీ మూలంలో “ముద్ద ఆకారం” అన్న చోట “Alaqah” అని చూడగలం. ఈ పదానికి మూడు అర్థాలు ఉన్నాయి 1. జలగ 2. వ్రేలడే వస్తువు 3. రక్తపు గడ్డ. గమనార్హమైన విషయం ఏమిటంటే గర్భంలో పిండం ప్రారంభ దశలో ఒక జలగ ఆకారంలోనే ఉంటుందన్నది.

3. “ఆ పైన ఆ ముద్దను కండగా చేశాము” అన్న వాక్య భాగం పిండం యొక్క రెండవ దశను వివరిస్తుంది. ఈ వాక్యం అరబీ మూలంలో “కండ” అనే పదం “Mudghah” అని చూడగలం. అంటే “నమలబడిన ఒక పదార్థం వంటిది” అని అర్థం. వివరంగా చెప్పాలంటే జలగ ఆకారం నుండి పిండం ఒక నమలబడిన మాంసం ముద్ద ఆకారంలో మారుతుంది అని అర్థం.

4. “తరువాత ఆ మాంసపు కండను ఎముకలుగా చేశాము” అంటే- గర్భంలో పిండం “ఒక మాంసపు ముద్ద” ఆకారం (Mudghah) స్థితిలో 6 వారాలవరకు మాత్రమే ఉంటుంది, ఆ తరువాత 7 వ వారం ప్రారంభం నుండే ఎముకల నిర్మాణం ప్రారంభం అవుతుంది! తరువాత 8 నుండి 9 వారాల వరకు పిండం మానవ రూపం దాల్చికుంటుంది. ఇది మాంసపు కండ ఎముకలుగా మారే దశ.

5. “ఆ తరువాత ఎముకలకు మాంసాన్ని తోడిగాము” అంటే- “మాంసపు ముద్ద” ఆకారంలో ఉన్న పిండం 7 వ వారం ప్రారంభం నుండే అస్తిపంజరంగా రూపుదిద్దుకోవటం ప్రారంభమై … ఆ తరువాత నుండి అంటే దాదాపు 8 లేదా 9 వారాల నుండి ఖచ్చితమైన కండరాల అభివృద్ధి మొదలై శరీర నిర్మాణం రూపుదాల్చటం ప్రారంభం అవుతుంది. ఆ తరువాతే పిండం సంపూర్ణంగా మానవ ఆకారంలో రూపుదిద్దుకోవటం జరుగుతుంది.

ఈ విధంగా ఈనాటి ఆధునిక పిండోత్పత్తి శాస్త్రం (Modern Embryology science) మనిషి శరీర నిర్మాణ దశలను గురించి ఏదైతే చెబుతుందో దాని ఖురాన్ ఎంతో సవివరంగా 1400 సం. కు ముందే స్పష్టంగా పేర్కొనటాన్ని బట్టి ఖురాన్ కొందరు ఊహిస్తున్నట్టుగా మానవ విరచిత గ్రంథం కాదన్న విషయం తేటతెల్లమవుతుంది

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *