క్రైస్తవుల్లో ఉన్న ఒక అతిపెద్ద అపార్థం ఏమిటంటే- ముస్లిములు క్రైస్తవులకు ఎంతమాత్రం సన్నిహితులు కారు కానీ, ఒక్క యూదులు మాత్రమే క్రైస్తవులకు అత్యంత సన్నిహితులు అన్నది.
ఇది ముస్లిముల పట్ల క్రైస్తవులు కలిగి ఉండే పూర్తి వ్యతిరేక భావన అని చెప్పవచ్చు. ఈ వ్యాసం జాగ్రత్తగా పరిశీలిస్తే.. నిజానికి క్రైస్తవులకు సన్నిహితులు యూదులు కారు.. కానీ, ముస్లిములు మాత్రమే అన్న విషయం తేటతెల్లమవుతుంది.
విశ్వాసపరంగానూ క్రైస్తవులకు యూదులు సన్నిహితులు కారు!
యేసు కూడా జాతిపరంగా యూదుడే కావచ్చు! అంత మాత్రానా యూదులంతా క్రైస్తవులకు సన్నిహితులని భావించటం అమాయకత్వం అవుతుంది. యేసును ‘మెస్సీయ’ అని అంగీకరించక తిరస్కరించి, ఆయన అక్రమ సంతానమని ఆయనపై ఘోరమైన నింద మోపి, ఆయనపై ఉమ్మి, గుద్ది ఆయన్ని శాపగ్రస్తమైన సిలువ శిక్షకు గురిచేసింది కూడా యూదులే.
యేసు బోధలో ఉన్న విశ్వాసాలను సైతం గమనిస్తే.. యేసు- “దేవుడొక్కడే ఆయన తండ్రి అయిన యెహోవా అని నమ్మి, మోషేను ప్రవక్తగా విశ్వసించి ఆయన తెచ్చిన ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తూ తనను మెస్సీయగా విశ్వసిస్తేనే నిత్యజీవం లభిస్తుందని చెప్పారు.
యూదులు నమ్మే విశ్వాసం- “దేవుడొక్కడే ఆయన తండ్రి అయిన యెహోవా మరియు మా కొరకు ఒక్క మోషే మాత్రమే ప్రవక్త” అన్నది. యేసు ‘మెస్సీయ’ ఎంతమాత్రం కాదు అన్నది యూదుల విశ్వాసం. చివరకు యూదులు ఎంతవరకూ వెళ్లారంటే యేసు పుట్టుకే హీనమైన పుట్టుక అనేంత వరకూ వెళ్లారు. ఒకానొక సందర్భంలో యూదులు “మేము వ్యభిచారం వల్ల పుట్టినవారము కాదు.. నీవు సమరయుడవును దయ్యం పట్టిన వాడవును (యోహాను 8:41-48)” అని చెప్పి ఆయనది అతి హీనమైన పుట్టుక అని నిందలు మోపారు.
నిజానికి యూదుల దృష్టిలో సమరేయులు అంటే.. తృణీకరించబడిన అతి హీనమైన జాతిగా పరిగణించేవారు. ఆ విధంగా యేసును ‘నీవు సమరేయులకు పుట్టినవాడవు’ అని నిందించటాన్ని బట్టి ఆయనను కనీసం తమకు చెందిన యూదు జాతీయుడు అని అంగీకరించటానికి కూడా చాలా అసహ్యంగా భావించేవారు.
ఈ ఆక్రోశమే వారికి అత్యంత పవిత్ర గ్రంథమైన తల్ముద్ లో యేసు గురించి అత్యంత హీనమైన రాతలు యూద పండితుల ద్వారా రాయించింది. తల్ముద్ లో యేసు గురించి, కన్య మేరీ గురించి, క్రైస్తవుల గురించి అతి దారుణమైన రాతలు రాసుకున్నారు.
బహుశా యూదులు తమ గురించి, తాము ప్రాణపదంగా ప్రేమించే యేసు, కన్యమేరీల గురించి తల్ముద్ లో ఎలాంటి రాతలు రాసుకున్నారో ఈనాటి చాలా మంది క్రైస్తవులకు తెలియదు.
యూదులు తాము పవిత్రంగా భావించే తల్ముద్ లో .. “యేసు కన్యమరియకు పుట్టిన అక్రమ సంతానం (Sanhedrin 106 a)” అని రాసుకున్నారు. అంతేకాదు, “తల్ముద్ ను గౌరవించని క్రైస్తవులంతా నరకాని పోతారని.. (Rosh Hashanah 17a), “క్రొత్తనిబంధన చదివే క్రైస్తవులకు పరలోకంలో స్థానం ఉండదని.. (Sanhedrin 90 a) రకరకల పిచ్చి రాతలు రాసుకున్నారు.
యూదుల ఈ వ్యవహారానికి పూర్తి వ్యతిరేకంగా ప్రవక్త ముహమ్మద్ (స) యేసు మెస్సీయ అని, ఆయన పరిశుద్ధుడని సాక్ష్యమివ్వటమే కాక, ఏ ముస్లిమైతే అల్లాహ్ నూ, ప్రవక్త ముహమ్మద్ (స) ను విశ్వసించి నప్పటికీ యేసును ‘మెస్సీయ’ అని అంగీకరించడో అతడు ముస్లిం కాజాలడని చెప్పి.. యేసును ‘మెస్సీయ’గా విశ్వసించటాన్ని ముస్లిముల విశ్వాసంలో ఒక భాగం చేసేశారు.
కన్యమేరీ పరిశుద్ధురాలని, ప్రపంచ మహిళల్లో ఆమెకు ఉన్నత స్థానం ఇవ్వబడిందని సాక్ష్యామిచ్చారు. ఆయన పై అవతరించిన ఖురాన్ గ్రంథంలో కన్యమేరీ పేరుతో ఒక అధ్యాయమే ఉంది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు రెండువందల కోట్లకుపైగా ఉన్న ముస్లిములు యేసును ‘మెస్సీయ’ అని అంగీకరిస్తారు. ఏ యెహోవానైతే బైబిల్ దేవుడని ప్రకటిస్తుందో అదే యెహోవాను ‘అల్లాహ్’ అన్న పేరుతో ప్రవక్త ముహమ్మద్ (స) పరిచయం చేశారు.
చాలా మంది క్రైస్తవులకు తెలీని విషయం- హెబ్రూ బైబిల్ ను అరబ్బీ భాషలో అనువాదం చేసినప్పుడు క్రైస్తవ పండితులు ఎక్కడెక్కడైతే ‘యెహోవా’ అని ఉంటుందో అక్కడ ‘అల్లాహ్’ అనే అనువాదం చేశారు. మరీ ముఖ్యంగా అరమాయిక్ బైబిల్లో ‘యెహోవా’ అన్న పదం ‘అల్లాహ్’ అనే ఉంటుంది. సెమిటిక్ భాషలైన ‘హెబ్రూ, అరమాయిక్, అరబ్బీ’ భాషల్లో సృష్టికర్త అయిన దేవుడు ‘యహ్వే, ఎలాహ్, అల్లాహ్’ వగైరా పేర్లతో పిలువబడినట్లు చూడగలం.
ఇక క్రైస్తవులు, ముస్లిముల విషయంలో వ్యతిరేకించే విషయం ఏదైనా ఉందంటే.. అది ముస్లిములు యేసును మెస్సీయగా తప్ప దేవునిగా అంగీకరించరన్నది. కనీసం యూదులు, యేసును మెస్సీయగా కూడా అంగీకరించరు కదా! ఆయనది చరిత్రలో ఒక కల్పిత పాత్ర అని కొట్టిపారేస్తారు. అది ప్రక్కన పెడితే.. స్వయంగా యేసే బైబిల్లో తండ్రి అయిన యెహోవాను ఏకైక దేవుడని, తనను మెస్సీయగా అంగీకరిస్తేనే నిత్యజీవం అని చెప్పారు తప్పితే.. ఈ విశ్వాసానికి రివర్సులో నేటి క్రైస్తవుల మాదిరిగా తనను దేవునిగా అంగీకరిస్తేనే నిత్యజీవం లభిస్తుందని ఎక్కడా చెప్పలేదు.
ఆ ప్రకారంగా చూస్తే ఖురాన్, బైబిల్లో యేసు చెప్పిన విశ్వాసాన్ని నూటికి నూరుశాతం ధృవీకరిస్తుంది. యేసు బోధించిన విశ్వాసానికి నూటికి నూరు శాతం రివర్సులో విశ్వాసం కలిగి ఉన్నది నేటి బైబిల్ అవగాహన సరిగ్గాలేని క్రైస్తవులే అనటం అతిశయోక్తి కాదు.
పైగా యూదులు క్రైస్తవులకు పైకి సన్నిహితులుగా ఉన్నట్లు నటిస్తూనే.. ఇస్లాం పట్ల విపరీతమైన ధ్వేషం కలిగి ఉంటారు. దానికి కారణం క్రైస్తవం కంటే ఇస్లాం అతి వేగంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించటం.. పాలస్తీనా, జెరూసలేములు ముస్లిముల ఆధీనంలోకి వెళ్లిపోవటం, అక్కడ ఇస్లాం బోధించబడటం.. యూదులు నిలువనీడ లేకుండా వేల సంవత్సరాలు ప్రపంచదేశాల్లో చెదిరిపోవటం.. ఇప్పటికీ యూదులు ప్రపంచంలో అతి చిన్న వర్గంగా మిగిలిపోవటం.. క్రైస్తవులను అన్ని విధాలుగానూ ఇస్లాం ఆకర్షించటం.. అనేక మంది క్రైస్తవులు ఇస్లాం స్వీకరిస్తూ పోవటం.. అనేకమంది యూదులు సైతం ఇస్లాంను స్వీకరించటం.. ఇది ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని ప్రజలను తమ కనుసన్నల్లో ఆడించాలనుకునే యూదులకు మింగుడు పడని విషయం.
కానీ, బైబిల్ ను ఏ కాస్త అవగాహనతో చదివిన క్రైస్తవుడైనా అందులో దేవుడు ఒక్కడే, యేసు ‘మెస్సీయ’ అన్న విషయాన్ని గ్రహించటంతో పాటు ఖురాన్ ను కూడా చదివితే ఇవే విశ్వాసాలను బోధిస్తున్న ఇస్లాంను వెంటనే అంగీకరించగలుగుతాడు.
కాబట్టి ముస్లిముల పట్ల విరోధం విషయంలో యూదులు ముందంజలో ఉంటే.. ముస్లిముల పట్ల అతి సన్నిహితులుగా క్రైస్తవులే ఉంటారు. కాబట్టి క్రైస్తవులకు సన్నిహితులు ముస్లిములే కాగలరు తప్పితే యూదులు కాలేరు.. ఇదే విషయం ఖురాన్ ఈ క్రింది విధంగా ప్రకటిస్తుంది.
“ముస్లిముల పట్ల విరోధం విషయంలో యూదులను, బహుదైవారాధకులను అందరికంటే ఎక్కువ ప్రచండులుగా కనుగొంటావు. విశ్వాసుల పట్ల మైత్రీ విషయంలో “మేము క్రైస్తవులం” అని అన్న వారిని అత్యంత సన్నిహితులుగా చూస్తావు” – ఖురాన్ 5:82
క్రైస్తవులకు సన్నిహితులు యూదులా? ముస్లిములా?
