భజరంగ్ దళ్, ఆర్.ఎస్.ఎస్ లాంటి హిందుత్వ అతివాద సంస్థలు, క్రైస్తవంలో కొందరు మతోన్మాదం తలకెక్కినోళ్లు మాత్రమే ఇస్లామోఫోబియాను ప్రదర్శిస్తుంటారని అనుకుంటే పప్పులో కాలేసినట్టే!

అవసరం ఉన్నా లేకున్నా కెలికి మరీ ఇస్లామోఫోబియాను, ముస్లిం సమాజం పట్ల ద్వేషాన్ని కొందరు నాస్తికోన్మాదులు వెళ్లగక్కుతూ ‘నాస్తికానందాన్ని’ పొందుతుంటారన్న విషయాన్ని ఆ నాస్తికోన్మాదుల ఫేస్బుక్ వాల్స్ చూస్తే అర్థమవుతుంది.

కాకపోతే ఇస్లామోఫోబియాను ప్రదర్శించే నాస్తికోన్మాదులు “మేము ఒక్క ఇస్లాంనే కాదు అన్ని మతాల్నీ విమర్శిస్తుంటాం” అని కవరింగ్ ఇచ్చుకుంటూ ఉంటారు.

మా స్వంత మతాన్ని విమర్శించుకుంటే అన్ని మతాల్నీ విచ్చలవిడిగా విమర్శించటానికి ఫ్రీ లైసెన్స్ దొరికేసినట్టే అన్న దిగజారుడు భావన కలిగి ఉండటమే వీరి ప్రత్యేకతల్లో ఒకటి.

నాస్తికత్వం పాటిస్తున్నానన్న ఉబలాటంలో ఇస్లామోఫోబియాను ప్రదర్శిస్తూ ఎడిపడితే అలా అర్థం పర్థం లేకుండా పోస్టులు పెట్టే కొందరిలో ఒకరే ఈ క్రింది పోస్టు పెట్టిన గౌవనీయులైన నాస్తికులు. ఇదొక్కటే కాదు ఇస్లాంను, ముస్లిం సమాజాన్ని గుడ్డిగా విమర్శిస్తూ వీరు పెట్టిన ఇంకా అనేక పోస్టులు వీరి వాల్ పై చూడవచ్చు.

వీరి ముందు ఎవడో సన్నాసి “మేము మొఘల్స్ & నిజామ్స్ వారసులం” అని చెప్పుకున్నాడంట. దీనితో ఇస్లామోఫోబియా అనే మెంటల్ ప్రాబ్లం ఆల్రెడీ ఉండటం మూలానా పాపం తట్టుకోలేక లాజిక్కులన్నీ ప్రక్కనపెట్టేసి మొత్తం ముస్లిం సమాజమంతా మొఘల్స్ & నిజామ్స్ వారసులమని చెప్పుకుంటున్నారన్నట్టు ఫీలైపోయి ఈ క్రింది పోస్టు పెట్టుకుని నాస్తికానందాన్ని పొందారు.

భారతదేశంలో మొఘల్స్ కంటే ముందు నుండే ముస్లిములు ఉన్నారు. ముస్లిములంటే ఒక్క భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారు. అలాంటప్పుడు ముస్లిములంతా మొఘల్స్ & నిజామ్స్ వారసులెలా అవుతారు? అన్న కనీస లాజిక్ ను ఈ పోస్టు పెట్టే ముందు ఉపయోగించాలి కదా.

ఎవడో సన్నాసి బుర్ర లేకుండా వాగినంత మాత్రానా ఆ స్టేట్ మెంట్ పట్టుకుని మొత్తం ముస్లిం సమాజాన్ని విమర్శించటం తప్పవుతుందన్న కనీస ఆలోచన ఈ క్రింది పోస్టు పెట్టే ముందు ఉండాలి కదా.

అసలు ఏ ముస్లిం దళితులపై విషం కక్కాడు? నిజానికి కులవివక్ష, హింసల కారణంగా భారతదేశంలో ఇస్లాం స్వీకరించిన దళితులే ఎక్కువ మంది ఉన్నారు. బ్రాహ్మణ సమాజం దళితుల పట్ల ప్రదర్శిస్తున్న వివక్ష నేపథ్యంలో వారిని అక్కున చేర్చుకున్న వారు ముస్లిములు, ఇస్లాం ధర్మమే. వారిలో ఎందరో బుద్ధిజాన్ని, క్రైస్తవ్యాన్ని కూడా స్వీకరించారు.

భారతదేశంలో అధికాశాతం మంది దళితులు ఇస్లాం స్వీకరించటానికి కారణం మానవులంతా ఒకే జంట సంతానం, ఏ ఒక్కరూ మరొకరిపై ఎలాంటి ఆదిక్యతా కలిగి లేరు సతప్రవర్తనను బట్టే ఒకడు దేవుని దృష్టిలో గొప్పవాడిగా పరిగణించబడతాడన్న ఇస్లాం బోధలే.

ఈ రోజుకూ భారతదేశంలో “దళిత్ ముస్లిమ్స్” ఉన్నారు, దళిత ముస్లిం కాలనీలు సైతం ఉన్నాయన్న విషయం బహుశా ఇస్లామోఫోబియాను ప్రదర్శించే కొందరు నాస్తికోన్మాదులకు తెలీదు.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *